భారత్‌లో 125cc విభాగానికి మంచి డిమాండ్ ఉంటుంది. అదే విధంగా స్కూటీలు, ఈవీల కొనుగోళ్లు సైతం భారీగా పెరిగాయి. 125 సీసీ బైక్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఈ విభాగంలో బైక్ కొనుగోలు చేసే కస్టమర్‌లు మైలేజ్‌తో పాటు మంచి పనితీరు, స్టైలిష్ లుక్,  కొత్త ఫీచర్లు సైతం కావాలా.. అయితే TVS రైడర్ 125, బజాజ్ పల్సర్ ఎన్125 (Bajaj Pulsar NS125) ఈ విభాగంలో అత్యధిక విక్రయాలతో కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన బైక్స్ ఇవి. ఒక వైపు రైడర్ మోడ్రన్ టెక్నాలజీ, తక్కువ బరువుపై ఫోకస్ చేస్తాయి. అయితే Pulsar NS125 స్పోర్టీ రైడ్ కు వెళ్లినా పాత Pulsar ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. .

ఎక్కువ ఆదా చేసే బైక్ ఏది?

ఒకవేళ బడ్జెట్ విషయానికి వస్తే, TVS రైడర్ మీ డబ్బు మరింత ఆదా చేస్తుంది. టీవీఎస్ రైడర్ ప్రారంభ ధర Pulsar NS125 కంటే దాదాపు రూ.10 వేలు తక్కువ. దాంతోపాటు రైడర్ ABS వేరియంట్ Pulsar NS125 బేస్ వేరియంట్ కంటే చౌకగా లభిస్తుంది. ABS నేడు ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్‌గా మారింది. కనుక తక్కువ ధరలో ABS పొందడం రైడర్‌ కస్టమర్లకు ప్రయోజనాన్ని ఇస్తుంది.

సైజ్, బరువు మధ్య వ్యత్యాసం

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 (Bajaj Pulsar NS125) చూడటానికి కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. దీని వీల్‌బేస్ పొడవుగా, సీటు ఎత్తు సైతం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది హైవేపై మరింత నిలకడగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. TVS రైడర్ బరువులో చాలా తేలికగా ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో రైడర్‌ను నడపడం, యూ టర్న్ తీసుకోవడం చాలా సులభం. రోజువారీ సిటీలో అవసరాలకు తక్కువ బరువున్న రైడర్‌ను తీసుకోవడం బెస్ట్. TVS రైడర్ డిజైన్ యూత్ కోసం, ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. దీని షార్ప్ కట్స్, LED హెడ్‌ల్యాంప్స్ ఇతర బైకులతో ప్రత్యేకం చేస్తాయి. Pulsar NS125 దాని పాత Pulsar స్టైల్  కొనసాగిస్తుంది. ఇంధన ట్యాంక్, స్పోర్టీ బాడీ దీనికి క్లాసిక్, పవర్ ఫుల్ లుక్ రూపాన్ని ఇస్తాయి. 

ఫీచర్లు, సేఫ్టీలో ఏది బెస్ట్.. 

ఫీచర్ల విషయానికి వస్తే, TVS రైడర్ విభాగంలో బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్ట్, కాల్,  మెసేజ్ అలర్ట్‌లు, బూస్ట్ మోడ్, టాప్ వేరియంట్‌లో TFT డిస్‌ప్లే ఇచ్చారు. Pulsar NS125 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,  సింగిల్-ఛానల్ ABSతో వస్తుంది. Pulsar కావాలనే సింపుల్‌గా ఉంచారు. ఓల్డ్ క్లాస్ లుక్ కొనసాగించారు. 

ఇంజిన్, రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ 

TVS రైడర్ ఇంజిన్ సిటీలో రోజువారీ ఆఫీసు జర్నీకి పనికొస్తుంది. తక్కువ వేగంతో కూడా మంచి టార్క్ లభిస్తుంది. దీని వలన పదేపదే గేర్లు మార్చాల్సిన అవసరం అంతగా ఉండదు. Pulsar NS125 ఇంజిన్ ఎక్కువ RPM వద్ద మరింత బెటర్  అనిపిస్తుంది. మీరు స్పోర్టీ రైడ్ కోరుకుంటే కనుక కస్టమర్లకు Pulsar మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. రోజువారీ సిటీ రైడ్ కోసం టీవీఎస్ రైడర్ తీసుకోవడం మంచిదని కస్టమర్లు సూచిస్తున్నారు.