Bank Holidays in February 2023: ఈ కాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంకులతో పని ఉంటోంది. UPI పేమెంట్లు, ఏటీఎంలు వంటి బ్యాంక్‌ బయట వినియోగించుకునే సేవలు పుష్కలంగా అందుబాటులో ఉన్నా.. కచ్చితంగా  బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు కూడా చాలానే ఉన్నాయి. ఇలాంటి ఏదోక పని కోసం మీరు బ్యాంక్‌కు వెళ్లినప్పుడు, బ్యాంక్‌ సెలవు అని తెలిస్తే చాలా నిరుత్సాహపడతారు.


ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వల్ల చాలా మంది తమ పనిని ఇంట్లో కూర్చునే పని పూర్తి చేస్తున్నారు. అయితే... పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేయడానికి, డిమాండ్ డ్రాఫ్ట్ (DD), లోన్స్‌ వంటి పనుల కోసం బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లడం తప్పనిసరి. 2023 సంవత్సరంలో మొదటి నెల జనవరి అతి త్వరలో ముగియబోతోంది. రెండో నెల ప్రారంభానికి ముందే, ఆ నెలలో బ్యాంకును మొత్తం ఎన్ని రోజులు మూసేస్తారు, ఏయే రోజుల్లో మూసేస్తారు, ఏయే రోజుల్లో పని చేస్తుంది వంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు, ఫిబ్రవరి నెలలో బ్యాంక్‌లో ముఖ్యమైన పని పూర్తి చేయాల్సి వస్తే, ఆ నెలలోని సెలవుల జాబితాను గుర్తు పెట్టుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏయే రోజుల్లో బ్యాంక్‌లు పని చేయవో ముందే తెలుసుకుంటే.. దానిని బట్టి మీ పని షెడ్యూల్‌ వేసుకోవచ్చు.


ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం... 2023 ఫిబ్రవరి నెలలో బ్యాంకుకు చాలా సెలవులు ఉన్నాయి. ఆ నెల మొత్తంలో, వివిధ రాష్ట్రాల్లో మొత్తం 10 రోజుల పాటు బ్యాంకులను మూసివేస్తారు. ఫిబ్రవరి నెలలో వచ్చే సెలవుల్లో శని, ఆదివారాలు కాకుండా.. మహాశివరాత్రి వంటి పర్వదినాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలోని మొత్తం 28 రోజులలో, వివిధ రాష్ట్రాల్లో 10 రోజులు బ్యాంకులు పని చేయవు. ఈ సెలవు తేదీలు వివిధ రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. 


2023 ఫిబ్రవరి నెలలో బ్యాంకు సెలవుల జాబితా:


ఫిబ్రవరి 5, 2023 - ఆదివారం (భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 11, 2023 - రెండో శనివారం (భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 12, 2023 - ఆదివారం (భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 15, 2023- Lui-Ngai-Ni పండుగ (హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 18, 2023 - మహాశివరాత్రి (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, హైదరాబాద్, కాన్పూర్, లఖ్‌నవూ, ముంబై, నాగ్‌పుర్, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 19, 2023 - ఆదివారం (భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 20, 2023 - మిజోరం రాష్ట్ర దినోత్సవం (ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 21, 2023- లోసార్ పండుగ (గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 25, 2023 - మూడో శనివారం (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 26, 2023 - ఆదివారం (భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు)


బ్యాంక్ సెలవు రోజుల్లో మన పని ఎలా పూర్తి చేయాలి?
ఏ నెలలోనైనా బ్యాంక్‌ సెలవులను ముందే గుర్తించడం ద్వారా, ఆ పనిని బ్యాంక్‌ సెలవు రోజు ముందో, సెలవు రోజు తర్వాతకో మనం షెడ్యూల్‌ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్‌ సెలవు ఉన్న రోజే ఏదైనా పని ఉంటే, ఆన్‌లైన్‌ ద్వారా ఆ పనిని పూర్తి చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు సంవత్సరంలో 365 రోజులు, రోజులో 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. వీటికి ఎలాంటి సెలవులు వర్తించవు.