Bank Holiday In April 2025: మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ నెల ప్రారంభం అవుతుంది. మన దేశంలో, సాధారణంగా, ఏప్రిల్‌ నుంచి సెలవుల కాలం ప్రారంభమవుతుంది. స్కూళ్లు, కాలేజీల్లో పరీక్షలు పూర్తి చేసుకుని విద్యార్థులు సెలవులను ఎంజాయ్‌ చేస్తారు. ఇక, బ్యాంక్‌ సెలవుల విషయానికి వస్తే.. నెల ప్రారంభంలోనే, అంటే ఏప్రిల్ 01, 2025న బ్యాంకుల్లో ఆర్థిక కార్యకలాపాలు ఉండవు. పాత ఆర్థిక సంవత్సరానికి సంబంధిత ఖాతాలను ముగించే పనుల కారణంగా, 2025 ఏప్రిల్ 01న బ్యాంకుల్లో సాధారణ బ్యాంకింగ్‌ జరగదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. 

ఇది కాకుండా, ఏప్రిల్‌లో బ్యాంకులు మరో 13 రోజులు (మొత్తం 14 రోజులు) సెలవులో ఉంటాయి. వీటిలో - శ్రీ రామ నవమి వంటి పండుగలు, అంబేద్కర్ జయంతి వంటి వివిధ సందర్భాలు, రెండు & నాలుగు శనివారాలు, అన్ని ఆదివారాలు కలిసి ఉంటాయి. వచ్చే నెలలో రెండో శనివారం, ఆదివారం, అంబేద్కర్ జయంతి సందర్భంగా బ్యాంక్‌లు ఏప్రిల్‌ 12 నుంచి ఏప్రిల్‌ 14 వరకు వరుసగా 3 రోజులు సెలవులో ఉంటాయి.

బ్యాంక్‌ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ప్రాంతీయ పండుగల సమయంలో, కేవలం ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో బ్యాంక్‌లు పని చేస్తాయి. కాబట్టి, వచ్చే నెలలో మీకు బ్యాంక్‌లో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, ఏప్రిల్‌ నెల బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను సేవ్‌ చేసుకోవడం చాలా ముఖ్యం.

ఏప్రిల్‌ 2025లో బ్యాంక్‌ సెలవులు ‍‌(Bank Holidays For April 2025)

ఏప్రిల్ 06 --  ఆదివారం -- శ్రీ రామ నవమి సందర్భంగా బ్యాంకులు పని చేయవు. ఇది హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటి. శ్రీరామ నవమి సందర్భంగా చాలా రాష్ట్రాల్లో విశేష పూజలు జరుగుతాయి.ఏప్రిల్ 10 -- గురువారం -- జైన మతం 24వ తీర్థంకరుడు భగవాన్ మహావీర్ జయంతి. జైన మతస్థులు ఈ పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు ప్రభుత్వ సెలవు కారణంగా బ్యాంకులు కూడా మూతబడతాయి. ఏప్రిల్ 12 -- శనివారం -- ఏప్రిల్ నెలలో రెండో శనివారం కారణంగా, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, దేశంలోని అన్ని బ్యాంకులు సెలవు తీసుకుంటాయి.  ఏప్రిల్ 13 -- ఆదివారం -- ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.ఏప్రిల్ 14 -- సోమవారం -- రాజ్యాంగ నిర్మాత బాబా భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే. ఏప్రిల్ 15  -- మంగళవారం -- బోహాగ్ బిహు కారణంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కోల్‌కతా & సిమ్లాలో బ్యాంకులు మూతబడి కనిపిస్తాయి.ఏప్రిల్ 16  -- బుధవారం -- బోహాగ్ బిహు కారణంగా గౌహతిలో బ్యాంకులు సెలవులో ఉంటాయి.ఏప్రిల్ 18 -- శుక్రవారం -- క్రైస్తవులకు అత్యంత కీలకమైన గుడ్ ఫ్రైడే కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే ఉంటుంది.ఏప్రిల్ 20 -- ఆదివారం -- ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.ఏప్రిల్ 21 -- సోమవారం -- గరియా పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు పని చేయవు.ఏప్రిల్ 26 -- శనివారం -- నెలలో నాలుగో శనివారం కాబట్టి రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం, దేశంలోని అన్ని బ్యాంకులు సెలవు తీసుకుంటాయి.ఏప్రిల్ 27 -- ఆదివారం -- ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.ఏప్రిల్ 29 -- మంగళవారం -- శ్రీ పరశురామ జయంతి సందర్భంగా బ్యాంకులు మూతబడతాయి.ఏప్రిల్ 30 -- బుధవారం -- బసవ జయంతి & అక్షయ తృతీయ సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు హాలిడే తీసుకుంటాయి.

బ్యాంక్‌ సెలవుల సమయంలో ఆర్థిక లావాదేవీల కోసం మీరు మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. ATM నుంచి కూడా డబ్బు విత్‌డ్రా చేయవచ్చు. ఇవి 24 గంటలూ పని చేస్తాయి.