Volkswagen Discounts On Cars January 2026: జనవరి 2026 నెలలో, వోక్స్‌వ్యాగన్ ఇండియా, తమ పాపులర్ కార్లైన టైగన్ SUV, విర్టస్ సెడాన్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ MY2025 మోడళ్లకు మాత్రమే వర్తిస్తాయి.
ఈ నెలలో లభించే మొత్తం ప్రయోజనాల్లో "డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ లేదా లాయల్టీ బోనస్, స్క్రాపేజ్ ఇన్సెంటివ్" (రూ.20,000 వరకు) ఉన్నాయి. అయితే నగరం, స్టాక్ లభ్యత ఆధారంగా డిస్కౌంట్లు మారే అవకాశం ఉందని కంపెనీ స్పష్టం చేసింది.
ఎంట్రీ వేరియంట్లపై ఎక్కువ లాభం
ఫోక్స్‌వ్యాగన్ ఈసారి ఎంట్రీ లెవల్ వేరియంట్లపై అత్యధిక డిస్కౌంట్లు అందిస్తోంది. అంటే, సామాన్యులు కొనే కార్లపైనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. హైయ్యర్ వేరియంట్లకు మాత్రం ఎక్కువగా ఎక్స్చేంజ్ బోనస్ మాత్రమే లభిస్తోంది.
Volkswagen Taigunపై జనవరి 2026 డిస్కౌంట్లు
టైగన్ మోడల్‌లో Comfortline MT ఎంట్రీ వేరియంట్‌పై రూ.1.04 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇదే ఈ నెలలో టైగన్‌పై అత్యధిక ప్రయోజనం.
అలాగే Highline Plus AT వేరియంట్‌కు రూ.1 లక్ష, GT Line AT వేరియంట్‌కు రూ.80,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వేరియంట్లన్నీ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (115hp)తో వస్తాయి.
GT Plus Chrome DSG, GT Plus Sport DSG వంటి టాప్ వేరియంట్లకు రూ.50,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ మాత్రమే లభిస్తోంది.
Hyundai Creta, Tata Sierra కు ప్రత్యర్థిగా ఉన్న టైగన్ ధరలు ప్రస్తుతం రూ.11.42 లక్షల నుంచి రూ.19.19 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో టైగన్‌కు ఫేస్‌లిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది.
Volkswagen Virtusపై జనవరి 2026 డిస్కౌంట్లు
విర్టస్ సెడాన్‌లో Comfortline MT వేరియంట్‌పై రూ.1.26 లక్షల వరకు డిస్కౌంట్ లభించడం ఈ నెల హైలైట్. ఇది విర్టస్ శ్రేణిలోనే అత్యధిక ప్రయోజనం.
అదే విధంగా, Highline Plus ATకి రూ.1 లక్ష, GT Line ATకి రూ.80,000 వరకు లాభం పొందొచ్చు.
150hp పవర్‌ఫుల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 7 స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో వచ్చే GT Plus Chrome DSG, GT Plus Sport DSG వేరియంట్లకు రూ.30,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది.
మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే 1.5 లీటర్ వేరియంట్లపై మాత్రం ఈ నెలలో ఎలాంటి ఆఫర్లు లేవు.
విర్టస్ ధరలు ప్రస్తుతం రూ.11.20 లక్షల నుంచి రూ.18.78 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ధర) ఉన్నాయి. ఈ కారుకూ త్వరలో ఫేస్‌లిఫ్ట్ వచ్చే సూచనలు ఉన్నాయి.
తెలుగు ప్రజలకు సూచన
మీరు విర్టస్ లేదా టైగన్ కొనుగోలు చేయాలని చూస్తుంటే, జనవరి 2026 సరైన సమయం అని చెప్పొచ్చు. అయితే డిస్కౌంట్లు నగరం, డీలర్‌షిప్ ఆధారంగా మారుతాయన్న విషయం గుర్తుంచుకుని, లోకల్ షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.