Hyundai Creta 2025 New Rival SUVs: గత దశాబ్ద కాలంగా, మొత్తం మిడ్-సైజ్ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా టాప్ పొజిషన్‌లో కంటిన్యూ అవుతోంది. కానీ, 2026లో దాని సింహాసనం కదిలిపోవచ్చు. మూడు కొత్త SUVలు - Tata Sierra, New Gen Kia Seltos & Renault Duster - త్వరలోనే మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. ఇవి క్రెటాకు ప్రత్యామ్నాయంగా మారి ప్రత్యక్ష సవాలు విసరనున్నాయి.
టాటా సియెర్రాటాటా మోటార్స్, 2026 లో తన ఐకానిక్ Sierra కొత్త అవతారాన్ని విడుదల చేస్తోంది. మొదట ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రారంభిస్తారు. రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో 500 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను ఇది అందిస్తుంది. ఆ తర్వాత, పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ వెర్షన్‌లను టాటా పరిచయం చేస్తుంది, వీటిలో 1.5L పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్ (170hp) & 2.0L డీజిల్ (170hp, 350Nm) ఉన్నాయి.
కొత్త సియెర్రా డిజైన్ రెట్రో & మోడ్రన్ లుక్స్ కలయికతో అద్భుతంగా ఉంటుంది. బాక్సీ సిల్హౌట్, పెద్ద గ్లాస్ ఏరియా, LED హెడ్‌ల్యాంప్‌లు & రూఫ్ రెయిల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్‌ను ఈ కొత్త కారులో చూడవచ్చు. క్యాబిన్‌లో త్రీ-స్క్రీన్ సెటప్, లెవల్ 2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ & హర్మాన్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹20-25 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
న్యూ ఏజ్ కియా సెల్టోస్క్రెటా అతి పెద్ద ప్రత్యర్థి అయిన కియా సెల్టోస్‌లో నెక్ట్ జెన్ వెర్షన్ 2026లో రానుంది. మొత్తం ప్రపంచవ్యాప్త అరంగేట్రం జనవరి 2026లో జరుగుతుంది, భారతదేశంలో లాంచ్ ఫిబ్రవరి-మార్చి 2026లో జరగనుంది. కొత్త సెల్టోస్ 2026లో ఆపోజిట్స్ యునైటెడ్ డిజైన్ ఫిలాసఫీ ఉంటుంది, ఇందులో - స్లిమ్ LED DRLs, పెద్ద ఫ్రంట్ గ్రిల్ & కనెక్టెడ్ టెయిల్‌లైట్లు ఉంటాయి. ఇంటీరియర్‌లో డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్, లెవల్-2 ADAS & రీడిజైన్ చేసిన డాష్‌బోర్డ్ కూడా మనం చూడవచ్చు. ఈ ఇంజిన్ లైనప్‌లో 1.5L పెట్రోల్ (115hp), 1.5L టర్బో పెట్రోల్ (160hp) & 1.5L డీజిల్ (116hp) ఉంటాయి. ఈ కంపెనీ, 2027లో, 1.5L పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్‌లా కూడా ప్రవేశపెడుతుంది. సెల్టోస్ ధర ₹12-21 లక్షల మధ్య ఉంటుందని అంచనా. దాని కనెక్టెడ్ టెక్నాలజీ (అలెక్సా ఇంటిగ్రేషన్), ప్రీమియం ఇంటీరియర్ & హైబ్రిడ్ సామర్థ్యాలతో, ఈ SUV క్రెటా & టాటా సియెర్రా రెండింటికీ పోటీగా ఉంటుంది.
కొత్త రెనాల్ట్ డస్టర్ కాంపాక్ట్ SUV విభాగంలో తొలి మార్గదర్శి రెనాల్ట్ డస్టర్, 2026లో కొత్త అవతార్‌లో ప్రజల ముందుకు రానుంది. సెప్టెంబర్ 2025లో చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది, మార్చి 2026లో ప్రజల ముందుకు వస్తుంది. కొత్త డస్టర్ మరింత రగ్గ్‌డ్ & పవర్‌ఫుల్ డిజైన్‌తో రాబోతోంది. ఇందులో బాక్సీ స్టాన్స్, కొత్త గ్రిల్ & V- ఆకారపు టెయిల్‌లైట్లు ఉంటాయి. ఇంటీరియర్‌లో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే), 7-అంగుళాల డిజిటల్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ & అర్కామిస్ సౌండ్ సిస్టమ్ వంటి లక్షణాలు ఉంటాయి.
భద్రత కోసం ఈ SUVకి ఆరు ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ESC & ADAS లతో వంటివి ఇచ్చారు. ఇంజిన్ ఆప్షన్లు - 1.0L టర్బో పెట్రోల్ (120hp), 1.2L టర్బో పెట్రోల్ (140hp), 1.6L హైబ్రిడ్ (170hp) & CNG వేరియంట్. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు - 6-స్పీడ్ మాన్యువల్ & CVT. దీనిలో డీజిల్ ఇంజిన్ రాదు. కొత్త డస్టర్ ధర ₹10-18 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. అందుబాటు ధర, హైబ్రిడ్ టెక్నాలజీ & 7-సీట్ల బిగ్‌స్టర్ వెర్షన్‌తో, ఈ SUV మరోసారి క్రెటాను సవాలు చేయడానికి సిద్ధమవుతోంది.