Honda Activa March 2025 Sales Report: హోండా యాక్టివా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్లలో ఒకటి. దాని ఆధిపత్యం నిరంతరం కొనసాగుతోంది. 2025 మార్చిలో కూడా ఇది పోటీదారులను వెనక్కి నెట్టి  నంబర్ వన్ స్థానాన్ని సాధించింది.

కంపెనీ నివేదిక ప్రకారం, 2025 మార్చిలో Honda Activa 110, Honda Activa 125  కలిపి మొత్తం 1,89,735 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది గత సంవత్సరం 2024 మార్చిలో అమ్ముడైన 1,55,931 యూనిట్లతో పోలిస్తే 21.67% వార్షిక వృద్ధిని సూచిస్తుంది.

నెలవారీ వృద్ధి కూడా సూపర్ 

ఫిబ్రవరి 2025లో Honda Activa మొత్తం అమ్మకాలు 1,74,009 యూనిట్లు. మార్చిలో ఈ సంఖ్య 1,89,735 యూనిట్లకు పెరిగింది, దీనివల్ల నెలవారీ అమ్మకాలలో 9.03% పెరుగుదల (MoM Growth) నమోదైంది. ఈ సంఖ్య దేశంలో Honda Activa ప్రజాదరణ ఇప్పటికీ అగ్రస్థానంలో ఉందని తెలియజేస్తుంది.

Honda Activa 110 (Activa 6G)

Honda Activa 110 ను Activa 6G అని కూడా పిలుస్తారు, ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది, వీటి ఎక్స్-షోరూమ్ ధర 78,684 రూపాయల నుంచి 84,685 రూపాయల వరకు ఉంది. ఇందులో 109.51cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది, ఇది 7.8 bhp పవర్‌, 9.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్‌పరంగా ఈ స్కూటర్ ప్రతి లీటరకు 55 కిలోమీటర్లు మైలేజ్‌ఇస్తుంది.  ఇందులో 5 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది, దీనిని పూర్తిగా నింపినప్పుడు ఈ స్కూటర్ 250 కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించగలదు. ఫీచర్ల విషయానికి వస్తే, Activa 110లో 4.2 అంగుళాల TFT డిజిటల్ డిస్ప్లే ఉంది, ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్‌ను కలిగి ఉంది. అదనంగా, ఇందులో USB టైప్-C చార్జింగ్ పోర్ట్, Honda Road Sync యాప్ ద్వారా కాల్, SMS అలర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

 Honda Activa 125

Honda Activa 125 కూడా OBD-2B నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్‌ చేశారు.  దాని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర 95,140 రూపాయలుగా ఉంది. ఇది మిమ్మర్ని కొంత ప్రీమియం విభాగంలోకి తీసుకువెళుతుంది. మైలేజీ లీటర్‌కు  60 కిలోమీటర్లు ఇస్తుందని ARAI క్లెయిమ్ చేసిన రిపోర్ట్‌ ఈ స్కూటర్ కు అడ్వాన్టేజ్‌ ఫలితంగా ఇంధన సామర్థ్యం కలిగిన స్కూటర్‌గా ప్రమోట్ చేస్తోంది. ఫీచర్ల విషయంలో ఇది చాలా అధునాతనమైనది, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, USB టైప్-C పోర్ట్, డిజిటల్ కన్సోల్ వంటి ఆధునిక సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. Activa 125 మైలేజ్ విషయంలో మాత్రమే కాకుండా  స్మార్ట్ ఫీచర్ల విషయంలో ముందంజలో ఉంది. సాంకేతికతను ఇష్టపడే వినియోగదారులకు ఇది ఒక అద్భుతమైన ఎంపికగా ఉంటుంది. 

ఏది ఉత్తమం Activa 110 లేదా Activa 125?

తక్కువ బడ్జెట్ ఉండి  రోజువారీ ప్రయాణం కోసం టూవీలర్ తీసుకోవాలంటే మాత్రం Activa 110 మీకు మంచి ఎంపిక అవుతుంది.  పవర్‌ఫుల్‌ ఇంజిన్‌, మెరుగైన మైలేజ్ , స్మార్ట్ ఫీచర్లను కోరుకున్న వ్యక్తి అయితే Activa 125 మెరుగైన, ప్రీమియం ఎంపికగా ఉంటుంది. రెండు స్కూటర్లు తమ విభాగాలలో అద్భుతంగా పనిచేస్తాయి, ఇది పూర్తిగా మీ అవసరాలు, బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది.