Used Seadan Cars | సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనడం చాలా మందికి ఒక కలగా మారింది. ఎత్తైన బాడీ, రోడ్ ప్రెజెన్స్, సరికొత్త ఫీచర్ల కారణంగా ఎస్‌యూవీలు చాలా వేగంగా పాపులర్ అయ్యాయి. కానీ అనేక కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీల ధరలు రూ. 15 నుండి 20 లక్షల వరకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం కంటే మంచి సెకండ్ హ్యాండ్ సెడాన్ (Sedan) కారు కొనడం చాలా ఉత్తమమని పలువురు కార్ నిపుణులు ఇప్పుడు సలహా ఇస్తున్నారు.

పాత సెడాన్ కార్లలో మీకు మరిన్ని ప్రీమియం ఫీచర్లు, మెరుగైన కంఫర్ట్, పవర్‌ఫుల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.  ఒకప్పుడు లగ్జరీ ఫీల్ కోసం ఎన్నో సెడాన్ కార్లు నేడు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇదే కారణంతో ఇప్పుడు ఎస్‌యూవీల కంటే మళ్లీ సెడాన్ కార్ల కోసం చూస్తున్నారు. 

తక్కువ ధరలోనే ప్రీమియం ఫీల్, అద్భుతమైన కంఫర్ట్పాత సెడాన్ కార్ల వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం వాటి కంఫర్ట్, డ్రైవింగ్ క్వాలిటీ. ఉదాహరణకు Honda City, హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna), స్కోడా సూపర్బ్ (Skoda Superb), Toyota Camry మరియు BMW 3 సిరీస్ వంటి కార్లు నేటికీ వాటి స్మూత్ డ్రైవ్ మరియు లగ్జరీ క్యాబిన్ కోసం ఎంతగానో ఇష్టపడతారు. ఈ కార్లలో పొడవైన వీల్‌బేస్ ఉండటంతో వెనుక సీట్లో కూర్చునే వారికి ఎక్కువ స్థలం లభిస్తుంది. హైవేలపై వీటి స్టెబిలిటీ కూడా ఎస్‌యూవీల కంటే బెటర్ అనిపిస్తుంది. 

Also Read: Car Battery Life: కారు బ్యాటరీ త్వరగా పాడవుతుందా? ఈ చిట్కాలతో బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు

అనేక పాత సెడాన్ కార్లలో మీకు సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం సౌండ్ సిస్టమ్, ADAS వంటి ఫీచర్లు ఉంటాయి.  ఇవి కొత్త బడ్జెట్ ఎస్‌యూవీలలో సాధారణంగా ఉండవు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈ కార్ల ధరలు చాలా వరకు తగ్గతాయి.  కాబట్టి తక్కువ బడ్జెట్‌లోనే లగ్జరీ ఫీల్ పొందడం సులువవుతుంది.

డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, వ్యాల్యూ ఫర్ మనీ ఎస్‌యూవీల ట్రెండ్ పెరిగినప్పటికీ, డ్రైవింగ్ ఇష్టపడేవారు నేటికీ సెడాన్ కార్లనే ఎక్కువగా లైక్ చేస్తారు. సెడాన్ కారు తక్కువ ఎత్తు, మెరుగైన ఏరోడైనమిక్స్ కారణంగా కారు రోడ్డుపై మరింత కంట్రోల్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. హైవేలపై వీటి ప్రయాణం ఈజీ. సెకండ్ హ్యాండ్ సెడాన్ కొనడం వల్ల మీ ఆదాయంపై కూడా పెద్దగా భారం పడదు. కొత్త ఎస్‌యూవీ కొనగానే దాని Resale Value వేగంగా తగ్గుతుంది. అదే పాత సెడాన్ కార్ల విలువ అప్పటికే చాలా వరకు తగ్గిపోయి అందుబాటు ధరలోనే లభిస్తుంది. 

Also Read: Hero Electric Optima vs Vida VX2 Go: హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా vs విడా VX2గో: లక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ ఏది? ధర ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌ గురించి తెలుసుకోండి!

అందుకే తక్కువ మనీకి ఎక్కువ ఫీచర్లు, మెరుగైన పర్ఫార్మెన్స్ కోరుకునే వారు సెకండ్ మ్యాండ్ సెడాన్  కార్లు కొనాలని చూస్తున్నారు. సరైన పద్ధతిలో మెయింటెనెన్స్ చేసిన కారు గనుక దొరికితే, కొత్త ఎస్‌యూవీ కొనడం కంటే ఇలా చేయడం ద్వారా మీకు మంచి ఫీచర్లతో, మనీకి తగిన వాహనం లభిస్తుందని భావిస్తున్నారు.