Volkswagen India Launches 2026: భారత మార్కెట్లో వోక్స్‌వ్యాగన్‌కు ప్రధానంగా అమ్మకాలు తీసుకొస్తున్న మోడళ్లు టిగువాన్‌ & విర్టస్‌. అయితే, ఈ రెండు కార్లు మార్కెట్లోకి వచ్చి ఇప్పటికే మూడేళ్లకు పైగా సమయం గడిచినా ఇప్పటివరకు పెద్దగా అప్‌డేట్స్‌ లేవు. ఈ పరిస్థితి 2026లో మారనుంది. వోక్స్‌వ్యాగన్‌ ఇండియా, తన లైనప్‌ను ఫ్రెష్‌ లుక్‌లోకి మార్చేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా ఒక ప్రీమియం 7 సీటర్‌ SUVని తీసుకురావడమే కాకుండా, ఇప్పటికే ఉన్న టిగువాన్‌, విర్టస్‌ మోడళ్లకు ఫేస్‌లిఫ్ట్‌ అప్‌డేట్స్‌ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తోంది.

Continues below advertisement

Volkswagen Tayron – 7 సీటర్‌ SUV (2026 తొలి అర్ధభాగంలో లాంచ్‌)

వోక్స్‌వ్యాగన్‌, టైరాన్‌ ద్వారా మళ్లీ 3-వరుసల SUV సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టనుంది. ఇది గతంలో నిలిపివేసిన టిగువాన్‌ ఆల్‌స్పేస్‌కు ప్రత్యామ్నాయంగా రానుంది. ఈ SUVని CKD కిట్స్‌ ద్వారా ఔరంగాబాద్‌ ప్లాంట్‌లో అసెంబుల్‌ చేస్తారు. ధర పరంగా ఇది టిగువాన్‌ R-Line కంటే కొంచెం తక్కువగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Continues below advertisement

టైరాన్‌లో 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది సుమారు 204hp పవర్‌, 320Nm టార్క్‌ ఇస్తుంది. 7 స్పీడ్‌ DSG ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌, ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ కూడా ఉంటుంది. డిజైన్‌ పరంగా టిగువాన్‌ R-Line లుక్‌ను పోలి ఉంటుంది. అయితే, మూడో వరుస సీట్ల కోసం బాడీ లెంగ్త్‌ ఎక్కువగా ఉంటుంది.

అంచనా ధర రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉండొచ్చని సమాచారం.

Volkswagen Taigun Facelift (2026 మూడో త్రైమాసికంలో లాంచ్‌)

టిగువాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ ఇప్పటికే టెస్టింగ్‌లో కనిపించింది. బాడీ షీట్‌ మెటల్‌లో పెద్దగా మార్పులు ఉండకపోయినా... బంపర్స్‌, లైట్స్‌, అల్లాయ్‌ వీల్స్‌ వంటి సాఫ్ట్‌ పార్ట్స్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. 

ఇంజిన్‌ ఆప్షన్లు ప్రస్తుతం ఉన్నట్లే 1.0 లీటర్‌, 1.5 లీటర్‌ పెట్రోల్‌గా కొనసాగుతాయి. అయితే, 1.0 లీటర్‌ వేరియంట్‌లో ఉన్న 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌కు బదులుగా కొత్తగా 8 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ వచ్చే అవకాశం ఉంది.

ఫీచర్లలో.., పానోరామిక్‌ సన్‌రూఫ్‌, ADAS వంటి కొత్త టెక్నాలజీలు చేరే అవకాశం ఉంది. 

అంచనా ధర రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).

Volkswagen Virtus Facelift (2026 నాలుగో త్రైమాసికంలో లాంచ్‌)

విర్టస్‌ ఫేస్‌లిఫ్ట్‌లో ఫ్రంట్‌, రియర్‌ డిజైన్‌లో మార్పులు, కొత్త అల్లాయ్‌ వీల్స్‌ చూడొచ్చు. ఇంటీరియర్‌, ఫీచర్ల విషయంలో టిగువాన్‌ ఫేస్‌లిఫ్ట్‌తో చాలా అంశాలు ఇందులోనూ కనిపిస్తాయి. కొత్తగా ADAS చేరే అవకాశం కూడా ఉంది. 

ఇంజిన్‌ ఆప్షన్లు యథాతథంగా కొనసాగుతాయి. 1.5 లీటర్‌ TSI ఇంజిన్‌కు 7 స్పీడ్‌ DSG లేదా 6 స్పీడ్‌ మాన్యువల్‌ ఆప్షన్లు ఉంటాయి. 1.0 లీటర్‌ పెట్రోల్‌కు కొత్త 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ వచ్చే అవకాశం ఉంది. 

అంచనా ధర రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.