Yezdi Roadster Full Details: యెజ్డీ మోటార్‌సైకిల్స్‌ బ్రాండ్‌ నుంచి నుంచి వచ్చిన Yezdi Roadster, ఈ ఏడాది ప్రారంభంలోనే బిగ్‌ అప్‌డేట్‌ తీసుకొచ్చింది. కొత్త స్టైలింగ్‌, మెరుగైన బిల్డ్‌ క్వాలిటీ, మెకానికల్‌ రిఫైన్‌మెంట్స్‌తో ఈ బైక్‌ను యెజ్డీ మరింత ఆకర్షణీయంగా మార్చింది. రోడ్‌స్టర్‌ను కొనాలనుకుంటున్న వారికి సాధారణంగా వచ్చే ప్రశ్నలకు సమాధానాలుగా, కొనే ముందు తప్పక తెలుసుకోవాల్సిన 5 కీలక విషయాలను తెలుసుకుందాం.

Continues below advertisement

1. Yezdi Roadsterలో ఎలాంటి ఇంజిన్‌ ఉంది?

Yezdi Roadster‌లో 334cc సామర్థ్యం ఉన్న సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 29.2hp పవర్‌, 29.6Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు. సిటీ రైడింగ్‌తో పాటు హైవే క్రూజింగ్‌కు కూడా సరిపడే విధంగా ఈ పవర్‌ డెలివరీ ఉంటుంది.

Continues below advertisement

2. బైక్‌ వెయిట్‌ ఎంత ఉంటుంది?

ఈ బైక్‌ డ్రై వెయిట్‌ 184 కిలోలుగా కంపెనీ పేర్కొంది. అయితే 12.5 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ను పూర్తిగా నింపిన తర్వాత, కెర్బ్‌ వెయిట్‌ దాదాపు 200 కిలోల వరకు చేరుతుంది. వెయిట్‌ కాస్త ఎక్కువగానే ఉన్నా, రోడ్‌ ప్రెజెన్స్‌ మాత్రం బలంగా కనిపిస్తుంది.

3. Yezdi Roadsterలో ఉన్న ఫీచర్లు         

ఫీచర్ల విషయానికి వస్తే, Yezdi Roadster‌లో డ్యూయల్‌ ఛానల్‌ ABS స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అలాగే LED హెడ్‌ల్యాంప్స్‌, ఫుల్‌ డిజిటల్‌ LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉన్నాయి. రైడింగ్‌ సమయంలో అవసరమైన సమాచారం అంతా క్లియర్‌గా కనిపించేలా డిస్‌ప్లేను డిజైన్‌ చేశారు.

4. కలర్‌ ఆప్షన్స్‌ ఏవి?

Yezdi Roadster ఐదు ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అవి – Sharkskin Blue, Smoke Grey, Bloodrush Maroon, Savage Green, Shadow Black. ఈ కలర్స్‌ బైక్‌కు మస్క్యులర్‌, రెట్రో-మోడ్రన్‌ లుక్‌ను ఇస్తాయి.

5. హైదరాబాద్‌, విజయవాడలో ధర ఎంత?

హైదరాబాద్‌, విజయవాడలో Yezdi Roadster ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹1,96,330గా ఉంది.

విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధర సుమారు ₹2,44,644. ఇందులో... ఎక్స్‌-షోరూమ్‌ ధరతో పాటు ఇన్సూరెన్స్‌ (Comprehensive) ₹ 16,623, RTO & ఇతర ఛార్జీలు ₹ 25,648, లాజిస్టిక్‌ ఛార్జీలు దాదాపు ₹ 6,043 కూడా కలిసి ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఆన్‌-రోడ్‌ ధర సుమారు ₹2,52,045. ఇందులో... ఎక్స్‌-షోరూమ్‌ ధరతో పాటు ఇన్సూరెన్స్‌ (Comprehensive) ₹ 17,670, RTO & ఇతర ఛార్జీలు ₹ 32,002, లాజిస్టిక్‌ ఛార్జీలు దాదాపు ₹ 6,043 కూడా కలిసి ఉన్నాయి.

రాష్ట్రాన్ని బట్టి RTO, ఇన్సూరెన్స్‌ ఛార్జీలు మారడం వల్ల ఆన్‌-రోడ్‌ ధరల్లో కాస్త తేడా ఉంటుంది.

మొత్తంగా ఎలా ఉంది?

Yezdi Roadster స్టైల్‌, పవర్‌, ఫీచర్ల పరంగా ప్రత్యేక గుర్తింపున్న బైక్‌. కంఫర్ట్‌తో పాటు బలమైన రోడ్‌ ప్రెజెన్స్‌ కోరుకునే రైడర్లకు ఇది మంచి ఆప్షన్‌. అయితే వెయిట్‌ ఎక్కువగా ఉండడం, ధర కూడా కొంచెం హై సైడ్‌లో ఉండడం గమనించాల్సిన విషయాలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.