Yamaha FZ Rave Yamaha Specifications And Price: యమహా FZ సిరీస్‌ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో మంచి పేరు తెచ్చుకుంది. సిటీ రైడింగ్‌కు సరిపోయే పవర్‌, స్టైలిష్‌ లుక్స్‌, తేలికైన హ్యాండ్లింగ్‌ వంటి లక్షణాలు కలిసి, యువ రైడర్లకు ప్రియమైన బైక్‌గా FZ ను నిలిపాయి. ఇప్పుడు ఈ లైనప్‌లోకి కొత్తగా వచ్చిందే Yamaha FZ Rave. మరింత స్పోర్టీగా కనిపించే ఈ వేరియంట్‌ ప్రస్తుతం బాగా హైలైట్‌ అవుతోంది. ముఖ్యంగా, యువత ఈ బండి నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నారు. అయితే.. మీరు Yamaha FZ Rave బైక్ కొనుగోలు చేయాలనుకుంటే, ముందుగా తప్పక తెలుసుకోవాల్సిన 5 కీలక విషయాలు ఇవే.

Continues below advertisement

1. ఇంజిన్‌ పనితీరు - అదే నమ్మకమైన FZ శక్తి

Yamaha FZ Rave లోని ఇంజిన్‌ కూడా మనకు తెలిసిన 149cc ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌నే. ఇది 12.4hp పవర్‌, 13.3Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ సిటీ ట్రాఫిక్‌కు పర్ఫెక్ట్‌గా సెట్‌ అయి ఉంటుంది. 

Continues below advertisement

హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖ వంటి తెలుగు నగరాల ట్రాఫిక్‌లో తరచూ గేర్‌ మార్చాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. పైగా ఇంజిన్‌ వైబ్రేషన్స్‌ కూడా చాలా తక్కువగా ఉండటంతో రైడింగ్ అనుభవం మరింత కంఫర్ట్‌గా ఉంటుంది.

2. సేఫ్టీ - ABS తో నమ్మకం

Yamaha FZ Rave లో సింగిల్‌-చానల్‌ ABS స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. అంటే, బేస్‌ వేరియంట్‌ నుంచీ ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ప్రత్యేకించి, కొత్త రైడర్లకు ఈ సేఫ్టీ ఫీచర్‌ చాలా ఉపయోగపడుతుంది. 

బైక్‌ ముందు భాగంలో 282mm డిస్క్‌, వెనుక భాగంలో 220mm డిస్క్‌ ఉండటం వల్ల బ్రేకింగ్‌ రెస్పాన్స్‌ చాలా షార్ప్‌గా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో వర్షకాలంలో రోడ్లు జారుడుగా ఉంటాయి. అలాంటి సమయంలో ABS ఉన్న బైక్‌ అదనపు భద్రతను ఇస్తుంది.

3. రైడింగ్‌ కంఫర్ట్‌ - అందరికీ సూటయ్యే డిజైన్‌

Yamaha FZ Rave సీట్‌ హైట్‌ 790mm మాత్రమే, కాబట్టి చక్కటి కంట్రోల్‌ కోరుకునే రైడర్లకు ఇది చక్కగా సరిపోతుంది. 136kg కర్బ్‌ వెయిట్‌ ఉన్నా, హ్యాండ్లింగ్‌ చాలా లైట్‌గా అనిపిస్తుంది. ట్రాఫిక్‌లోనూ, చిన్న గల్లీల్లోనూ బాగా మేనేజ్‌ చేయొచ్చు. ఇంకా 165mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉండటం వల్ల గ్రామీణ రోడ్లు, చిన్న గుంతలు వంటి పరిస్థితుల్లో కూడా ఈ బైక్‌ తడబడదు. 

13 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ లాంగ్‌ రైడ్స్‌కు చాలా ఉపయోగపడుతుంది.

4. కలర్‌ ఆప్షన్లు - స్పోర్టీ లుక్‌కు ప్లస్‌ పాయింట్‌

Yamaha FZ Rave రెండు ప్రధాన కలర్‌ ఆప్షన్లలో వస్తుంది, అవి: మ్యాట్‌ గ్రీన్‌, మెటాలిక్‌ బ్లాక్‌. వీటిని మరింత ప్రత్యేకంగా చూపించేది 'రెడ్‌ అలాయ్‌ వీల్స్‌'. ఈ కాంబినేషన్‌ కారణంగా, ఈ బైక్‌ తొలిచూపులోనే ఆకట్టుకునేలా కనిపిస్తుంది. 

ఈ వేరియంట్‌ కోసం ప్రత్యేకంగా ఇచ్చిన కొత్త LED హెడ్‌ల్యాంప్స్‌ రోడ్డు విజిబిలిటీని కూడా బాగా మెరుగుపరుస్తాయి.

5. ధర - బడ్జెట్‌లోనే స్పోర్టీ లుక్‌

తెలుగు రాష్ట్రాల్లో, Yamaha FZ Rave ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1.17 లక్షలు. అన్ని పన్నులు, అవసరమైన ఖర్చులు కలుపుకుంటే, తెలుగు నగరాల్లో ఆన్‌-రోడ్‌ ధర రూ. 1,44 లక్షల వరకు ఉంటుంది.

అయితే మొత్తం FZ లైనప్‌లో ఇది మూడో అత్యంత చవకైన మోడల్‌. FZ-Fi, FZ-S Ver 3.0 కంటే కాస్త ఖరీదైనా, Rave లో వచ్చే స్పోర్టీ లుక్‌, ప్రత్యేక LED హెడ్‌ల్యాంప్స్‌ దీనిని యువ రైడర్లకు ఇంకా ఆకర్షణీయంగా మార్చాయి.

మొత్తంగా, Yamaha FZ Rave స్టైల్‌, కంఫర్ట్‌, డైలీ రైడింగ్‌ - ఈ మూడింటినీ ఒకే ప్యాకేజ్‌లో అందిస్తుంది. బడ్జెట్‌లోనే స్పోర్టీగా కనిపించే బైక్‌ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. తెలుగు యువ రైడర్ల అభిరుచికి తగ్గట్టు లుక్‌, ప్రాక్టికల్‌ ఫీచర్లు కలగలిపిన మోడల్‌ ఇదే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.