Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షామీ 18 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. షామీ ఇటీవలే తన కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయగా, యాపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. సరికొత్త 2nm ప్రాసెసర్లు, భారీ డిస్ప్లేలు, లేటెస్ట్ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ రెండు ఫోన్లలో ఏది ఏ విభాగంలో ముందుందో ఇప్పుడు తెలుసుకుందాం.
డిస్ప్లే, డిజైన్
రెండు స్మార్ట్ఫోన్లు 6.9-అంగుళాల భారీ స్క్రీన్లతో వస్తున్నాయి. షామీ 18 ప్రో మ్యాక్స్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఫుల్ HD+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. మరోవైపు, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రోమోషన్ టెక్నాలజీతో 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో ఆల్వేస్-ఆన్ డిస్ప్లేతో పాటు మరింత చిన్నదిగా డైనమిక్ ఐలాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
కెమెరా కెపాసిటీ
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం షామీ 18 ప్రో మ్యాక్స్‌లో లైకా ట్యూన్ చేసిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా మరియు 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా మెయిన్ అట్రాక్షన్. దీనికి పోటీగా, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో వేరియబుల్ అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరాతో పాటు, 48MP అల్ట్రావైడ్, 48MP టెలిఫొటో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెగాపిక్సెల్స్ పరంగా షామీ ముందున్నప్పటికీ, వేరియబుల్ అపర్చర్ యాపిల్‌కు అదనపు బలాన్నిస్తుంది.
ప్రాసెసర్, పనితీరు
పనితీరు విషయంలో ఈ రెండు ఫోన్లు లేటెస్ట్ 2nm టెక్నాలజీపై ఆధారపడ్డాయి. షామీ 18 ప్రో మ్యాక్స్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది మ్యాగ్జిమం 5.01GHz క్లాక్ స్పీడ్‌తో అద్భుతమైన వేగాన్ని ఇస్తుంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో యాపిల్ సరికొత్త A20 ప్రో చిప్సెట్ ఉంది. ఇందులో రెండు కొత్త సూపర్ కోర్లు, నాలుగు ఎఫిషియెన్సీ కోర్లతో 6 కోర్ CPU బెస్ట్ పనితీరును అందిస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్
బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ వేగంలో షామీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇందులో భారీ 7,050mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ బ్యాటరీ కెపాసిటీ యాపిల్ వెల్లడించనప్పటికీ, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ లేదా 30 గంటల వరకు సాధారణ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుందని పేర్కొంది. Also Read: రూ.62,000 వరకు తక్కువకే Honda క్రూయిజర్ బైక్.. Rebel 500 ధర, ఇంజిన్, ఫీచర్లు, కలర్స్ వివరాలు
ధర, లభ్యత
దేశంలో షామీ 18 ప్రో మ్యాక్స్ ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే యూరోపియన్ మార్కెట్లో దీని 12GB RAM + 256GB బేస్ వేరియంట్ ధర 1,599 యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.1.64 లక్షలు) గా ఉంది. ఇది బ్లాక్, కాస్మిక్ బ్లూ, వెల్వెట్ రెడ్, వైట్ రంగులలో లభిస్తుంది. మరోవైపు, భారత మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB బేస్ వేరియంట్ ధర రూ.1,79,900 నుండి ప్రారంభమవుతుంది. దీని టాప్-ఎండ్ 2TB స్టోరేజ్ మోడల్ ధర రూ.3,29,900 గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బర్గుండి, గ్లేసియర్, సిల్వర్ రంగులలో అందుబాటులో ఉంది. Also Read: CODని చూపిస్తే కొత్త కారుపై గ్యారెంటీ బెనిఫిట్స్! తెలంగాణలో రోడ్ ట్యాక్స్ రాయితీ ఎంతంటే?
