Yamaha Aerox 155 and XSR 155 Prices Hiked: ఇండియన్ మార్కెట్లో ప్రీమియం టూ-వీలర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే యమహా ఇండియా, తన 155సీసీ సెగ్మెంట్ లోని రెండు కీలక వాహనాల ధరలను సవరించింది. యమహా ఏరోక్స్ 155 (Yamaha Aerox 155) మ్యాక్సీ స్కూటర్, యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 (Yamaha XSR 155) బైక్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చుల వల్ల ఈ భారం తప్పలేదని కంపెనీ పేర్కొంది. అయితే ఈ పెరిగిన ధరలు మే 2026 నుండే అమల్లోకి వచ్చాయి. మెకానికల్ గా గానీ, డిజైన్ పరంగా గానీ ఈ వాహనాల్లో కంపెనీ ఎలాంటి కొత్త మార్పులు చేయలేదు.
యమహా ఏరోక్స్ 155 కొత్త ధరలు..యమహా ఏరోక్స్ 155 స్కూటర్ పై అన్ని వేరియంట్లపై రూ. 2,800 వరకు ధర పెరిగింది. తాజా రివిజన్ తర్వాత, స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.43 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) చేరగా, టాప్-స్పెక్ వెర్షన్ ఎస్ (Version S) ధర రూ. 1.46 లక్షలకు పెరిగింది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒకసారి ధరలు పెంచిన యమహా, కేవలం ఒక నెల గ్యాప్ లోనే మళ్ళీ రెండోసారి రేట్లు పెంచడం విశేషం.
ఫీచర్ల విషయానికి వస్తే, ఏరోక్స్ 155 ఇప్పటికీ మార్కెట్లో మోస్ట్ పవర్ ఫుల్ స్కూటర్లలో ఒకటిగా ఉంది. ఇందులో 155సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 15 బీహెచ్‌పీ పవర్, 13.9 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అగ్రెసివ్ మ్యాక్సీ స్కూటర్ లుక్, ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ వంటి హైటెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది మార్కెట్లో హీరో జూమ్ 160 వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తోంది.
యమహా ఎక్స్‌ఎస్‌ఆర్ 155 ధరల వివరాలు..మరోవైపు, రెట్రో లుక్ తో ఆకట్టుకునే ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్ ధర కూడా పెరిగింది. అయితే ఏరోక్స్ తో పోలిస్తే ఇందులో పెంపు కొంత తక్కువగానే ఉంది. ఎంట్రీ లెవల్ మెటాలిక్ బ్లూ కలర్ ధరలో ఎలాంటి మార్పు లేదు, ఇది పాత ధర రూ. 1.49 లక్షలకే లభిస్తుంది. కానీ మిగతా అన్ని వేరియంట్లపై రూ. 1,000 పెరిగింది. వివిడ్ రెడ్ వేరియంట్ ధర రూ. 1.53 లక్షలు, మెటాలిక్ గ్రే ధర రూ. 1.57 లక్షలకు చేరింది. మెటాలిక్ బ్లాక్ గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్ షేడ్స్ ధర రూ. 1.59 లక్షలుగా ఉంది.
ఇంజిన్ , ప్రత్యేకతలు:ఎక్స్‌ఎస్‌ఆర్ 155 బైక్ తన క్లాసిక్ డిజైన్ తో పాటు మోడర్న్ ఫీచర్లకు పేరుగాంచింది. ఇందులో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. మెకానికల్ గా చూస్తే, ఇందులో 155సీసీ వివిఏ (VVA) టెక్నాలజీ ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 18.1 బీహెచ్‌పీ పవర్, 14.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ కూడా ఉంది. సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్ వంటి ప్రీమియం ఎక్విప్‌మెంట్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.
