Update Aadhaar Details Free By Online: ఆధార్‌ కార్డ్‌లో అన్ని వివరాలను అప్‌డేట్‌ చేయడానికి, ఏవైనా తప్పులు ఉంటే సవరించడానికి ఇప్పుడు 'ఫ్రీ ‍ఆఫర్‌' (Update Aadhaar Details For Free) నడుస్తోంది. ఒకవేళ మీరు ఇల్లు మారితే ఆధార్‌లో అడ్రస్‌ ఛేంజ్‌ చేయడం దగ్గర నుంచి.. ఆధార్‌ కార్డ్‌పై ఉన్న పేరులో స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌, పుట్టిన తేదీలో తప్పులు వంటి వాటిని సరిచేయడం వరకు అన్నీ ఇప్పుడు పూర్తి ఉచితం. అయితే, ఈ ఫ్రీ ఆఫర్‌కు మరికొన్ని రోజులే గడువు ఉంది. 


ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే గడువు


ఆధార్‌ వివరాలను ఉచితంగా మార్చుకునేందుకు ఉడాయ్‌ (UIDAI) ఈ నెల (జూన్‌ 2024) 14వ తేదీతో వరకే సమయం ఇచ్చింది. జూన్‌ 15వ తేదీ నుంచి ఫ్రీ ఆఫర్‌ వర్తించదు, ఆధార్‌ కార్డ్‌లో ఏవైనా మార్పులు చేయాలంటే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.


'నా ఆధార్‌ కార్డ్‌లో అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయి, ఎలాంటి అప్‌డేషన్స్‌ అవసరం లేదు' అని అనుకోవడానికి లేదు. మీ ఆధార్‌ కార్డ్‌ తీసుకుని పది సంవత్సరాలు దాటితే, గత పదేళ్లుగా ఆధార్‌ వివరాల్లో మీరు ఎలాంటి మార్పులు చేయకపోతే ఇప్పుడు ఆధార్‌ కార్డ్‌ను అప్‌డేట్‌ చేయాలి. ఒకవేళ, మీరు ఆధార్‌ కార్డ్‌ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వివరాల్లో ఒక్క మార్పు కూడా లేకపోయినప్పటికీ, అవే వివరాలతో మరోమారు అప్‌డేట్‌ చేయాలి. అయితే, ఇది నిర్బంధమేమీ కాదు, ఐచ్చికం. ఎలాగూ ఫ్రీ ఆఫర్‌ నడుస్తోంది కాబట్టి, ఒకసారి ఆధార్‌ను అప్‌డేట్‌ చేస్తే ఓ పనైపోతుంది.


ఇంటి అడ్రస్‌ సహా ఆధార్‌ వివరాలను జూన్‌ 14వ తేదీ వరకు ‍‌(Last Date For Update Aadhaar Details) ఉచితంగా అప్‌డేట్‌ చేయవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా అప్‌డేట్‌ చేసే వాళ్లకే ఈ అవకాశం. ఆఫ్‌లైన్‌లో, అంటే ఆధార్‌ కేంద్రం/CSCకి వెళ్లి అడ్రస్‌ ఆధార్‌ సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలంటే దానికి కొంత ఛార్జీ చెల్లించాలి.


ఆధార్‌ కార్డ్‌లో అడ్రస్‌ వివరాలను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలి? (How Update Address in Aadhaar Card For Free?)


మీరు ఇటీవలే ఇల్లు మారితే, కొత్త అడ్రస్‌ను మీ ఆధార్‌ వివరాల్లో అప్‌డేట్‌ చేయాలనుకుంటే అది చాలా చిన్న విషయం. మీ దగ్గర అడ్రస్‌ ప్రూఫ్‌ ఉంటే చాలు. ఈ నెల 14వ తేదీ లోపు, పూర్తి ఉచితంగా ఈ పని పూర్తి చేయొచ్చు. ఆధార్‌లో అడ్రస్‌ అప్‌డేట్‌ చేయడానికి... మీ ఆధార్ నంబర్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌, స్కాన్‌ చేసిన అడ్రస్‌ ప్రూఫ్‌ దగ్గర పెట్టుకోవాలి. 


ఆధార్‌ కార్డ్‌లో అడ్రస్‌ వివరాలు మార్చడం: 


myaadhaar.uidai.gov.in లింక్‌ ద్వారా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
మీ ఆధార్‌ నంబర్‌ను సంబంధింత గడిలో పూరించండి
మీ ఆధార్‌తో లింక్‌ అయిన ఫోన్‌ నంబర్‌కు వచ్చే OTPని కూడా పూరించి, లాగిన్ అవ్వండి
మీ పేరు/ జెండర్‌/ పుట్టిన తేదీ, చిరునామాలో ఒక ఆప్షన్‌ ఎంచుకోండి
'అప్‌డేట్ ఆధార్' ఆప్షన్‌ ఎంచుకోండి
ఇంటి చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్‌ చేయడానికి అక్కడ కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
స్కాన్ చేసిన ప్రూఫ్‌ కాపీలను అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను (Demographic data) అప్‌డేట్‌ చేయండి


ఇప్పుడు మీకు ఒక్‌ అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్ (URN) వస్తుంది. ఇది మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు, రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌ అడ్రస్‌కు వస్తుంది. ఆధార్‌ అప్‌డేషన్‌ స్టేటస్‌ ‍‌(Aadhaar Updation Status) చెక్‌ చేయడానికి URN ఉపయోగపడుతుంది. ఆధార్‌ అప్‌డేట్‌ చేసిన రెండు, మూడు రోజుల తర్వాత https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్‌ ద్వారా ఉడాయ్‌ పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ అప్‌డేషన్‌ స్టేటస్‌తనిఖీ చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి