Bank Holidays in October 2023: ప్రస్తుతం పండుగ సీజన్‌ కారణంగా ఈ నెలలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు వచ్చాయి. దసరా రోజున చాలా ప్రాంతాల్లో లాంగ్ వీకెండ్ ఉండబోతోంది, ఆ టైమ్‌లో మొత్తం నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతబడతాయి. మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే ఇప్పుడే ఆ పని పూర్తి చేసుకోండి.


ఈ నెలలో (అక్టోబర్), 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయలేదు. 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కటి బిహు, దుర్గాపూజ, దసరా, లక్ష్మీ పూజ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వంటివి ఉన్నాయి, ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఇస్తారు. సెలవు రోజుల్లో కేవలం ఆన్‌లైన్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.


వరుసగా నాలుగు రోజులు సెలవులు
దసరా సందర్భంగా త్రిపుర, అసోం, బెంగాల్ సహా చాలా రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి, ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు బ్యాంకులకు తాళం వేస్తారు. దుర్గాపూజ సందర్భంగా అక్టోబర్ 21న సెలవు ఉంటుంది. 22వ తేదీ ఆదివారం, 23వ తేదీ విజయదశమని, 24న దుర్గాపూజ ఉన్నాయి. అయితే ఈ సెలవులు వివిధ రాష్ట్రాల్లో మారతాయి. 


అక్టోబర్ 25 నుంచి 28 వరకు ఈ రాష్ట్రాల్లో సెలవులు
అక్టోబర్ 25 నుంచి 28 తేదీల్లో సిక్కింలో బ్యాంకులకు సెలవులు ఇచ్చారు. దుర్గాపూజ సందర్భంగా అక్టోబర్ 25, 26, 27 తేదీల్లో ఇక్కడ బ్యాంకులు మూతపడతాయి. లక్ష్మీ పూజ కోసం అక్టోబర్ 28న సెలవు తీసుకుంటారు. కర్ణాటక, ఒడిశా, కేరళ, బెంగాల్, బిహార్, జార్ఖండ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్‌లో అక్టోబర్ 22, 23, 24 తేదీల్లో బ్యాంకులు పని చేయవు. కటి బిహు సందర్భంగా అసోంలోని బ్యాంకులకు అక్టోబర్ 18న హాలిడే.


అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజుల పాటు హాలిడేస్‌ వచ్చాయి. వీటిలో ఆదివారం, రెండు & నాలుగు శనివారాలు కూడా కలిసి ఉన్నాయి. బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ నెలా విడుదల చేస్తుంది.


2023 అక్టోబర్‌ నెలలో ఇంకా మిగిలి ఉన్న బ్యాంక్‌ సెలవు రోజులు:


18 అక్టోబర్ 2023- కటి బిహు కారణంగా గువాహతిలో బ్యాంకులు పని చేయవు
21 అక్టోబర్ 2023- దుర్గాపూజ/మహా సప్తమి కారణంగా అగర్తల, గువాహతి, ఇంఫాల్, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు
22 అక్టోబర్ 2023- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
24 అక్టోబర్ 2023- దసరా, హైదరాబాద్, ఇంఫాల్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
25 అక్టోబర్ 2023- దుర్గాపూజ (దసాయి) కారణంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులను మూసివేస్తారు
26 అక్టోబరు 2023- దుర్గాపూజ (దసాయి)/ప్రవేశ దినం గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్‌లలో బ్యాంకులు పని చేయవు
27 అక్టోబర్ 2023- దుర్గాపూజ (దసాయి) రోజున గాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు
28 అక్టోబర్ 2023- నాలుగో శనివారం, దేశం మొత్తం బ్యాంకులకు సెలవు
29 అక్టోబర్ 2023- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
31 అక్టోబర్ 2023- సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లోని బ్యాంకులకు సెలవు


బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్‌ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 


మరో ఆసక్తికర కథనం: మరింత తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial