Volkswagen Taigun Facelift : ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజ్‌ను మరింత క్యాష్ చేసుకునేందుకు జర్మన్ కార్ మేకర్ వోక్స్‌వ్యాగన్ సిద్ధమైంది. తన బెస్ట్ సెల్లింగ్ SUV Taigun ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఏప్రిల్ 9, 2026న ఇండియాలో అఫీషియల్‌గా అన్‌వీల్ చేయబోతోంది. ఈ లేటెస్ట్ అప్‌డేటెడ్ మోడల్ పాత వెర్షన్ కంటే చాలా రిఫ్రెష్డ్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్, ఇంటీరియర్ ట్రిమ్స్, ఒక స్పెషల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మార్కెట్లోకి వస్తోంది.
రీసెంట్‌గా బయటకు వచ్చిన స్పై షాట్స్ గమనిస్తే, ఈ టైగన్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ ఎండ్ గ్లోబల్ మోడల్ Tayron R-Lineను పోలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలా స్లిమ్ గా ఉండే LED హెడ్‌లైట్స్, వాటిని కలుపుతూ ఒక స్టైలిష్ లైట్ బార్, వెలిగే VW బ్యాడ్జ్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు రీడిజైన్ చేసిన ఫ్రంట్, రియర్ బంపర్స్, కొత్త గ్రిల్, టెయిల్-ల్యాంప్స్ లో చేసిన మార్పులు కారుకు ఒక అగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి.
అదిరిపోయే ఇంటీరియర్..
కారు ఇంటీరియర్ విషయానికి వస్తే, వోక్స్‌వ్యాగన్ క్వాలిటీ మెటీరియల్స్, కొత్త కలర్ స్కీమ్‌ను వాడినట్లు సమాచారం. ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పెద్దదైన 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే హైలైట్‌గా ఉండబోతున్నాయి. పవర్డ్ అడ్జస్టబుల్ సీట్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కారు లోపల లగ్జరీ ఫీల్ ఇస్తాయి. ఎండాకాలంలో కూలింగ్ పర్ఫార్మెన్స్ పెంచేలా మెరుగైన ఎయిర్-కండిషనింగ్ కంప్రెసర్‌ను కూడా ఇందులో అమర్చారు.
పవర్ఫుల్ ఇంజిన్..
మెకానికల్ పరంగా చూస్తే, టైగన్ ఫేస్‌లిఫ్ట్ పాత ఇంజన్ లైనప్‌నే కంటిన్యూ చేస్తోంది. 115 hp పవర్ ఇచ్చే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 150 hp పవర్ ఇచ్చే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఒక కీలక మార్పు ఏంటంటే, 1.0-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్‌లో పాత 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ గేర్‌బాక్స్ ప్లేస్‌లో కొత్త 8-స్పీడ్ యూనిట్ రాబోతోంది. ఇది డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ను మరింత స్మూత్ గా చేస్తుంది. ప్రస్తుతం ఉన్న టైగన్ ధర రూ. 11.42 లక్షల నుండి రూ. 19.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర దీనికంటే కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
