News
News
X

Cryptocurrency Prices: స్టాక్‌ మార్కెట్లు షాకిచ్చినా క్రిప్టో మార్కెట్లు లాభాల పంట పండిస్తున్నాయ్‌!

Cryptocurrency Prices Today, 27 February 2023: క్రిప్టో మార్కెటు సోమవారం మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కీలక కాయిన్లను కొనుగోలు చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

Cryptocurrency Prices Today, 27 February 2023:

క్రిప్టో మార్కెటు సోమవారం మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కీలక కాయిన్లను కొనుగోలు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.28 శాతం పెరిగి రూ.19.48 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.37.61 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 2.19 శాతం పెరిగి రూ.1,35,777 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.16.35 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.01 శాతం తగ్గి రూ.82.95, బైనాన్స్‌ కాయిన్‌ 1.39 శాతం పెరిగి రూ.25,479, రిపుల్‌ 0.44 శాతం తగ్గి రూ.31.27, యూఎస్‌డీ కాయిన్‌ 0.09 శాతం తగ్గి రూ.82.93, ఓకేబీ 3.86 శాతం పెరిగి రూ.4,356, డోజీ కాయిన్ 0.04 శాతం తగ్గి 6.77 వద్ద కొనసాగుతున్నాయి. డెఫిగ్రామ్‌, స్టాక్స్‌, బైకానమీ, నియో, కోకోస్‌ బీసీఎక్స్‌, రెండర్‌, నెమ్‌ లాభపడ్డాయి. ఈ కాయిన్‌, బ్లాక్స్‌, అగోరిక్‌, బిట్‌జెర్ట్‌, యాక్సెస్‌ ప్రొటొకాల్‌, కైబర్‌ నెట్‌వర్క్‌, ఆర్టిఫీషియల్‌ లిక్విడ్‌ నష్టపోయాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 27 Feb 2023 10:51 AM (IST) Tags: Bitcoin Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin cryptocurrency

సంబంధిత కథనాలు

Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!

Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!

Stock Market News: ఫెడ్‌ రేట్ల పెంపుతో బ్యాంక్స్‌ స్టాక్స్‌ ఢమాల్‌ - సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌

Stock Market News: ఫెడ్‌ రేట్ల పెంపుతో బ్యాంక్స్‌ స్టాక్స్‌ ఢమాల్‌ - సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌

Best Mileage Cars: రూ. 10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే - ఏకంగా 34 కిలోమీటర్ల వరకు!

Best Mileage Cars: రూ. 10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే - ఏకంగా 34 కిలోమీటర్ల వరకు!

Bank Holidays list in April: ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంక్‌లకు సెలవులు - లిస్ట్‌ ఇదిగో

Bank Holidays list in April: ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంక్‌లకు సెలవులు - లిస్ట్‌ ఇదిగో

E-Commerce: ఈ-కామర్స్‌ మోసాలకు, కంపెనీలకు లంకె - కొత్త రూల్స్‌ తెస్తున్న కేంద్రం

E-Commerce: ఈ-కామర్స్‌ మోసాలకు, కంపెనీలకు లంకె - కొత్త రూల్స్‌ తెస్తున్న కేంద్రం

టాప్ స్టోరీస్

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?