Nirmala Sitharaman Budget 2024 Speech: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Niramala Sitharaman) అన్నారు. గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో నిర్మలా కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. 2014లో ప్రధాని మోదీ అధికారం చేపట్టినప్పుడు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ప్రజలకు ఉపాధి లభించేలా ప్రజా ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించారు. అన్ని వర్గాలు, ప్రజలందరి సమ్మిళిత వృద్ధి, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం.' అని పేర్కొన్నారు.


Also Read: Interim Budget 2024: వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్‌ ఉంటుంది - నిర్మలా సీతారామన్