Yamaha EC 06 Electric Scooter Range, Features, Price: యమహా ఎట్టకేలకు భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి బలంగా అడుగు పెట్టింది. కొత్తగా ఆవిష్కరించిన Yamaha EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క ఫుల్ చార్జ్‌తో 160 కి.మీ. వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటించింది. అద్భుతమైన డిజైన్, ఆధునిక టెక్నాలజీ, & స్మార్ట్ ఫీచర్లతో ఈ స్కూటర్ ప్రస్తుతం బజ్ క్రియేట్ చేస్తోంది.
పవర్‌ఫుల్ మోటార్ - మైలేజ్‌లో మాస్Yamaha EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు, ఇది గరిష్టంగా 8.98 Hp పవర్ ఇస్తుంది. దీని 4 కిలోవాట్ గంటల లిథియం-అయాన్ బ్యాటరీ రోజువారీ ప్రయాణాలకు సరిపోయే స్థిరమైన రేంజ్ ఇస్తుంది. కంపెనీ ప్రకారం, EC-06 ని ఫుల్‌గా చార్జ్ చేస్తే 160 కి.మీ. (Yamaha EC 06 Electric Scooter Range) హాయిగా నడుపుకోవచ్చు.
చార్జింగ్ & రైడింగ్ మోడ్స్Yamaha EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హోమ్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే, ఇంట్లోనే సాధారణ ప్లగ్ ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. సుమారు 9 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఈ ఈ-స్కూటర్‌లో, రైడర్ అవసరాలకు అనుగుణంగా మూడు రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. అలాగే, పార్కింగ్ సమయంలో సహాయపడే రివర్స్ మోడ్ కూడా ఉంది, ముఖ్యంగా పెద్దవాళ్లు & మహిళలకు ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. బండిని వెనక్కు తీసుకువెళ్లాలనుకున్నప్పుడు రైడర్ కిందకు దిగాల్సిన అవసరం లేదు, రివర్స్ మోడ్‌లో పెట్టి స్లోగా రైజ్ ఇస్తే చాలు.
స్మార్ట్ కనెక్టివిటీ & ఫీచర్లుఈ స్కూటర్‌లో ఉన్న సిమ్-బేస్డ్ కనెక్టివిటీ, ఇన్‌బిల్ట్ టెలీమాటిక్స్ యూనిట్ ద్వారా రియల్ టైమ్ డేటా యాక్సెస్, లోకేషన్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు లభిస్తాయి. భవిష్యత్తులో రైడ్ అనలిటిక్స్, సర్వీస్ రిమైండర్లు కూడా అందించే అవకాశం ఉంది. అంటే, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల పరంగా టాప్‌లో ఉంది.
లుక్స్ & సేఫ్టీYamaha EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ క్లాసీగా ఉంది. LED హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్, ఇండికేటర్లు అందంగా మెరుస్తున్నాయి. రైడర్ సేఫ్టీ కోసం ముందు & వెనుక డిస్క్ బ్రేకులు ఇచ్చారు. 24.5 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది, సరుకులను ఈజీగా ఇంటికి తీసుకువెళ్లవచ్చు. ఇవన్నీ, EC-06 ని రోజువారీ వినియోగానికి సరైన ఆప్షన్‌గా నిలబెడతాయి.
ధర & డెలివెరీ టైమ్‌లైన్‌యమహా ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసమే రూపొదించింది. యమహా ఇప్పుడు నిర్వహించిన ఈవెంట్ ఆవిష్కరణ (స్కూటర్ పరిచయం) మాత్రమే. ఈ బండి డెలివరీలు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రారంభం కానున్నాయి. ధర వివరాలు కూడా అదే సమయంలో వెల్లడిస్తారు.
యమహా ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో వెనుకబడి ఉన్నప్పటికీ, EC-06 & Aerox-E తో ఇప్పుడు గేమ్ మార్చబోతోందని చెప్పవచ్చు. ఈ EC-06 స్కూటర్ స్మార్ట్ డిజైన్, శక్తిమంతమైన మోటార్, & భారీ రేంజ్‌తో యూత్ హార్ట్‌లో సీటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.