Maruti Swift ​​vs Tata Punch:భారతీయ ఆటోమొబైల్ రంగంలో బడ్జెట్‌ సెగ్మెంట్‌ ఎప్పుడూ ఒక వార్‌ జోన్‌లా ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి వాహనదారులను ఆకట్టుకోవడానికి కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతుంటాయి. అలాంటి పోటీలో వినియోగదారులు కొనే ముందు చాలా అంశాలను పరిగిలోకి తీసుకుంటారు. తమ ధరకు, తమ ఆలోచనలకు అనుగుణంగా ఉండే వాహనాల మధ్య పోలికలు సరి చూసుకుంటారు. ఇప్పుడు మధ్యతరగతి మార్కెట్‌ను శాసిస్తున్న రెండు కంపెనీలకు చెందిన మైక్రో ఎస్‌యూవీ విభాగంలో ఎస్‌యూవీ, టాటా పంచ్‌ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అయితే ఈ రెండు వాహనాల్లో ఏది కొనుక్కుంటే వినియోగదారులకు మేలు జరుగుతుంది. వారి డబ్బులు అసలైన విలువ లభిస్తుందో చూద్దాం. 

Continues below advertisement

పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కారు కొనే వ్యక్తులు కేవలం కారు అవుట్‌ లుక్‌తోపాటు ఇతర ఫీచర్లు, లాంగ్‌ రన్‌లో నిర్వహణపై ఫోకస్ చేస్తున్నారు. రీసేల్ వాల్యూ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

టాటా పంచ్‌, మారుతీ స్విఫ్ట్‌లలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఎవరు?

ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలిస్తే టాటా పంచ్ తన బేస్ వేరియంట్‌ను అత్యంత వ్యూహాత్మకంగా తక్కువ ధరకు అందిస్తోంది. దీని ధర 5.50 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ వేరియంట్‌ 10.55 లక్షల వరకు పలుకుతుంది. మైక్రో ఎస్‌యూవీగా దీనికి మార్కెట్‌లో గుర్తింపు ఉంది. హ్యాచ్‌బ్యాక్‌ కింగ్‌గా పేరున్న స్విఫ్ట్‌ ధర 5.79 లక్షల నుంచి 9 లక్షల వరకు ధర కలిగి ఉంది. 

Continues below advertisement

హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ధరలను గమనిస్తే పంచ్ బేస్ వేరింట్‌ స్విఫ్ట్‌ కంటే ఇరవై వేల నుంచి 30 వేల వరకు తక్కువ ధరకే లభిస్తోంది. అయితే టాప్‌ వేరియంట్లకు వెళ్లే కొద్దీ పంచ్‌ ధరలు స్విఫ్ట్ కంటే ఎక్కువ ఉంటున్నాయి. 

ఇంజిన్‌, పనితీరులో ఏది స్మూత్‌ ఏదీ పవర్‌ఫుల్?

రెండు కార్లు కూడా 1.2 లీటర్ల ఇంజిన్లతో వస్తున్నప్పటికీ, వాటి పనితీరులో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. టాటా పంచ్‌లో టర్బో ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 120 పీఎస్‌ శక్తిని, 170Nm టార్క్‌ను అందిస్తుంది. ఎస్‌యూవీ లుక్స్‌కు తగ్గట్టుగానే ఇందులో టార్క్‌ ఎక్కువ ఉంటుంది. మారుతి స్విఫ్ట్‌ కొత్త Z1E 3- సిలిండర్‌ ఇంజిన్ 82 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మారుతి ఇంజిన్లు తమ స్మూ్‌నెస్‌, రిఫైన్డ్‌ పికప్‌కు పేరున్న వాహనం. ముఖ్యంగా స్విఫ్ట్ తన స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ వేరియంట్‌తో 2026లో కొత్త సంచలనం సృష్టిస్తోంది. ఇది ఎలక్ట్రిక్‌ అసిస్ట్‌ ద్వారా సిటీ డ్రైవింగ్ సామర్థ్యాన్ని20-30 శాతం పెంచుతుంది. 

