Upcoming Electric Cars India 2026: భారత్ ఆటోమొబైల్ రంగాన్ని గమనిస్తే, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న వేగం ఆశ్చర్యపరుస్తోంది. 2026 నాటికి భారత మార్కెట్‌లోకి అత్యంత శక్తివంతమైన, ఆకర్షణీయమైన మోడల్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి లగ్జరీ ప్రియుల వరకు అందరికీ సరిపోయేలా కంపెనీలు తమ వ్యూహాలను సిద్ధం చేశాయి.
టాటా సియెరా ఈవీ
భారతీయ కార్ల ప్రేమికులకు సియెరా అంటే ఒక ఎమోషన్. 90వ దశకంలో ఒక వెలుగు వెలిగిన ఈ బ్రాండ్‌ను టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ రూపంలో మళ్లీ తీసుకొస్తోంది.
ఇది కేవలం కారు మాత్రమే కాదు. ఒక ఐకానిక్ రెట్రో- మోడర్న్ డిజైన్. Acti.ev+ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతున్న ఈ కారులో 2WD, AWD ఆప్షన్లు ఉండబోతున్నాయి. దీని లాంచ్ జులై- ఆగస్టు మధ్య ఉండే అవకాశం ఉంది. 20 నుంచి 25 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో, ఒకారి ఛార్జ్ చేస్తే 450-600 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే సామర్థ్యం దీని సొంతం. వాస్తవ పరిస్థితుల్లో ఇది 400-500 కి.మి. వరకు మైలేజ్ ఇవ్వవచ్చు.
టాటా అవిన్యా
టాటా గ్రూప్ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అవిన్యా ఇది కేవలం కారు కాదు. రోడ్లపై నడిచే ఒక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞాం. విశాలమైన ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ది ప్రీమియం సెగ్మెంట్‌లో నిలవనుంది. 2026మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉన్న కారు ధర 35 నుంచి 45 లక్షల వరకు ఉండవచ్చు. ఇది 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను ఇస్తుందని తెలుస్తోంది.
మహీంద్రా థార్ ఇ, బీఈ సిరీస్
ఆఫ్ రోడింగ్ అంటే ఇష్టపడే వారికి మహీంద్రా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో థార్‌ను పరిచయం చేస్తోంది. బోల్డ్ డిజైన్, ఆఫ్ రోడ్ కేపబిలిటీతో వస్తున్న థార్ ఇ, సాహసయాత్రలు చేసే వారికి ఒక క్రేజీ ఆప్షన్. 25 లక్ష ప్రారంభ ధరతో, 400-500 కిలోమీటర్ల రేంజ్‌తో ఇది 2026 ఆగస్టు లోపు మార్కెట్‌లోకి రావచ్చు.
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ వస్తున్న వాహనాలు
కుటుంబ అవసరాల కోసం వెతుకుతున్న వారికి ఈ సెగ్మెంట్ ఎంతో కీలక. ఇందులో మొదటి వరుసో కియా సైరోస్, హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఉన్నాయి. 14 నుంచి 22 లక్షల ధరలో 350-450 కిలోమీటర్ల రేంజ్‌తో ఇవి 2026 రెండో లేదా మూడో క్వార్టర్‌లో విడుదల కానున్నాయి.
టయోటా నుంచి ఆర్బన్ క్రూయిజ్ ఈవీ, మారుతి నుంచి ఇ-విటారా కూడా త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ మోడల్స్ 20-28 లక్షల ధరలో ఉండొచ్చు. వీటి రీసేల్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుందని అంచనా ఉంది.
2026లో రాబోతున్న ఈ వాహనాలు భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసించబోతున్నాయి. మీరు బడ్జెట్ ఆప్షన్లు కోసం చూస్తుంటే టాటా పంచ్ ఈవీ లేదా సిట్రోయెన్ ఇసీ3 అప్‌డేట్స్ మంచి ఎంపికలు. లగ్జరీ కోరుకుంటే హ్యుందాయ్ అయోనిక్ లేదా కియా ఈవీ9 వంటి మోడల్స్ సిద్ధంగా ఉన్నాయి.
