Yamaha vs Royal Enfield New Bikes Comparison: భారత బైకింగ్ కమ్యూనిటీలో నేటి హాట్ టాపిక్ - Yamaha XSR 155 vs Royal Enfield Hunter 350. ఒక వైపు యంగ్ రైడర్స్‌కి ఫేవరెట్ అవుతున్న నియో-రెట్రో XSR 155, మరోవైపు అట్ట్రాక్టివ్ ప్రైసింగ్‌తో ఇప్పటికే మార్కెట్ హీట్ పెంచిన Hunter 350. ఈ రెండు బైక్‌లు ఫీచర్లలో, రోడ్‌పై ఎలా డిఫర్ అవుతాయో చూద్దాం.
1. ఇంజిన్ పనితీరు: XSR 155 స్పోర్టీ, Hunter 350 రిలాక్స్‌డ్
XSR 155లో ఉన్న 155cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ అసలైన స్పోర్ట్స్ DNAతో ఉంటుంది. R15, MT-15లో ఉన్న మోటార్‌నే వాడటంతో ఇది హై రేవ్స్‌లో కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. హయ్యర్ టాప్ స్పీడ్, రేవ్ చేయడానికి రెడీగా ఉండే ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ (Hunter లో లేదు) దీని సొంతం.
మరోవైపు, Hunter 350లో ఎయిర్-కూల్డ్ 349cc లాంగ్-స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. లార్జ్ cc ఉన్నా, ఇది కంఫర్ట్ రైడ్స్ కోసం తక్కువ రేవ్స్ వద్దే మంచి టార్క్ ఇస్తుంది. సిటీ, చిల్ ఔట్ రైడింగ్ కోసం బెటర్.
క్లియర్‌గా చెప్పాలంటే... స్పీడ్, స్పోర్ట్ వైబ్ కోసం XSR 155. గ్రౌండ్‌తో దగ్గరగా, రిలాక్స్‌డ్ రైడ్ కోసం Hunter 350 పర్‌ఫెక్ట్‌గా వర్కవుట్ అవుతాయి.
2. వెయిట్ & డైమెన్షన్స్: XSR 155 నిజంగా ఈజీ టు హ్యాండిల్
ఈ విషయంలో XSR 155 ఎక్కువ స్కోర్ చేస్తుంది. Hunter కంటే XSR 155 బైక్ 40 కేజీలు తక్కువ బరువు. ఇది MT-15 కంటే కూడా 4 కిలోలు తక్కువ. డి-ల్టాబాక్స్ ఫ్రేమ్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వల్ల ఈ బైక్ చాలా లైట్‌గా ఉంటుంది.హైదరాబాద్ లేదా విజయవాడ వంటి ట్రాఫిక్ సిటీల్లో లైట్ వెయిట్ అంటే పెద్ద ప్లస్ పాయింట్.
Hunter 350 లో స్టీల్-హెవీ చాసిస్ ఉండటంతో అది కొంచెం బరువుగా అనిపిస్తుంది. కానీ సీట్ హైట్ మాత్రం Hunterలో కొద్దిగా తక్కువగా ఉండటం వల్ల, కాస్త తక్కువ ఎత్తున్న రైడర్స్‌కు మేనేజ్ చేయడం ఈజీ.
గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేసరికి - చూడటానికి XSR 155 గ్రౌండ్ క్లియరెన్స్ కాస్త తక్కువగా కనిపించినా, క్లియరెన్స్ MT-15 (170mm) ఇది సమానంగా ఉంటుందని యమహా క్లారిఫై చేసింది.
3. సస్పెన్షన్, టైర్లు & బ్రేక్స్: స్పోర్టీ వైపు XSR, కంఫర్ట్ వైపు Hunter
XSR 155 లో... USD ఫోర్క్, రియర్‌లో మోనోషాక్, రియర్ టైర్ రేడియల్ ఇచ్చారు.
Hunter 350 లో... కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫోర్క్, రియర్‌లో ట్విన్ షాక్ ఉన్నాయి. ఎన్‌ఫీల్డ్, ఈ ఏడాది ఈ బండి సస్పెన్షన్ ట్యూనింగ్ అప్‌డేట్ చేసి, కంఫర్ట్‌ను పెంచింది. Hunterలో, దాని హెవీ వెయిట్‌కి సరిపోయేలా రెండు పెద్ద డిస్కులు ఉంటాయి.
సిటీ బ్రేకింగ్‌లో రెండు బైక్‌లు కూడా మంచి కంట్రోల్ ఇస్తాయి.
4. ఫీచర్లు: XSR 155 మరింత టెక్నాలజీ అడ్వాన్స్‌డ్
Hunter 350 లో... డ్యూయల్ చానెల్ ABS, ట్రిప్పర్ నావిగేషన్ (టాప్ వేరియంట్), LED హెడ్‌ల్యాంప్, అనలాగ్ + డిజిటల్ మీటర్ చూడొచ్చు.
XSR 155 లో... డ్యూయల్ చానెల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ (బిగ్ ప్లస్), రౌండ్ LCD మీటర్ + Bluetooth కనెక్టివిటీ, ఫుల్ LED లైటింగ్ చూడొచ్చు.
టెక్ సైడ్‌లో, ఒకే ధర రేంజ్‌లో XSR 155 మెచ్చుకునేలా ఉంటుంది.
5. ధరలో ఏది బెస్ట్?
Hunter 350 బేస్ వేరియంట్ చాలా తక్కువకు దొరుకుతుంది, కానీ స్పోక్ రిమ్స్, హాలోజెన్ లైట్, రియర్ డ్రమ్ బ్రేక్ ఉంటాయి.
XSR 155 ఒకే వేరియంట్‌లో వచ్చింది. కానీ, Hunter 350 Dapper/Rebel (₹1.63 lakh) కంటే XSR 155 ₹12,000 తక్కువ.
దీంతో స్పోర్టీ-రెట్రో బైక్ కోసం చూసే యువతకు XSR 155 మంచి 'వాల్యూ ఫర్ మనీ' ఆప్షన్.
ఫైనల్‌గా చెప్పేదేమింటంటే... స్పోర్టీ పెర్ఫార్మెన్స్ + లైట్ వెయిట్ హ్యాండ్లింగ్ కోసం XSR 155 & రిలాక్స్‌డ్ టార్క్ + క్లాసిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ వైబ్ కోసం హంటర్ 350 తీసుకోవచ్చు. మీ రైడింగ్ స్టైల్ ఏదైనా, ఈ రెండు బైకులను ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తేనే మీకు ఏది బెస్టో స్పష్టంగా తెలుస్తుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.