మైలేజీలో ఆధిపత్యం ఎవరిది?

మైలేజీ విషయంలో మారుతి స్విఫ్ట్ తన పవర్‌ను చూపిస్తోంది. స్విఫ్ట్ ఏకంగా 24.8kmpl క్లెయిమ్‌ చేస్తుండగా పంచ్‌ 20.9 kmpl అని ప్రకటిస్తోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో వాస్తవ పరిస్థితుల్లో స్విఫ్ట్‌ 20-30kmpl ఇస్తుంటే, పంచ్‌ 15-18kmplకే పరిమితమవుతోంది.  సీఎన్జీ విషంలో పంచ్ కంటే స్విఫ్ట్ ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉంది. 

భద్రత కల్పిస్తున్న వాహనం ఏది?

భద్రత విషయంలో టాటా పంచ్ ముందంజలో ఉంది. పంచ్‌ జీఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించింది. సిఫ్ట్‌ ఫోర్ స్టార్ రేటింగ్‌తో వస్తోంది. అయితే ఇందులో టాప్ వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాక్స్‌ ఇస్తున్నారు. 

టెక్ సావీ ఏదీ?

రెండు కార్లులోనూ 10.25 ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌ , ఆండ్రాయిడ్‌ ఆటో/ఆపిల్‌ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే పంచ్‌లో సన్‌రూఫ్‌, iRA కనెక్టివిటీ వంటి ఫీచర్లు అదనపు ఆకర్షణగా ఉన్నాయి. 

మెయింటెనెన్స్‌ ఖర్చు, రీసేల్‌ వాల్యూ

మారుతి విస్తృతమైన సర్వీస్‌ నెట్‌వర్క్ వల్ల స్విఫ్ట్‌ నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈ కారు కోసం ఏడాదికి 2500 నుంచి 4000 వరకు ఖర్చు అవుతుంది. ఐదేళ్ల కాలంలో స్విఫ్ట్ నిర్వహణ కోసం 21000 వేల నుంచి 26000 వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 

రీసేల్‌ వాల్యూ విషయానికి వస్తే మారుతి బ్రాండ్ విలువ వల్ల స్విఫ్ట్ ఐదేళ్ల తర్వాత కూడా 6-70శాతం విలువను కలిగి ఉంటోంది. పంచ్ రీసేల్‌ విలువ సుమారు 50-60 శాతం మధ్యలో ఉంటోంది. 

ఐదేళ్ల ఓనర్‌షిప్ కాస్ట్ లెక్క ఏంటీ?

సంవత్సరానికి 15000 కిలోమీటర్లు ప్రయాణించే సగటు వాహనదారుడికి ఐదేళ్లలో అయ్యే నిక ఖర్చును విశ్లేషిస్తే... మారుతి స్విఫ్ట్‌ ఇంధన పొదుపు, తక్కువ మెయింటెనెన్స్, మెరుగైన రీసేల్ విలువ కారణంగా దీని నికర ఓనర్‌షిప్ ఖర్చు 4,76,700గా ఉంటుంది. టాటా పంచ్‌ 6,77,000 వరకు చేరుతుంది. అంటే ఐదేళ్ల కాలపరిమితిలో మారుతి స్విఫ్ట్‌ కొనుగోలు చేసిన వ్యక్తికి దాదాపు 2,00,300 వరకు ఆదా చేయగలదు. 

ఎవరికి ఏ కారు బెస్ట్‌?

స్విఫ్ట్‌ మెరుగైన మైలేజీ, సులభమైన పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌, టర్బో పవర్ కలిగి ఉన్న పంచ్‌ వాహనం హైవే ప్రయాణాలకు సరిగా సరిపోతుంది. ఇందులో ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.