VinFast VF MPV 7 EMI Calculations: ఇండియ‌న్ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి వియత్నాంకు చెందిన ప్రముఖ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) తన మూడవ కారును ప్రవేశపెట్టింది. ఇప్పటికే వీఎఫ్ 6, వీఎఫ్ 7 వంటి ఎస్‌యూవీలను లాంచ్ చేసిన ఈ కంపెనీ, ఇప్పుడు ఫ్యామిలీ అవసరాల కోసం ‘వీఎఫ్ ఎంపీవీ 7’ (VF MPV 7) ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ కేవలం ఒకే ఒక ఫుల్లీ లోడెడ్ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధరను రూ. 24.49 లక్షలుగా నిర్ణయించారు. ఇది మార్కెట్లో ఉన్న బీవైడీ ఈమ్యాక్స్ 7 (BYD eMax 7), కియా కార్నివాల్ ఈవీ, మహీంద్రా XEV 9S వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే ఈ కారు ప‌వ‌ర్ వివ‌రాలు, కారును డౌన్ పేమెంట్ సాయంతో కొనాల‌నుకుంటున్నారా..? అయితే దీనికి సంబంధించిన వివ‌రాలు తెలుసుకుందాం.

Continues below advertisement

రేంజ్ - బ్యాటరీ పవర్...విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 కారును చూడటానికి చాలా సింపుల్ గా, మోడ్రన్ గా డిజైన్ చేశారు. మూడు వరుసల సీటింగ్ తో ఉండే ఈ ఎంపీవీలో ఏడుగురు హాయిగా ప్రయాణించవచ్చు. ఇందులో 60.13 kWh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ప్యాక్ కలదు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ వాడితే కేవలం 30 నిమిషాల్లోనే 10 నుండి 70 శాతం వరకు బ్యాటరీ నిండుతుంది. దీని మోటార్ 201 bhp పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల కారు పికప్ చాలా స్మూత్ గా ఉంటుంది.

నెలవారీ ఈఎంఐ లెక్కలు..మీరు ఈ కారును లోన్ ద్వారా సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, మీ ఈఎంఐ ఎంత ఉండవచ్చో ఇక్కడ తెలుసుకోండి. ఎక్స్‌షోరూమ్ ధర రూ. 24.49 లక్షల మొత్తాన్ని లోన్ గా తీసుకుని, 9.5% వడ్డీ రేటుతో లెక్కిస్తే వేర్వేరు కాలపరిమితులకు ఈఎంఐలు ఇలా ఉంటాయి:

Continues below advertisement

3 ఏళ్ల కాలపరిమితి (36 నెలలు): ప్రతి నెలా మీరు రూ. 78,449 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలంలో మొత్తం వడ్డీ రూ. 3,75,153 అవుతుంది.

4 ఏళ్ల కాలపరిమితి (48 నెలలు): నెలవారీ ఈఎంఐ రూ. 61,527 గా ఉంటుంది. మొత్తం వడ్డీ రూ. 5,04,275 కట్టాలి.

5 ఏళ్ల కాలపరిమితి (60 నెలలు): నెలవారీ భారం తగ్గి ఈఎంఐ రూ. 51,434 కి చేరుతుంది. ఐదేళ్లలో మొత్తం వడ్డీ రూ. 6,37,014 అవుతుంది.

ఫీచర్లు - పోటీ..ముఖ్యంగా పెద్ద కుటుంబాలకు, ఎక్కువ రేంజ్ కోరుకునే వారికి ఈ కారు ఒక బెస్ట్ ఆప్షన్. కియా క్యారెన్స్, ఎంజీ విండ్సర్ ఈవీ వంటి కార్ల కంటే ఇది ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. విన్‌ఫాస్ట్ తన కస్టమర్ల కోసం మంచి కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్లను ఈ ఎంపీవీలో పొందుపరిచింది. ప్రస్తుతం నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పెట్రోల్ ఖర్చులు లేకుండా లాంగ్ ట్రిప్స్ వెళ్లాలనుకునే వారికి 517 కిమీ రేంజ్ ఇచ్చే వీఎఫ్ ఎంపీవీ 7 ఒక పక్కా ఫ్యామిలీ కార్ అని చెప్పవచ్చు. త్వరలో దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో ఈ కారు అందుబాటులోకి రానుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.