Vinfast electric cars VF6 and VF7 Latest News:   ఫ్యూచ‌ర్ వెహికల్స్ గా ప‌రిగ‌ణిస్తున్న ఈవీ మార్కెట్లోకి వియత్నాం ఆటో మొబైల్ తయారీదారు విన్‌ఫాస్ట్ ప్ర‌వేశించింది. అధునాత‌న‌మైన ఫీచ‌ర్లు, లాంగ్ రేంజితో త‌న ల‌క్కును ప‌రిక్షించుకోవాల‌ని చూస్తోంది. తాజాగా ఈ కంపెనీ భారత మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ కార్లు VF6 , VF7లను విడుదల చేసింది. VF6 ధర రూ.16.3 లక్షలు కాగా, VF7 ధర రూ.20.8 లక్షలుగా నిర్ణయించారు. ఇవి ప్రీమియం EV సెగ్మెంట్‌లో XUV400 EV మరియు హారియర్ EV వంటి వాహనాలకు పోటీగా నిలవగలవని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఈ రెండు ఎలక్ట్రిక్ SUVలు తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడిలో ఉన్న విన్‌ఫాస్ట్ అసెంబ్లీ ప్లాంట్‌లో లోకల్‌గా అసెంబుల్ చేయబడుతున్నాయని తెలుస్తోంది. ఈ వాహనాలను మొదటిగా ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రదర్శించారు. అక్క‌డ ఈ మోడ‌ళ్ల‌కు మంచి స్పంద‌న ల‌భించిన‌ట్లుగా కంపెనీ వ‌ర్గాలు తెలిపాయి. VF6, కంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో విడుదల కాగా, దాని డిజైన్ యునిక్‌గా ఉంటుందని పేర్కొన్నాయి.

సూప‌ర్బ్ ఫీచ‌ర్లు..ఈ కారు 18 అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, ముందు భాగంలో LED DRL లాంటి రియర్ లైట్ బార్‌తో అందుబాటులో ఉంది. 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, గూగుల్ యాప్స్, వాయిస్ అసిస్టెంట్, ఫిక్స్‌డ్ ప్యానోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. VF7లో పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, వీగన్ లెదర్ ఉపహోల్స్టరీ, హెడ్‌స్-అప్ డిస్‌ప్లే, ప్రీమియం సాఫ్ట్-టచ్ ఇంటీరియర్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అధునాతన‌మైన ఈ ఫీచ‌ర్ల‌లో ఈవీ మార్కెట్ లో త‌మ ముద్ర వేస్తామ‌ని కంపెనీ ఆశాభావంతో ఉంది. 

శ‌క్తివంత‌మైన ఇంజిన్.. పవర్ పరంగా చూస్తే, VF6లో 59.6kWh బ్యాటరీ ప్యాక్, ఫ్రంట్-వీల్స్ డ్రైవ్ మోటార్ ఉన్నాయి. దీని రేంజ్ 468 కిలోమీటర్లు కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 190mm గా ఉన్న‌ట్లు కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి. . VF7 రెండు బ్యాటరీ వేరియంట్లలో (59.6kWh మరియు 70.8kWh) అందుబాటులో ఉంది, దీని రేంజ్ 438 నుండి 532 కిలోమీటర్ల వరకు ఉంటుందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం విన్‌ఫాస్ట్‌కు భారత్‌లో 3 డీలర్ గ్రూప్స్, 32 డీలర్‌షిప్స్ ఉన్నాయి, త్వరలో వీటిని 35కి పెంచనున్నట్టు కంపెనీ త‌మ విస్తార‌ణ ప్ర‌ణాళిక‌ను వెల్లడించింది. కంపెనీ ప్రస్తుతానికి EV ఫ్రెండ్లీ నగరాలకు ప్రాధాన్యం ఇస్తూ, నెమ్మదిగా తమ నెట్‌వర్క్ , ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోందని తెలుస్తోంది. ప్రత్యేకంగా, కంపెనీ 2028 వరకూ ఉచిత EV చార్జింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోందని స‌మాచారం.