2026 Tata Punch Facelift భారత మార్కెట్‌లో విడుదలైన వెంటనే హాట్ టాపిక్‌గా మారింది. టాటా మోటార్స్ ఈ మైక్రో SUVలో ఎక్స్‌టీరియర్ డిజైన్, కేబిన్ లేఅవుట్, ఇంజిన్ ఆప్షన్స్‌లో ముఖ్యమైన మార్పులు చేసింది. దీంతో పంచ్ ఫేస్‌లిఫ్ట్ గతంలో కంటే మరింత మోడ్రన్‌గా,  ఆచరణాత్మకంగా మారింది. కొత్త Punch Facelift  ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.59 లక్షల నుంచి ప్రారంభం కాగా, గరిష్టంటా రూ. 10.54 లక్షల వరకు ఉంది. టాటా మోటార్స్ కంపెనీ దీనిని 8 వేర్వేరు ట్రిమ్‌లలో అందిస్తోంది. అందులో స్మార్ట్ (Smart), Pure, ప్యూర్ ప్లస్ (Pure+), Pure+ S, అడ్వెంచర్ (Adventure), Adventure S, Accomplishedతో పాటు Accomplished+ S వేరియంట్లు ఉన్నాయి.

Continues below advertisement

ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఎంపికలు

 Tata Punch Facelift 2026 ఇప్పుడు ఎక్కువ ఎనర్జీతో పాటు వేరియంట్ ఎంపికలను కలిగి ఉంది. ఇందులో కొత్త 1.2-లీటర్ టర్బో ఛార్జ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీనితో పాటు ఇప్పటికే ఉన్న 1.2 లీటర్ రెగ్యూలర్‌గా ఆశించిన పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT ఎంపికలు ఉన్నాయి. మైలేజీని కోరుకునే వారి కోసం ట్విన్-సిలిండర్ CNG కిట్, కొత్త CNG-AMT కాంబినేషన్ కూడా అందుబాటులో ఉంది. ఇది రోజువారీ వినియోగానికి మరింత పొదుపు చేస్తుంది.

ఏ వేరియంట్ అత్యంత విలువైనది?

మీరుTata Punch Facelift 2026 కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఏ వేరియంట్ మీ డబ్బుకు సరైన విలువను ఇస్తుందో అని సందేహం ఉంటే, Accomplished+ S ట్రిమ్ బెస్ట్ వేరియంట్‌గా భావించవచ్చు. ఇది టాప్ ఎండ్ వేరియంట్ అయినప్పటికీ, ఫీచర్లు, సేఫ్టీ, పవర్‌ట్రెయిన్ పరంగా మంచి ఆఫర్‌ను అందిస్తుంది. ఇందులో అవసరమైన, ప్రీమియం ఫీచర్లు 2 ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు.

Continues below advertisement

Accomplished+ S వేరియంట్ ధర ఎంత

మీరు 1.2 లీటర్ సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో Accomplished+ S వేరియంట్ ఎంచుకుంటే, దీని ధర  (ఎక్స్-షోరూమ్ విలువ) రూ. 8.99 లక్షలు. AMT ట్రాన్స్‌మిషన్‌తో ఈ వేరియంట్ (ఎక్స్-షోరూమ్ ధర) రూ. 9.54 లక్షలకు మీకు లభిస్తుంది. మీ ప్రాధాన్యత తక్కువ ఖర్చుతో క్లచ్‌లెస్ డ్రైవింగ్, మంచి మైలేజ్ అయితే కనుక  CNG-AMT వేరియంట్ రూ. 10.54 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ఎక్కువ పవర్ కోరుకునే వారి కోసం 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన మాన్యువల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 9.79 లక్షలకు మీరు కొనుగోలు చేయవచ్చు.