New Rajdoot 350: 1980లో దుమ్మురేసి దడదడ లాడించిన రాజ్‌దూత్ లెజెండ్ క్లాసిక్ బైక్ ఇప్పుడు మరోసారి రోడ్లపైకి రానుంది. నేటి తరం ఆలోచనలు, ప్రభుత్వాల రూల్స్‌కు తగ్గట్టుగానే రీడిజైన్ చేసిన మార్కెట్‌లోకి రానుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ బైక్ ఫస్ట్ లుక్ రైడర్స్ అంచనాలు పెంచేస్తోంది. 1980లో రాజ్‌దూత్ బైక్ అంటే పరుగులు పెట్టే వాళ్లు. ఆ సౌండ్ వింటేనే పలాన వ్యక్తి బైక్ అని చెప్పేసే వాళ్లు. తర్వాత తర్వాత ఆ సంస్థ బైక్ ఉత్పత్తిని ఆపేయడంతో ఆ సౌండ్ లేకుండాపోయింది. ఇప్పుడు మరోసారి మార్కెట్‌లో రీసౌండ్ చేయడానికి సిద్ధమైంది. క్రూజర్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ప్రత్యామ్నాయంగా, రిట్రో స్టైల్‌తో, మోడరన్ ఫీచర్లతో ఈ బైక్ అందుబాటులోకి రానుంది.
1980ల్లో సంచలనం సృష్టించిన రాజ్‌దూత్‌కి, ఇప్పుడు రాబోతున్న రాజ్‌దూత్‌కి మధ్య తేడాను ఓసారి చూద్దాం.
| ఫీచర్స్ | 1980రాజ్‌దూత్ 350 | 2025 న్యూరాజ్‌దూత్ |
| ఇంజిన్ | 346సీసీ, 2-స్ట్రోక్, ట్విన్-సిలిండర్ | 349సిసి, 4- స్ట్రోక్, సింగిల్ సిలిండర్ |
| పవర్ | సుమారు 30బీహెచ్‌పీ | సుమారు 20.5-22బీహెచ్‌పీ |
| టార్క్ | 27Nm | 27-30Nm |
| గేర్ బాక్స్ | 4-స్పీడ్ | 5-స్పీడ్ |
| కూలింగ్ | ఎయిర్ కూల్డ్ | ఎయిర్ కూల్డ్ |
| స్టార్టింగ్ | కిక్ స్టార్ట్ మాత్రమే | కిక్ అండే సెల్ఫ్ స్టార్ట్ |
| బ్రేకులు | డ్రమ్ బ్రేక్స్(ఫ్రంట్ అండర్ రియర్) | డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్ ఛానల్ ఏబీసీ |
| మైలేజీ | 20-25 కిలోమీటర్లు | 35-40 కిలోమీటర్లు |
| ఫీచర్లు | బేసిక్ అనలాగ్ మీటర్లు | డిజిటల్- అనలాగ్ క్లస్టర్, బ్లూటూత్, ఎల్‌డీఈ లైట్స్, యూఎస్‌బీ ఛార్జర్ |
| వెయిట్ | సుమారు 185 కిలోలు | 141-190 కిలోలు (వేరియంట్ ఆధారంగా మారుతుంది) |
| డిజైన్ | క్లాసిక్, రెట్లో | రెట్లో+ మోడ్రన్ టచ్ |
| సేఫ్టీ | తక్కువ | డ్యూయల్ ఛానల్ ఏబీసీ, మెరుగైన బ్రేకింగ్ |
| కంఫర్ట్ | బేసిక్ సీటు, తక్కువ సస్పెన్షన్ | ప్లష్ సీటు, మెరుగైన సస్పెన్షన్ |
ముఖ్యమైన తేడాలు:-
ఇంజిన్ టెక్నాలజీ:- పాతది టూ స్ట్రోక్స్‌తో వస్తుంటే కొత్తది 4స్ట్రోక్స్‌తో వస్తోంది. ఇందులో మైలేజీ పెరుగుతుంది. కాలుష్యం తగ్గుతుంది. మెరుగైన రిఫైన్మెంట్ ఇస్తుంది.
ఫీచర్లు:- కొత్త వర్షన్‌లో బ్లూటూత్ ఆఫ్షన్, ఎల్‌ఈడీ లైట్స్ ఇతర టెక్నాలజీ ఇవ్వడంతో నేటి తరానికి ఆకట్టుకునేలా ఉంటుంది.
బ్రేకింగ్ అండే సేఫ్టీ:- పాత బైక్‌లో డ్రమ్ బైక్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొత్త బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీసీ సిస్టమ్ వస్తోంది. దీని వల్ల ప్రమాదాలు జరిగేందుకు అవకాశం తక్కువ ఉంటుంది.
కంఫర్ట్ అండే స్టైలింగ్:- పాత బైక్‌లో ఎక్కువ దూరం వెళ్లడానికి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు కొత్త వచ్చే మోడల్‌లో ప్లాష్ సీట్లు ఉండటంతో ఎంత దూరమైనా ప్రయాణం చేసే కంఫర్ట్ వస్తుంది.
ఎమిషన్స్ అండే మైలేజ్:- మారిన రూల్స్‌కు అనుగుణంగా కొత్త బైక్ డిజైన్ చేశారు. అందుకే కాలుష్యం తగ్గుతుంది. అదే టైంలో మైలేజీ కూడా ఇవ్వబోతోంది.
సింపుల్‌గా చెప్పాలంటే పాత రాజ్‌దూత్ బైక్ మోడల్ క్లాసిక్, పవర్‌ఫుల్, కానీ టెక్నాలజీ పరంగా ఓల్డ్ వెర్షన్. మైలేజీ కూడా తక్కువ ఇచ్చేది. కాలుష్యం కూడా ఎక్కువ ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడు కొత్తగా డిజైన్ చేసిన బైక్ లెటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. కాలుష్యం తగ్గుతోంది. మైలేజీ పెరిగింది. కంఫర్ట్ కూడా ఉంటుంది. సేఫ్టీ విషయంలో అడుగు ముందే ఉంటోంది. రెట్రో లుక్‌తో మోడ్రన్ రైడింగ్ అనుభూతి ఇవ్వబోతోంది. అల్లాయిస్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్స్, సీటు హై ఆప్షన్ ఇలా చాలా విషయాల్లో బెటర్‌గా ఉంటోంది.