News
News
వీడియోలు ఆటలు
X

Stock Market: స్టాక్‌ మార్కెట్‌లో పావు వంతు పెట్టుబడి దేశీయ ఇన్వెస్టర్లదే, సరికొత్త ఘనత ఇది

కరోనా కాలంలో మిగిలిన అన్ని దేశాల స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలితే, మన మార్కెట్లు మాత్రం భారీగా నష్టపోకుండా అడ్డుకుంది దేశీయ ఇన్వెస్టర్లే.

FOLLOW US: 
Share:

Stock Market Investors: అభివృద్ధి చెందిన దేశాలు సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో పెట్టుబడిదార్లకు ఇష్టమైన మాట స్టాక్ మార్కెట్. ధనవంతులు కావడానికి షార్ట్‌ కట్‌ రూట్‌ ఇది. అదే సమయంలో, పెద్ద మొత్తంలో రిస్క్‌ కూడా పొంచి ఉంటుంది. చాలా దేశాలతో పోలిస్తే, స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విషయంలో భారతీయులు ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నారు. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత, భారత స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టే వారి సంఖ్య చాలా వేగంగా పెరిగింది. కాలానుగుణంగా మారిన గణాంకాలు ఇందుకు నిదర్శనం.

తొలిసారిగా 25 శాతం దాటిన వాటా
స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన డేటాను పర్యవేక్షించే ప్రైమ్ డేటాబేస్ ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ స్టాక్ మార్కెట్‌లో దేశీయ పెట్టుబడిదార్ల జోక్యం, ఆధిపత్యం వేగంగా పెరిగింది. వాస్తవానికి, కరోనా కాలంలో మిగిలిన అన్ని దేశాల స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలితే, మన మార్కెట్లు మాత్రం భారీగా నష్టపోకుండా అడ్డుకుంది దేశీయ ఇన్వెస్టర్లే. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం..  నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSEలో లిస్టయిన కంపెనీల్లో దేశీయ ఇన్వెస్టర్ల వాటా తొలిసారిగా 25 శాతం దాటింది. మార్చి త్రైమాసికంలో ఈ మైలురాయిని అధిగమించింది.

గణాంకాల ప్రకారం, మార్చి త్రైమాసికంలో, NSEలో లిస్ట్‌ అయిన కంపెనీల్లో దేశీయ సంస్థాగత పెట్టుబడిదార్లు (domestic institutional investors లేదా DIIలు), అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ‍‌(High Net worth Individuals లేదా HNIలు) చిన్న ఇన్వెస్టర్ల (Retail investors) వాటా 25 శాతం దాటడం ఇదే మొదటిసారి. 2022 డిసెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి దేశీయ పెట్టుబడిదార్ల ఉమ్మడి వాటా 24.44 శాతంగా ఉంది, 2023 మార్చి త్రైమాసికం ముగిసే సమయానికి అది 25.72 శాతానికి చేరుకుంది.

DIIల నుంచి భారీగా పెట్టుబడులు
స్టాక్‌ మార్కెట్లలో, ముఖ్యంగా NSEలో వరుసగా ఆరు త్రైమాసికాలుగా దేశీయ ఇన్వెస్టర్ల వాటా పెరుగుతోందని ప్రైమ్ డేటాబేస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవ్ హల్దేవ్‌ వెల్లడించారు. మార్చి త్రైమాసికంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదార్ల మొత్తం నికర పెట్టుబడి రూ. 83,200 కోట్లుగా ఉంది. ఈ విధంగా మార్చి త్రైమాసికంలో తొలిసారిగా దేశీయ ఇన్వెస్టర్ల మొత్తం వాటా 25 శాతం దాటింది.

విలువ పరంగా తగ్గుదల
విలువ పరంగా చూస్తే... 2023 మార్చి త్రైమాసికంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల హోల్డింగ్‌లో క్షీణత కనిపిస్తుంది. ఆ మూడు నెలలల్లో డీఐఐ హోల్డింగ్ విలువ రూ. 42.28 లక్షల కోట్ల నుంచి రూ. 41.24 లక్షల కోట్లకు తగ్గింది. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఇది 2.47 శాతం తక్కువ. 

మరోవైపు, మార్చి త్రైమాసికంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ‍‌(FPIలు) వాటాలోనూ భారీ క్షీణత వచ్చింది. FPI హోల్డింగ్ 7.18 శాతం తగ్గి రూ. 51.85 లక్షల కోట్లకు చేరుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 06 May 2023 05:41 AM (IST) Tags: Share Market Stock Market FPI DII holding

సంబంధిత కథనాలు

RBI: రెపో రేటు మారలేదు, రియల్ ఎస్టేట్‌కు ఆర్‌బీఐ ఇచ్చిన వరమా ఇది?

RBI: రెపో రేటు మారలేదు, రియల్ ఎస్టేట్‌కు ఆర్‌బీఐ ఇచ్చిన వరమా ఇది?

Gautam Adani: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌, మళ్లీ పాత పొజిషన్‌లోకి వచ్చిన అదానీ

Gautam Adani: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌, మళ్లీ పాత పొజిషన్‌లోకి వచ్చిన అదానీ

Repo Rate: రెపో రేట్‌ మారలేదు, ఇప్పుడు బ్యాంక్‌ EMIల పరిస్థితేంటి?

Repo Rate: రెపో రేట్‌ మారలేదు, ఇప్పుడు బ్యాంక్‌ EMIల పరిస్థితేంటి?

RBI: లోన్లు తీసుకునేవాళ్లకు భారీ ఊరట - ఈసారి కూడా వడ్డీ రేట్లు పెరగలేదు

RBI: లోన్లు తీసుకునేవాళ్లకు భారీ ఊరట - ఈసారి కూడా వడ్డీ రేట్లు పెరగలేదు

Stocks To Buy: డబ్బు సంపాదించే షేర్ల కోసం వెతకొద్దు, ఇదిగో స్టాక్స్‌ లిస్ట్‌!

Stocks To Buy: డబ్బు సంపాదించే షేర్ల కోసం వెతకొద్దు, ఇదిగో స్టాక్స్‌ లిస్ట్‌!

టాప్ స్టోరీస్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News :  రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్