Hilarious memes are coming on social media about providing massive income Tax relief: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వేతన జీవులకు పెద్ద ఎత్తున రిలీఫ్ లభించింది. నెలకు లక్ష రూపాయలు జీతం సంపాదించే వారికి బడ్జెట్‌లో ఎలాంటి ఇన్ కంట్యాక్స్ లేకుండా ఆఫర్ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వస్తున్నాయి.  

భారత్‌లో రూ. లక్ష లోపు నెల జీతం తీసుకునే వాళ్లే 90 శాతం మంది ఉంటారు. వారందరికీ ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభించింది. అదే సమయంలో భారీ శ్లాబుల్లో ఉన్న వారికి కూాడా మినహాయింపు లభించింది. ఇది మద్యతరగతి ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది.  

 

వివిధ సినిమా క్లిప్పుల్లో సూపర్ హ్యాపీగా ఉండే సీన్లను మధ్యతరగతికి అన్వయించి మీమ్స్ పోస్టు చేస్తున్నారు. 

 

 

 

అయితే పన్నెండు లక్షల కంటే ఎక్కువ శాలరీ ప్యాకేజీ ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బందే. అందుకే  పన్నెండు లక్షల కన్నాకాస్త ఎక్కువ ఆఫర్ ప్యాకేజీ ఉన్న వారి పరిస్థితిపై మీమ్స్ కూడా పెడుతున్నారు.