Gig Worker Demands: ఆఫీస్‌కో, ఎయిర్‌పోర్టుకో వెళ్లడానికి ఓలా ఉబర్ లేదా ర్యాపిడో బుక్ చేస్తున్నారా? అవ్వడం లేదా. అయితే ముందు ఈ వార్తను చదవాల్సిందే. శనివారం నాడు దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత వాహనాల డ్రైవర్లు పెద్ద ఎత్తున సమ్మెకు దిగుతున్నారు. వీళ్లనే గిగ్ వర్కర్స్ అంటారు. దీని వల్ల మెట్రో నగరాల నుంచి పల్లెల దాక క్యాబ్, ఆటో సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. 

Continues below advertisement

అసలేం జరుగుతోంది? ఎందుకీ గొడవ?

ప్రతి రోజూ మనల్ని ఎంతో సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చే ఈ డ్రైవర్ల జీవితాల్లో మాత్రం భద్రత అనేది కరవైంది. ఎన్నాళ్ల నుంచో తమ గోడు వినాలని కోరుతున్నా కంపెనీలు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడంతో వీరంతా ఇప్పుడు స్టీరింగ్ వదిలి ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైకి వచ్చారు. 

డ్రైవర్ల బాధలేంటి? వారి డిమాండ్లు ఏంటీ?

వినియోగదారులు కట్టే డబ్బుల్లో సగం కంపెనీలకే పోతోంది. ఇందులో తమకు ఏం మిగలడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కనీసం ఛార్జీల నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్న వేళ తమకు బేస్ ఛార్జీలు మాత్రం పెరగడం లేదని వాపోతున్నారు. పని గంటలపై నియంత్రణ కోరుతున్నారు. పొద్దున్న మొదలు పెడితే అర్థరాత్రి దాకా పని చేసినా సరైన కూలి రావడం లేదని, దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని అంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ఇన్సూరెన్స్ గానీ, ఆర్థిక భరోసా గానీ ఏం లేదని వారు బాధపడుతున్నారు. కంపెనీలు భారీ లాభాలు గడిస్తున్నా, దానికి కారణమైన డ్రైవర్లు మాత్రం పేదరికంలోనే ఉండిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Continues below advertisement

ఈ పోరాటాన్ని డ్రైవర్లు ఆల్‌ ఇండియా బ్రేక్‌డౌన్‌గా పిలుస్తున్నారు. అంటే దేశ మొత్తం మీ ఒక్క యాప్ ఆధారిత వాహనం కూడా కదలకూడదన్నది వారి పంతం. ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి సమస్యలను వివరిస్తూ లేఖ రాశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని లేకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని గిగ్ వర్కర్ల సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు. 

సామాన్యులకు ఇబ్బందులు 

మెట్రో నగరాల్లో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెల్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ఇది తెలియని చాలా మంది యాప్‌లో వెహికల్స్ రావడం లేదని నెట్‌వర్క్ లేదని భావిస్తున్నారు. ఏం అయిందో తెలియక తికమత పడుతున్నారు. 

హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో పరిస్థితి కాస్త సీరియస్‌గానే ఉంది. మఖ్యంగా ఐటీ హబ్‌లు ఎక్కువగా ఉన్న చోట ఆఫీస్‌లకు వెళ్లే వేల సంఖ్యలో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆన్‌ యాప్‌లలో వాహనాలు బుక్ కాకపోవడంతో ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. క్యాబ్ బుక్ చేస్తుంటే కన్ఫామ్ అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటోంది. దీని వల్ల ధరలను విపరీతంగా పెంచేశారు. అందుకే చాలా మంది మెట్రో రైళ్లను, ఆర్టీసీ బస్‌లను, నార్మల్ ట్యాక్సీలను బుక్ చేసుకుంటున్నారు. మరికొందరు సొంత వాహనాల్లో ఆఫీస్‌లకు వెళ్తున్నారు. 

ఈ సమ్మె ప్రభావం కేవలం ప్రయాణాలకే పరిమితం కాలేదు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి యాప్‌లైప కూడా పడింది. చాలా మంది డ్రైవర్లు ఒకేసారి అటు క్యాబ్‌లను నడుపూతనే ఈ డెలవరీ పనులు చేస్తుంటారు. ఇప్పుడు ఆవి కూడా పని చేయం లేదు. వీరంతా సమ్మెలో పాల్గొనడంతో డెలివరీలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి.