Maruti e Vitara Specs: మారుతి సుజుకి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మారుతి తొలి ఎలక్ట్రిక్‌ SUV ఇ-విటారా ఈ రోజు (2 డిసెంబర్‌ 2025) అధికారికంగా లాంచ్‌ కానుంది. ఈ మోడల్ ఇప్పటికే అంతర్జాతీయంగా మంచి రెస్పాన్స్‌ అందుకుంది. భారతదేశంలో కూడా ఇదే క్రేజ్‌ కొనసాగుతుందని Maruti ఆశిస్తోంది. ముఖ్యంగా... Hyundai Creta Electric, Tata Curvv EV, MG ZS EV, Mahindra BE 6 వంటి మోడళ్లతో పోటీ పడనుంది. కాబట్టి, ఈ లాంచ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

Continues below advertisement

ధరలు ఎలా ఉండొచ్చు?Maruti e Vitara SUV ధర గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 49kWh బ్యాటరీ ఉన్న వేరియంట్‌ ధర సుమారు రూ.20 లక్షల ఎక్స్‌-షోరూమ్‌, 61kWh వేరియంట్‌ ధర సుమారు రూ.25 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ వరకు ఉండొచ్చు. ఇలా చూస్తే... ఈ SUV భారత మార్కెట్లో ఇప్పటికే ఉన్న మిడ్‌సైజ్‌ ఎలక్ట్రిక్‌ SUVల తరహాలోనే దూకుడుగా ఎంట్రీ ఇవ్వబోతోంది.

బ్యాటరీలు & రేంజ్‌ – యూజర్లు తెలుసుకోవాల్సిన కీలక విషయంఇ విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది, అవి – 49kWh & 61kWh. ఇవి రెండూ ముందుభాగంలో ఉన్న మోటర్‌తో నడుస్తాయి. ఇండియాలో మొదటగా FWD వెర్షన్‌లు మాత్రమే లాంచ్‌ అవుతాయి.

Continues below advertisement

బ్యాటరీల పవర్‌ & రేంజ్‌ ఇలా ఉన్నాయి:

  • 49kWh FWD – 144hp, సుమారు 344km WLTP రేంజ్
  • 61kWh FWD – 174hp, సుమారు 428km WLTP రేంజ్
  • 61kWh AWD – 184hp, 394km WLTP రేంజ్ (ఇది తర్వాత రావచ్చు)

ఈ ఆప్షన్లను బట్టి, భారతీయ రోడ్డు పరిస్థితుల్లో 400 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్‌ ఇవ్వడం పెద్ద ప్లస్ పాయింట్.

ఇంటీరియర్‌ & ఫీచర్లు – ఆధునిక లుక్‌, ఉపయోగకరమైన డిజైన్‌ఇ విటారాలో లోపల అడుగు పెడితే మీకు ఒక మోడ్రన్‌, క్లియర్‌ లుక్‌ కనిపిస్తుంది. ముఖ్యంగా డ్యూయల్‌-స్క్రీన్‌ సెటప్, సింగిల్‌ గ్లాస్‌ ప్యానెల్‌, అసిమెట్రిక్‌ డాష్‌బోర్డ్‌ డిజైన్‌ ఈ SUVకి ప్రత్యేకతను ఇస్తాయి.

హైయ్యర్‌ ట్రిమ్స్‌లో ఉన్న ముఖ్య ఫీచర్లు:

  • 360-డిగ్రీ కెమెరా
  • వైర్‌లెస్‌ చార్జింగ్‌
  • సన్‌రూఫ్‌
  • పవర్డ్‌ డ్రైవర్‌ సీట్‌
  • ఇన్ఫినిటీ సౌండ్‌ సిస్టమ్‌ విత్‌ సబ్‌వూఫర్‌
  • 7 ఎయిర్‌బ్యాగ్స్‌
  • లెవల్‌-2 ADAS

భారత మార్కెట్‌లో సేఫ్టీ ప్రాముఖ్యత పెరగడంతో ఇవి చాలా ఉపయోగకరమైన అప్‌డేట్స్‌.

స్పేస్‌ & ప్రాక్టికల్‌ యూజ్‌ – ఫ్యామిలీకి బాగుంటుందా?ముందు సీట్లలో స్పేస్‌ మంచి స్థాయిలో ఉంది. కానీ వెనుక భాగంలో హెడ్‌రూమ్‌ కొంచెం తక్కువగా అనిపించవచ్చు. వెనుక సీట్లు స్లైడ్‌ అయ్యేలా ఉండటం వల్ల లెగ్‌ రూమ్‌–బూట్‌ స్పేస్‌ని మీకు కావాల్సినట్లుగా సర్దుకోవచ్చు. ఇండియా స్పెక్‌ మోడల్‌లో బూట్‌ యుటిలిటీ కొంచెం మెరుగుపరిచినట్లు కంపెనీ చెబుతోంది.

డ్రైవింగ్‌ అనుభవం – కంఫర్ట్‌ మీద ఫోకస్‌174hp ఇచ్చే 61kWh వెర్షన్‌ను డ్రైవ్‌ చేసినప్పుడు, బండి స్పీడ్‌పైన కాకుండా స్మూత్‌ డ్రైవింగ్‌ అనుభవం మీద కంపెనీ ఫోకస్‌ చేసినట్లు తెలుస్తుంది. 0–100 kmph వేగాన్ని అందుకోవడానికి పట్టిన సమయం కేవలం 8.7 సెకన్లు అయినా, డ్రైవింగ్‌ ఫీలింగ్‌ కంఫర్ట్‌ వైపే ఎక్కువగా ఉంది. హైవేపై టైరు శబ్దం, గాలి శబ్దం కొంచెం వినిపించొచ్చు. రీజెన్‌ బ్రేకింగ్‌ కూడా స్క్రీన్‌ ద్వారా సెట్‌ చేయాల్సి రావడం కొంచెం టైం పడుతుంది.

మొత్తం మీద మారుతి ఇ విటారా, భారత ఎలక్ట్రిక్‌ SUV మార్కెట్లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతోంది. ధరను అందుబాటులో ఉంచి, డ్రైవింగ్‌ రేంజ్‌ బాగా ఇస్తే... ఇది క్రెటా ఎలక్ట్రిక్‌, కర్వ్‌ EV వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలవడం ఖాయం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.