Blinkit: బ్లింకిట్‌ నెక్ట్స్‌ లెవెల్‌ సర్వీస్‌, 30 నిమిషాల్లో మీ ఇంటికి - అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో డిష్యూం డిష్యూం

30-Minute Deliveries: బ్లింకిట్, తన సర్వీసుల్లో సూపర్‌ మార్పు చేస్తోంది. 'ఎక్స్‌ప్రెస్ డార్క్ స్టోర్స్'ను ఇందుకు ఉపయోగించుకుంటుంది. తద్వారా.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో నేరుగా ఫైటింగ్‌కు రెడీ అయింది.

Continues below advertisement

Blinkit Enters Into 30-Minute Deliveries: జోమాటో (Zomato) యాజమాన్యంలో పని చేసే బ్లింకిట్, కొత్త సర్వీస్‌ను మొదలు పెట్టబోతోంది. అధిక విలువైన వస్తువులను 30 నిమిషాల్లో డెలివరీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్విక్ కామర్స్ (quick commerce) ప్లాట్‌ఫామ్, కేవలం 10 నిమిషాల్లోనే కిరాణా సరుకులను డెలివరీ చేస్తూ బాగా పాపులర్‌ అయింది. ఇప్పుడు, లాభాలను మరింత పెంచుకోవడానికి తన సర్వీస్‌ సెగ్మెంట్‌ను విస్తరిస్తోంది.

Continues below advertisement

30 నిమిషాల్లో డెలివెరీ
మనీకంట్రోల్ రిపోర్ట్‌ ప్రకారం, బ్లింకిట్ ఇప్పటికే 'ఎక్స్‌ప్రెస్ డార్క్ స్టోర్స్'ను (Express Dark Stores) చాలా వేగంగా ఏర్పాటు చేస్తోంది. వాటర్ హీటర్లు, ఆభరణాలు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, ఇతర అధిక-విలువైన ఉత్పత్తులను ఆర్డర్‌ చేసిన 30 నిమిషాల్లోనే డెలివరీ చేయడానికి ఈ స్టోర్లను ఉపయోగించుకుంటుంది.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో డైరెక్ట్ ఫైట్‌ 
అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) వంటి ఈ-మార్కెట్‌ ప్లేస్‌లు, ఇప్పటికే, దేశంలో ఎక్కడికక్కడ సొంతంగా స్టోర్స్‌ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ గిడ్డంగుల్లో వస్తువులను స్టోర్‌ చేస్తున్నాయి. ఆర్డర్‌ చేసిన వస్తువులను అదే రోజు అందిస్తాం (సేమ్‌ డే డెలివెరీ) లేదా ఒక్క రోజులో అందిస్తాం (వన్‌ డే డెలివెరీ) వంటి ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మారుతున్న మార్కెట్‌ ట్రెండ్స్‌ను బట్టి వ్యాపారాల్లో వైవిధ్యం చూపుతున్నాయి. మార్జిన్‌లు పెంచుకోవడానికి మరిన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ-కామర్స్‌ను ఏలుతున్న అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మార్కెట్‌ వాటా కొట్టేయాలన్నది బ్లింకిట్‌ కొత్త ప్లాన్‌లా కనిపిస్తోంది.

డబుల్‌ సైజ్‌లో గోడౌన్లు
డార్క్ స్టోర్‌లు (గోడౌన్‌లు) క్విక్‌ కామర్స్‌ కార్యకలాపాలకు కీలకమైనవి. ఈ గిడ్డంగులు సాధారణంగా 3,000 చదరపు అడుగుల నుంచి 4,000 చదరపు అడుగుల సైజ్‌లో ఉంటాయి. దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో ఆయా కంపెనీలు ఈ గోదాములను ఏర్పాటు చేస్తాయి, వీటిలో ఉత్పత్తులు రెడీ ఉంచుతాయి. ఫలితంగా, డెలివరీలను సకాలంలో ఇవ్వడానికి వీలవుతుంది. బ్లింకిట్‌, సంప్రదాయ స్టోర్లను తలదన్నే రీతిలో ఎక్స్‌ప్రెస్ డార్క్ స్టోర్‌లను నిర్మిస్తోంది. ఒక్కోటి దాదాపు 7,000 చదరపు అడుగుల నుంచి 8,000 చదరపు అడుగుల పరిమాణంలో అతి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. చిన్న సైజ్‌ ఉత్పత్తులతో పాటు, ఎక్కువ స్థలం అవసరమయ్యే పెద్ద పరిమాణంలోని ఉత్పత్తులను నిల్వ చేయడానికి కూడా వీటిని ఉపయోగించుకుంటుంది.

డార్క్‌ స్టోర్ల నిర్మాణం పని ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (FY26) మధ్యకాలం నుంచి "30-మినిట్‌ డెలివెరీ ఆఫర్‌"ను లాంచ్‌ చేయాలని బ్లింకిట్‌ యోచిస్తోంది. సగటు ఆర్డర్ విలువను (AOV) పెంచుకోవడంతోపాటు.. జెయింట్‌ కంపెనీలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో నేరుగా పోటీపడాలన్నది బ్లింకిట్‌ ఆలోచన అని అనధికార వర్గాలు చెబుతున్నాయి.

AOV అనేది క్విక్‌ కామర్స్‌ కంపెనీ లాభదాయకతను సూచిస్తుంది. ఈ విషయంలో బ్లింకిట్‌ లీడర్‌ పొజిషన్‌లో ఉంది, అత్యధికంగా రూ.614 AOVని ఎంజాయ్‌ చేస్తోంది. దీంతో పోలిస్తే... స్విగ్గీ ఇస్టామార్ట్‌ (Swiggy Instamart), జెప్టో ‍(Zepto) రూ. 450-480 రేంజ్‌లో AOVలను కలిగి ఉన్నాయి.

టాటా గ్రూప్‌నకు చెందిన బిగ్‌బాస్కెట్ (BigBasket) కూడా 30 నిమిషాల ర్యాపిడ్‌ డెలివరీ స్పేస్‌లోకి ప్రవేశించే విషయాన్ని పరిశీలిస్తోంది. అయితే, ఈ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టిన వాటిలో బ్లింకిట్ మొదటిది.

మరో ఆసక్తికర కథనం: వాలంటరీ రిటైర్మెంట్‌ రూల్స్‌లో మార్పు - ప్రభుత్వ ఉద్యోగులు ఇది కచ్చితంగా తెలుసుకోవాలి 

Continues below advertisement