Amul Milk Price Hike: మరోసారి అమూల్ పాల ధర పెంపు, నిద్ర లేవడంతోనే కస్టమర్లపై భారం

Milk Price Hike: గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) పాల వినియోగదారులకు భారీ షాకిచ్చింది. అమూల్ పాలపై లీటర్ రూ.2 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూన్ 3 నుంచి ఇది వర్తిస్తుంది.

Continues below advertisement

Amul Hikes Milk Price from June 3:  హైదరాబాద్: పాలు వినియోగదారులకు అమూల్ సంస్థ భారీ షాకిచ్చింది. ఒక లీటరుపై రూ.2 మే పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. పెరిగిన పాల ధర జూన్ 3 నుంచి అమలులోకి వస్తుందని అమూల్ పేర్కొంది. అమూల్ పేరుతో GCMMF పాల ఉత్పత్తులను విక్రయించడం తెలిసిందే. అమూల్ తాజా నిర్ణయంతో అన్ని వేరియంట్లు అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ టీ స్పెషల్ మిల్క్ ధరలు సోమవారం నుంచి లీటరుపై రూ.2 చొప్పున పెరుగుతాయి. దేశ వ్యాప్తంగా అమూల్ సవరించిన ధరలు అమలులోకి వచ్చాయి.

Continues below advertisement

కొత్త ధరలు ఇలా ఉన్నాయి..
ధరల పెంపు అనంతరం ప్రస్తుతం అమూల్ గేదె పాల ధర లీటరుకు రూ.73కి చేరుకుంది. అమూల్ గోల్డ్ పాలు లీటర్ ధర రూ.66 నుంచి రూ.68 కాగా, అమూల్ శక్తి లీటరుకు రూ.60కి చేరుకుంది. అమూల్ తాజా పాల ధర లీటర్ రూ.56 కాగా, ఆఫ్ లీటర్ రూ.28కి చేరింది. అమూల్ గేదె పాలు ఆఫ్ లీటర్ రూ.37, అమూల్ గోల్డ్ ఆఫ్ లీటర్ రూ.34, అమూల్ శక్తి అర్ధ లీటర్ రూ.30 అయింది.

అమూల్ ఆవు పాల ధర లీటర్ రూ.57 కాగా, అర్ధ లీటర్ రూ.29కి పెరిగింది. అమూల్ స్లిమ్ అండ్ ట్రిమ్ కస్టమర్లు అర్ధ లీటర్ పై రూ.25, లీటర్ పౌచ్ పై రూ.49 చెల్లించాల్సి ఉంటుంది. సాగర్ స్కిమ్మిడ్ పాల ధర ఆఫ్ లీటర్ రూ.20, లీటర్ ధర రూ.40 వద్ద స్థిరంగా ఉన్నాయి. 


ఏడాది తరువాత పెరిగిన అమూల్ పాల ధరలు 
ఫిబ్రవరి 2023 తర్వాత అమూల్ పాల ధరలు పెంచడం ఇదే తొలిసారి. జీసీఎంఎంఎఫ్ గుజరాత్ రాష్ట్రంలోని పాల సహకార సంఘాల అపెక్స్ బాడీ సాధారణంగా పాల ధరల పెంపు గురించి ముందుగానే ప్రకటిస్తుంది. కానీ తాజాగా పాల ధరను నేరుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో అమూల్ పాల వినియోగదారులపై లీటర్ పై రూ.2 మేర భారం పడుతుంది. పశుగ్రాసంతో పాటు రవాణా ఖర్చులు, పాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో అమూల్ పాల ధర పెంపు నిరణయం తీసుకున్నారు. ఎమ్మార్పీలో కేవలం 3, 4 శాతం పెంచామని, ఇది ఆహార ద్రవ్యోల్బణంతో పోల్చితే చాలా తక్కువ అని జీసీఎంఎంఎఫ్ పేర్కొంది. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా, పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు ధరలు పెంచినట్లు స్పష్టం చేసింది.

 

Continues below advertisement