Budget Friendly Bike:ప్రతి ఒక్కరూ చూసేందుకు ప్రీమియం‌గా కనిపించే, కంఫర్ట్ రైడింగ్ బైక్ కోసం చూస్తారు.  జేబుపై ఎక్కువ భారం వేయని బైక్ కొనాలని భావిస్తారు. భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో కూడా లగ్జరీ అనుభూతిని ఇచ్చే అనేక బైకులు ఉన్నాయి. వీటిలో స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్, మంచి మైలేజ్, మోడ్రన్ ఫీచర్ల కాంబినేషన్ లభిస్తుంది. మీరు కూడా కొత్త బైక్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా.. అయితే ఈ కింద తెలిపిన లిస్ట్ ఓసారి చెక్ చేయండి. 

Continues below advertisement

హోండా SP 125 ఫీచర్లు 

మీ ఫస్ట్ ప్రియారిటీ కచ్చితంగా అధిక మైలేజ్ అయి ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్ అయితే, హోండా SP 125 మంచి ఆప్షన్ కావచ్చు. దీని డిజైన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ ప్రీమియం లుక్ ఇస్తుంది. బైక్‌లో LED హెడ్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మూత్ ఇంజిన్ లభిస్తాయి. రోజూ ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లి వచ్చే వారికి ఇది బెస్ట్ బైక్‌గా పరిగణిస్తారు.

TVS Raider 125 ఫీచర్లు

TVS Raider 125 తన స్పోర్టీ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల వల్ల యువతలో చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, ఆకర్షణీయమైన లుక్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ లభిస్తాయి. కొన్ని రోజుల కిందట దీని కొత్త స్పెషల్ ఎడిషన్ కూడా లాంచ్ చేశారు. ఇది మరింత ప్రీమియంగా మారింది.

Continues below advertisement

Hero Xtreme 125R 

తక్కువ ధరలో స్పోర్టీ లుక్ ఉన్న బైక్ కోసం చూస్తున్నారా.. Hero Xtreme 125R కూడా అద్భుతమైన బైక్. దీని డిజైన్ మొదటి చూపులోనే పెద్ద స్పోర్ట్స్ బైక్‌లా అనిపిస్తుంది. ఇందులో మంచి పనితీరుతో పాటు రోజువారీ అవసరాలకు సరిపోయే మైలేజ్  లభిస్తుంది.

Also Read:  కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు

ఈ బైక్స్ కూడా అత్యధిక విక్రయాలు

TVS Apache RTR 160 కొంచెం ఎక్కువ పవర్, ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి మెరుగైన బైక్. దీని ఇంజిన్, రైడ్ క్వాలిటీ, స్పోర్టీ స్టైల్ ఇవన్నీ దీన్ని తన సెగ్మెంట్‌లోని కస్టమర్ల ఆదరణ పొందిన బైకుల్లో చేర్చుతాయి. నగరం, హైవే రెండింటిలోనూ ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

ఇది క్లాసిక్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తుంది  

మీరు బడ్జెట్‌ను కొంచెం పెంచగలిగితే, రాయల్ లుక్ కొరుకుంటే కనుక Royal Enfield Classic 350 కూడా అద్భుతమైన ఆప్షన్. దీని బలమైన రోడ్ ప్రెజెన్స్, కంఫర్టబుల్ రైడ్ దీన్ని ప్రత్యేకంగా చేస్తాయి. ఇటీవల కంపెనీ ఇందులో కొన్ని కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. యువత ఈ బైక్ అంటే పడి చచ్చిపోతుంటారు.

Also Read: రికార్డు సృష్టించిన TVS - వెనుకబడిన Ola.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ 10 కంపెనీలు ఇవే!

బైక్ కొనేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి

కేవలం లుక్ చూసి బైక్ కొనాలని నిర్ణయించుకోవద్దు. మైలేజ్, సర్వీస్ ఖర్చు, రైడింగ్ కంఫర్ట్, స్పేర్ పార్ట్స్ లభ్యత, మీ రోజువారీ వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే  బైక్ని కొనడంపై నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ బడ్జెట్‌తో పాటు మీ అవసరాలను కూడా తీర్చే బైకు కోసం ట్రై చేయండి.