Upcoming Tata Compact SUVs Under Rs 10 Lakhs: రూ. 10 లక్షల బడ్జెట్‌లో స్టైలిష్‌గా ఉండే, శక్తిమంతమైన & మెరుగైన SUVని కొనుగోలు చేయాలనుకుంటే, కాస్త ఓపిక పట్టండి. బిల్ట్‌ క్వాలిటీకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే టాటా మోటార్స్, త్వరలో మూడు గొప్ప ఆఫరింగ్స్‌ తీసుకువస్తోంది. వచ్చే రెండేళ్లలో, టాటా మోటార్స్ మూడు కొత్త కాంపాక్ట్ SUVలను విడుదల చేయబోతోంది, అవి - స్కార్లెట్, న్యూ-జెన్ నెక్సాన్ & పంచ్ ఫేస్‌లిఫ్ట్ (Scarlet, New-gen Nexon & Punch Facelift). 

ఏ కాంపార్ట్‌ SUV ఎలా ఉంటుంది?

టాటా స్కార్లెట్ టాటా స్కార్లెట్ పూర్తిగా కొత్త SUV మోడల్ అవుతుంది,టాటా సియెర్రా డిజైన్‌ ఇన్‌స్పిరేషన్‌తో టాటా స్కార్లెట్‌ను డిజైన్ చేసినట్లు ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు. ఈ SUVని టాటా కర్వ్ ICE ప్లాట్‌ఫామ్‌పై నిర్మించవచ్చు. పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఎంపికలు రెండూ ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ SUV లుక్ స్పోర్టీ & మస్క్యులర్‌గా ఉంటుంది, ఇది యువతకు ప్రత్యేకంగా నచ్చుతుంది. దీనికి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఇవ్వవచ్చు. భవిష్యత్తులో, టాటా స్కార్లెట్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ఈ కంపెనీ తీసుకురావచ్చు. టాటా స్కార్లెట్ ప్రారంభ ధర దాదాపు రూ. 9 లక్షలు ఉండవచ్చు, ఇది మిడ్-రేంజ్ SUVలను కొనుగోలు చేసే వారికి మంచి ఎంపికగా మారవచ్చు.

న్యూ-జెన్‌ టాటా నెక్సాన్టాటా అత్యంత విజయవంతమైన SUV నెక్సాన్. దీనికి తదుపరి తరం మోడల్ త్వరలో మార్కెట్లోకి రానుంది. "గరుడ్" అనే కోడ్‌నేమ్ ఉన్న ఈ SUV, టాటా X1 ప్లాట్‌ఫామ్ అప్‌డేటెడ్‌ వెర్షన్‌పై నిర్మించారు. అంటే.. ఆధునిక డిజైన్ &భద్రత సాంకేతికతల మెరుగైన మిశ్రమాన్ని గరుడ్ చూస్తుంది. ఈ కొత్త నెక్సాన్ పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా & లెవల్ 2 ADAS వంటి ప్రీమియం సెగ్మెంట్ లక్షణాలను కూడా యాడ్‌ చేసుకుంటుంది. ఇప్పటికే నెక్సాన్‌లో ఉపయోగించిన, ప్రజాదరణ పొందిన అదే విశ్వసనీయ 1.2L టర్బో పెట్రోల్ ఇంజిన్‌ & 1.5L డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్లను ఈ కారులో తీసుకువస్తున్నారు. దీని అంచనా ప్రారంభ ధర రూ. 9.50 లక్షల కంటే తక్కువగా ఉండవచ్చు.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో SUVలలో టాటా పంచ్ ఒకటి & ఇప్పుడు కంపెనీ దాని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకువస్తోంది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ గురించి ఇటీవలి టెస్టింగ్‌ సమయంలో బయటకు వచ్చింది. కొత్త పంచ్‌లోని అనేక డిజైన్‌ ఎలిమెంట్స్‌ పంచ్ EV నుంచి తీసుకోవచ్చు, తద్వారా ఇది మునుపటి కంటే మరింత మోడరన్‌ & అగ్రెసివ్‌ లుక్స్‌ ఇస్తుంది. ఈ అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో రిఫ్రెష్‌ చేసిన హెడ్‌లైట్లు, కొత్త గ్రిల్ & షార్ప్ బాడీలైన్స్‌ ఉంటాయి. ఇంటీరియర్‌లో.. కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటాయి, ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఈ SUVలో కొనసాగుతుంది. దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 7.5 లక్షల మధ్య ఉండవచ్చు.

2030 నాటికి 30 కొత్త వెహికల్స్‌టాటా మోటార్స్, 2030 నాటికి 30 కొత్త వాహనాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, వాటిలో 7 పూర్తిగా కొత్త మోడళ్లు. ఈ కంపెనీ ICE (పెట్రోల్-డీజిల్) & EV విభాగాలలో ఏకకాలంలో బలంగా ముందుకు కదులుతోంది. ఈ వ్యూహంలో భాగంగా, టాటా తన R&D, ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించడం ప్రారంభించింది.