Cars per Household: మహీంద్ర &మహీంద్ర (Mahindra & Mahindra) గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొత్త విషయాలను, విభిన్న ఆవిష్కరణలను తన ట్వీట్ల ద్వారా పంచుకుంటూ, ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు.
భారతదేశంలోని కార్ మ్యాప్‌ను వివరిస్తూ ఆనంద్ మహీంద్ర ఒక ట్వీట్ చేశారు. ఈ మ్యాప్ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా కార్ల యజమానుల శాతాన్ని చూపుతోంది. జాతీయ కుటుంబ & ఆరోగ్య సర్వే 2019-21 నివేదిక ఆధారంగా, ఆనంద్ మహీంద్ర ఈ సమాచారాన్ని షేర్ చేశారు. దేశంలోని మొత్తం కుటుంబాల్లో 7.5% కుటుంబాలకు కార్లు ఉన్నాయని ఈ నివేదిక చూపిస్తోంది.
దేశంలోని ఏ రాష్ట్రం/యూటీలో ఎంత మంది కార్ ఓనర్స్ ఉన్నారు?
గోవా: ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన సమాచారం ప్రకారం, గోవాలో గరిష్టంగా 45.2% కుటుంబాల ఇంట్లో కనీసం ఒక కారు ఉంది. అంటే, దాదాపు సగం కుటుంబాలకు సొంత కార్ ఉంది.
కేరళ: ఈ రాష్ట్రంలో 24.2% కుటుంబాలకు కారు ఉంది. అంటే, ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒక కుటుంబానికి కార్ ఉంది.
జమ్ము & కశ్మీర్: 23.7% కుటుంబాలు కారును కలిగి ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్: ఈ రాష్ట్రంలో 22.1% కుటుంబాలకు కారు ఉంది.
పంజాబ్: ఇక్కడ 21.9% కుటుంబాలు కారును కలిగి ఉన్నాయి.
నాగాలాండ్: 22.3% కుటుంబాల్లో కార్ ఓనర్స్ ఉన్నారు.
సిక్కిం: 20.9% కుటుంబాలు కారును కలిగి ఉన్నాయి.
దిల్లీ: 19.4% కుటుంబాలకు కనీసం ఒక కారు ఉంది.
అరుణాచల్ ప్రదేశ్: ఈ రాష్ట్రంలోని 19.3% కుటుంబాలు కారును కలిగి ఉన్నాయి.
మణిపూర్: ఇక్కడ 17% కుటుంబాలు సొంత కార్ డ్రైవ్ చేస్తున్నాయి.
మిజోరం: 15.5% కుటుంబాలు కారును కలిగి ఉన్నాయి.
హరియాణా: ఈ రాష్ట్రంలో 15.3% కుటుంబాలు కారును కలిగి ఉన్నాయి.
మేఘాలయ: 12.9% కుటుంబాలకు ఒక్క కారైనా ఉంది.
ఉత్తరాఖండ్: ఈ రాష్ట్రంలో 12.7% కుటుంబాలకు కారు ఉంది.
గుజరాత్: 10.9% కుటుంబాలు కారు కలిగి ఉన్నాయి.
కర్ణాటక: 9.1% కుటుంబాల్లో కార్ ఓనర్స్ ఉన్నారు.
మహారాష్ట్ర: 8.7% కుటుంబాలు సొంత కారును నడుపుతున్నాయి.
రాజస్థాన్: 8.2% కుటుంబాల్లో కారు ఉంది.
అసోం: 8.1% కుటుంబాలు కారును కలిగి ఉన్నాయి.
తమిళనాడు: 6.5% కుటుంబాలకు కనీసం ఒక కారు ఉంది.
తెలంగాణ: 6.5% కుటుంబాలకు సొంత కారు ఉంది.
ఉత్తరప్రదేశ్: 5.5% కుటుంబాలు కారును కలిగి ఉన్నాయి.
మధ్యప్రదేశ్: ఇక్కడ, 5.3% కుటుంబాలు సొంత కార్‌ను ఎంజాయ్ చేస్తున్నాయి.
త్రిపుర: ఇక్కడ, 4.6% కుటుంబాలు సొంత కారులో షికారు చేస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్: ఈ రాష్ట్రంలో 4.3% కుటుంబాలు కారును కలిగి ఉన్నాయి.
ఝార్ఖండ్: 4.1% కుటుంబాలకు కనీసం ఒక కారు ఉంది.
పశ్చిమ బంగాల్: ఇక్కడ, 2.8% కుటుంబాలకు కారు ఉంది.
ఆంధ్రప్రదేశ్: 2.8% కుటుంబాలు కారును కలిగి ఉన్నాయి.
ఒడిశా: ఈ రాష్ట్రంలో 2.7% కుటుంబాల్లో కార్ ఓనర్స్ ఉన్నారు.
బిహార్: 2% కుటుంబాలు కారును కలిగి ఉన్నాయి.