ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో ఇప్పుడు లాంగ్ రేంజ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే Mahindra XEV 9S పాపులర్ అవుతోంది. అందుకు ప్రధాన కారణం కారు ధర, పవర్‌ఫుల్ డిజైన్, పనితీరు, అది ఇస్తున్న లాంగ్ రేంజ్. దీని డిజైన్ కూపే-స్టైల్ కాదు. ఈ కారు చాలా ప్రాక్టికల్‌గా ఉండటం వల్లే కస్టమర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

Continues below advertisement

Mahindra XEV 9S మూడు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. వీటిలో అతిపెద్దదైన 79kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ను పరీక్షించారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ టాప్ వేరియంట్ క్లెయిమ్డ్ రేంజ్ (Claimed Range) సుమారు 679 కిలోమీటర్లు. రియల్ టైం డ్రైవింగ్ పరిస్థితుల్లో (Real-world conditions) ఈ లెక్కలు కొంచెం తగ్గినప్పటికీ, ఈ సెగ్మెంట్‌లోని అనేక ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ల కంటే ఇది మెరుగ్గా నిలుస్తోంది.

కారు రియల్-వరల్డ్ రేంజ్ ఎంత?

ఈ మహీంద్రా SUVని వివిధ డ్రైవింగ్ మోడ్స్‌లో పరీక్షించారు. రేంజ్ మోడ్, మ్యాగ్జిమం రీజనరేటివ్ బ్రేకింగ్ సెట్టింగ్‌లను ఉపయోగించారు. డ్రైవ్ చేసినప్పుడు ఈ కారు సుమారు 470 కిలోమీటర్ల రియల్-వరల్డ్ రేంజ్ ఇచ్చింది. ఈ ధరలో లభించే ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే ఇది చాలా బెటర్. కారు ఎఫిషియన్సీ (Efficiency) Mahindra XEV 9e కంటే కొంచెం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అంత ఎక్కువగా లేదు.

Continues below advertisement

Mahindra XEV 9S EVలోని ప్రత్యేక ఫీచర్లు:

డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ విషయానికి వస్తే.. Mahindra XEV 9S జర్నీకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. స్పేస్ (స్థలం) విషయంలో కూడా ఈ SUV చాలా పెద్దదిగా ఉంటుంది. ఇందులో త్రీ-రో (Three-row) సీట్లు వస్తాయి. క్యాబిన్‌లో 3పెద్ద స్క్రీన్లతో కూడిన మోడరన్ డిజైన్ ఇచ్చారు. ఇది కారుకు చాలా ప్రీమియం లుక్‌ని అందిస్తుంది.

మొత్తంగా చూస్తే, లాంగ్ రేంజ్, మంచి స్పేస్ ఉండటం, అద్భుతమైన పనితీరు, ఫీచర్లు, క్వాలిటీకి తగ్గ ధర కారణంగా Mahindra XEV 9S కస్టమర్లకు ఒక మంచి ఎంపికగా మారింది. ముఖ్యంగా 79kWh బ్యాటరీ వేరియంట్ 470 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇవ్వడం వల్ల లాంగ్ జర్నీ చేసేవారికి ఇది మంచి ఆప్షన్‌గా మారడంతో విక్రయాలు పెరిగే అవకాశాలున్నాయి.