AP Budget Updates: ఏపీ బడ్జెట్‌లో సెక్టార్స్, పథకాల వారీగా కేటాయింపులు ఇవే!
AP Budget Updates: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇవాళ ప్రవేశ పెట్టనున్నారు. దీనికి సంబంధించిన లైవ్ అప్‌డేట్ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేయండి.
LIVE

Background
AP Budget Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ నిర్ణయించే కీలకమైన బడ్జెట్ నేడు సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇవాళ శాసనసభ, మండలిలో ఈ బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈసారి బడ్జెట్ పరిణామం 3.32లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా ఉంది. గతేడాది ప్రవేశ పెట్టిన 3,22, 359 కోట్లతో పోలిస్తే ఈశారి పదివేల కోట్లు పెరిగే అవకాశం ఉంది.
బడ్జెట్ రోజున షెడ్యూల్ ఇలా ఉంది...
ఉదయం పదిన్నరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలను కేబినెట్ మంత్రులు ఆమోదించనున్నారు. అనంతరం 11. 15 నిమిషాలకు సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఆయన బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడతారు.
శాసన మండలిలో హోంమంత్రి అనిత రాష్ట్ర బడ్జెట్‌ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయం బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఉభయ సభలు వాయిదా పడతాయి. ఫిబ్రవరి 1, 18 తేదీల్లో ఈ బడ్జెట్‌పై సమగ్ర చర్చ, అనంతరం సభ ఆమోదం ఉంటుంది.
ఈ సారి బడ్జెట్ రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వం కొంత అప్రమత్తంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో కోత పడటంతో అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలకు ఇచ్చే రెవెన్యూ లోటు నిధులను నిలిపేశారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఏడాదికి సుమారు పదివేల కోట్లు తగ్గిపోయినట్టు సమాచారం. అంతేకాకుండా ఇతర గ్రాంట్లను కూడా కేంద్రం నిలిపివేసింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటా పెరుగుతుందని ఆశించినా అది చాలా స్వల్పంగా పెరిగింది. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ మొత్తాన్ని పది శాతం పెంచుతూ వస్తుంటారు. కానీ ఈ పరిమితుల వల్ల ఈ సారి కేవలం పదివేల కోట్లు అంటే సుమారు మూడు శాతం మాత్రమే పెంచినట్టు తెలుస్తోంది.
బడ్జెట్‌లో ఎవరికి మేలు?
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల అమలపై వెనకడుగు వేయడం లేదన తెలుస్తోంది. అందుకే ఈ కింది అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
సూపర్ సిక్స్ హామీలు- ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు అవసరమైన నిధులను ప్రభుత్వ ఈ బడ్జెట్‌లో కేటాయించే అవకాశం ఉంది.
అభివృద్ధి, సంక్షేమం- సంక్షేమ పథకాలతోపాటు రాష్ట్ర అభివృద్ధిని సమతూకం చేసేలా నిధులను కేటాయింపులు ఉండబోతున్నాయి.
మహిళలు, రైతుల సంక్షేమం- మహిళా సాధికారతకు, రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఉంటుంది.
పారిశ్రామిక రంగం- రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఉపాధి అవకాశాలను పెంచడానికి పారిశ్రామిక రంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.
మౌలిక సదుపాయాలు- కొన్నేళ్లు రాష్ట్రంలో రోడ్లు పరిస్థితిపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని పాత రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు.
AP Budget Updates:క్షేమంగా సంక్షేమం
AP Budget Updates:ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేదలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని స్పష్పం చేశారు పయ్యావు. ఆరోగ్యం, విద్య రంగాల్లో నాణ్యతను పెంచేందుకు ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. "రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గ్రామీణ రహదారుల అభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణకు భారీగా నిధులు కేటాయించాం."
AP Budget Updates: గృహనిర్మాణానికి రూ.5,451 కోట్లు
•గృహనిర్మాణానికి రూ.5,451 కోట్లు
* వీబీ జీ రామ్ జీ - రూ.8,365 కోట్లు
• గృహనిర్మాణం (పట్టణ-గ్రామీణ) – రూ.5,451 కోట్లు
• డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్యసేవ ట్రస్ట్ – రూ.4,000 కోట్లు
• జల జీవన్ మిషన్ – రూ.4,000 కోట్లు
• రీ ప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ – రూ.2,144 కోట్లు
• స్వచ్ఛభారత్ మిషన్ – రూ.1,037 కోట్లు
• నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ – రూ.955 కోట్లు
• ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ – రూ.838 కోట్లు























