Mahindra XUV 7XO Variants Price And Features: మహీంద్రా 2021లో లాంచ్ చేసిన XUV700, ఇండియన్ SUV మార్కెట్‌లో భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు దానికి మిడ్ సైకిల్ అప్‌డేట్‌గా వచ్చిన మోడలే 2026 Mahindra XUV 7XO. పేరు మాత్రమే కాదు, డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లలో కూడా పెద్ద మార్పులతో ఈ SUV మన ముందుకు వచ్చింది. అయితే, XUV 7XOలో ఆరు ట్రిమ్‌లు ఉండటంతో, ఏ వేరియంట్ కొనాలి? అనే సందేహం చాలా మందికి వస్తోంది. ఇక్కడ ఆ సందేహానికి స్పష్టమైన సమాధానం తెలుసుకుందాం.
XUV 7XO ధరలు & ఇంజిన్ ఆప్షన్లు
Mahindra XUV 7XO ధరలు రూ.13.66 లక్షల నుంచి రూ.24.92 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉన్నాయి. ఈ ధరలు తొలి 40,000 డెలివరీల వరకు మాత్రమే వర్తిస్తాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, పాత XUV700లో ఉన్నవే కొనసాగుతున్నాయి.
2.0 లీటర్ mStallion టర్బో పెట్రోల్ ఇంజిన్ - 203hp, 380Nm
2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ - 185hp, గరిష్టంగా 450Nm
మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ SUVకి ప్రధాన ప్రత్యర్థులు - Hyundai Alcazar, MG Hector Plus, Tata Safari.
AX ట్రిమ్ - ఎంట్రీ లెవల్ అయినా ఫీచర్లలో బలంAX ట్రిమ్ ధర: రూ.13.66 లక్షలు నుంచి
ఇది ఎంట్రీ లెవల్ అయినప్పటికీ, ట్రిపుల్ 12.3 అంగుళాల స్క్రీన్ సెటప్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, AdrenoX కనెక్టెడ్ టెక్నాలజీ, 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టుకుని, పెద్ద SUV కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.
AX3 ట్రిమ్ - డైలీ యూజ్‌కు మరింత కంఫర్ట్AX3 ట్రిమ్ ధర: రూ.16.02 లక్షలు నుంచి
AXలో ఉన్న ఫీచర్లతో పాటు, రియర్ వ్యూ కెమెరా, ఆటో ఫోల్డ్ ORVMలు, రియర్ వైపర్, డిమిస్టర్ లాంటి రోజువారీ ఉపయోగకరమైన ఫీచర్లు ఇక్కడ అదనంగా వస్తాయి. నగర వినియోగానికి ఇది మంచి బ్యాలెన్స్ వేరియంట్.
AX5 ట్రిమ్ - ఫ్యామిలీ SUVగా బెస్ట్ బ్యాలెన్స్AX5 ట్రిమ్ ధర: రూ.17.52 లక్షల నుంచి
ఈ ట్రిమ్‌లో XUV 7XO మరింత ప్రీమియంగా అనిపిస్తుంది. AX3 ట్రిమ్‌లో ఉన్న ఫీచర్లతో పాటు పానోరమిక్ సన్‌రూఫ్, అలాయ్ వీల్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, టెలిస్కోపిక్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఫ్యామిలీ కొనుగోలుదార్లకు బాగా ఉపయోగపడతాయి.
AX7 ట్రిమ్ - డబ్బుకు పూర్తి విలువAX7 ట్రిమ్ ధర: రూ.18.48 లక్షలు నుంచి
సుమారు రూ.20 లక్షల బడ్జెట్‌లో బెస్ట్ వాల్యూ వేరియంట్ ఇదే. AX5 ట్రిమ్‌లో ఉన్న ఫీచర్లతో పాటు లెదరెట్ సీట్లు, డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, సర్‌రౌండ్ వ్యూ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో లభిస్తాయి. ముందు, వెనుక సీట్లలో కూర్చునే వారందరికీ మంచి కంఫర్ట్ ఇస్తుంది.
AX7T (Tech) - టెక్నాలజీ లవర్స్ కోసంAX7T ట్రిమ్ ధర: రూ.20.99 లక్షలు నుంచి
AX7 ట్రిమ్‌లో ఉన్న ఫీచర్లతో పాటు, ఇందులో Level 2 ADAS, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, 16 స్పీకర్ Harman Kardon ఆడియో, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి హైఎండ్ టెక్ ఫీచర్లు ఉన్నాయి. డ్రైవింగ్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇచ్చేవారికి ఇది సరైన ఎంపిక.
AX7L (Luxury) - పూర్తి లగ్జరీ అనుభవంAX7L ట్రిమ్ ధర: రూ.22.47 లక్షలు నుంచి
ఇది టాప్ ఎండ్ వేరియంట్. AX7T ట్రిమ్‌లో ఉన్న ఫీచర్లతో పాటు, ఇందులో వెంటిలేటెడ్ సెకండ్ రో సీట్లు, రియర్ సన్‌బ్లైండ్స్, పవర్డ్ కో-డ్రైవర్ సీట్‌తో పవర్డ్ Boss మోడ్, రియర్ వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్‌తో ప్రయాణించే వారికి ఇది బెస్ట్ ఎంపిక.
ఏ ట్రిమ్ తీసుకోవాలి?మీ బడ్జెట్ దాదాపు రూ.20 లక్షలయితే, AX7 ట్రిమ్ మీ డబ్బుకు పూర్తి విలువ ఇస్తుంది. మీకు ఓ డ్రైవర్ ఉంటే, కెప్టెన్ సీట్లు, వెంటిలేషన్, లగ్జరీ ఫీల్ కావాలంటే AX7L ట్రిమ్ తీసుకుంటే నిరాశ ఉండదు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.