పాఠశాల విద్యాశాఖకు 32,308 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,567 కోట్లు కేటాయించారు.
AP Budget 2026 Updates: పవన్, లోకేష్ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే!
AP Budget 2026 Updates:ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో లోకేష్, పవన్ కల్యాణ్ శాఖలకు భారీగానే నిధులు కేటాయించారు.

AP Budget 2026 Updates: ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖలను పర్యవేక్షిస్తున్నారు. లోకేష్ విద్యారంగంతోపాటు, ఐటీ శాఖను చూస్తున్నారు. మరి ఈ శాఖలకు కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం.
విద్య అనేది కేవలం భవనాలు, పాఠ్య ప్రణాళికలు లేదా పరీక్షలకే పరిమితం కాదని, బిడ్డకు మంచి భవిష్యత్ భరోసా ఇవ్వడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. పిల్లలు గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యాలతో సిద్ధమవుతున్నారని అన్నారు.
2019-24 మధ్య కాలంలో విద్యావ్యవస్థ తీవ్రమైన విద్య, సంస్థాగత వెనుకబాటుకు గురైందని అన్నారు. సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టిన సంస్కరణలు గందరగోళాన్ని సృష్టించాయని అన్నారు తొందరపాటు నిర్ణయంతో వెయ్యి పాఠశాలలను సీబీఎన్‌ఈ విధానానికి మార్చడం వల్ల సుమారు 90 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారని గుర్తు చేశారు. నాడు నేడు కార్యక్రమంలో చేపట్టిన 7, 876 కోట్లు పనులు పాలనా వైఫల్యాల వల్ల అసంపూర్తిగా మిగిలిపోయాయని అన్నారు.
సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ప్రతి విద్యార్థికి ఏటా 15000 అందజేస్తున్నారు. దీని వల్ల 67, 27 లక్ష మంది విద్యార్థులకు మేలు జరుగుతోంది. పరిపాలన పారదర్శకతను మెగా పేరెంట్ టీచ్ సమావేశాలు, పాఠశాల స్టార్ రేటింగ్ వ్యవసస్థ, సమాజ భాగస్వామ్యం ద్వారా బలోపేతం చేశామన్నారు. అనేక సంవత్సరాలుగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండేవని అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా నోటిఫై చేసిన 16, 347 పోస్టుల్లో 15, 941 ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశామన్నారు.
భవిష్యత్ ఉపాధి అవసరాలకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థు రూపొందిస్తున్నామన్నారు. విద్య పరిశ్రమలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల మధ్య సమన్వయంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించేందుకు అన్ని ప్రభుత్వ ఐటీఐలు 167 పరిశ్రమ భాగస్వాములతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9,188 మంది శిక్షణార్థులు పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణ పొందగా, ప్రభుత్వ ఐటీఐ విద్యార్థుల్లో 98 శాతం మంది నియామకాల లేదా అప్రెంటిస్ అవకాశాలను పొందారని ప్రకటించారు.
మరింత మంచి చేసేందుకు ఈ సారి పాఠశాల విద్యాశాఖకు 32, 308 కోట్లు, అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల సమగ్రాభివృద్ధికి 15, 00కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,567 కట్లు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు 12, 32కోట్లు కేటాయించారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి భారీ కేటాయింపులు
పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం రూపాంతరం చెందుతోందని అన్నారు. పవన్ చేపట్టిన కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బడ్జెట్‌లో 22, 942 కోట్లను కేటాయించారు.
పర్యావరణ, అటవీ విజ్ఞాన శాస్త్రానికి ఇచ్చిన కేటాయింపులు ఇవే
గత ప్రభుత్వం వైఫల్యాలు కారణంగా ఎర్ర చందనం అక్రమ రవాణా అక్రమ గనుల తవ్వకం, అటవీ భూముల ఆక్రమణ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏపీని హరిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు 2030 నాటికి 37శాతం 2047 నాటికి 50 శాతం పచ్చదనం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ను అమలు చేయనున్నామని వివరించారు. అందుకే ఈ డిపార్ట్‌మెంట్‌కు 714 కోట్లు కేటాయించారు.
Frequently Asked Questions
ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖకు ఎంత బడ్జెట్ కేటాయించారు?
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు ఎంత కేటాయింపులు జరిగాయి?
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు 12,32 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఐటీఐ విద్యార్థుల్లో 98 శాతం మంది నియామకాలు లేదా అప్రెంటిస్ అవకాశాలను పొందారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి ఎంత బడ్జెట్ కేటాయించారు?
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి 22,942 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు.
పర్యావరణ, అటవీ విజ్ఞాన శాస్త్ర రంగానికి కేటాయింపులు ఎంత?
ఈ విభాగానికి 714 కోట్లు కేటాయించారు. 2030 నాటికి 37%, 2047 నాటికి 50% పచ్చదనం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.






















