Cheapest Disc Brake Bikes in India: మీరు తక్కువ పెట్రోల్ ఖర్చులతో, డిస్క్ బ్రేక్ వంటి భద్రతా ఫీచర్లను అందించే బైక్ కోసం చూస్తున్నారా.. అయితే, భారతదేశంలో 3 బైక్‌లు మీ అవసరానికి తగ్గట్లుగా ఉన్నాయి. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus), TVS Radeon, బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125) తక్కువ ధరలోనే కాకుండా మైలేజ్, ఫీచర్లలో కూడా చాలా బాగుంటాయి. వీటి ధరలు తక్కువలో రూ. 73,200 నుంచి ప్రారంభమవుతాయి. ప్రత్యేకంగా నగరంలో ట్రాఫిక్, రోజువారీ రైడ్‌లను సులభతరం చేయడానికి రూపొందించారు. ఆ మూడు బైకుల ధర, వాటి ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం.
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus)
ఈ జాబితాలో అత్యంత చవకైన బైక్ TVS Star City Plus. దీని ధర రూ. 73,200 నుండి ప్రారంభం కాగా, ఇది 240 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది. స్టార్ సిటీ ప్లస్ బైక్ 109.7cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8.08 bhp పవర్, అదే సమయంలో 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దాదాపు 90 kmph గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఇది 83 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. 10 లీటర్ల ట్యాంక్ నింపితే, ఈ బైక్ దాదాపు 800 KM వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది LED DRL, డిజిటల్ అనలాగ్ మీటర్, ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగి ఉంది.
TVS Radeon
TVS Radeon ధర దాదాపు రూ. 80,700గా ఉంది. దీని 109.7cc ఇంజిన్ 8.08 bhp పవర్ తో పాటు 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో పాటు 4 స్పీడ్ గేర్‌బాక్స్ వస్తుంది. టీవీఎస్ Radeon బైక్ దాదాపు 74 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది. కాబట్టి పెట్రోల్ ఖర్చు ఆదా అవుతుంది. దీని మంచి డిజైన్, స్ట్రాంగ్ బాడీ, సౌకర్యవంతమైన సీటు రోజువారీ ఉపయోగం కోసం మంచి బైక్‌గా చేస్తాయి.
బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125)
మీరు కొంచెం స్పోర్టీగా కనిపించే బైక్‌ను ఇష్టపడే వారైతే Bajaj Pulsar 125 మీకు మంచి ఎంపిక. దీని డిస్క్ బ్రేక్ మోడల్ రూ. 79,048కి లభిస్తుంది. ఇది 124.4cc ఇంజిన్‌ను కలిగి ఉండగా, ఇది 11.8 PS పవర్, 10.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. దాదాపు 100 kmph గరిష్ట వేగం వరకు వెళ్లగల బైక్. మైలేజ్ దాదాపు 51 kmpl. బైక్ LED టెయిల్‌లైట్లు, స్ప్లిట్ సీటు, డిజిటల్ మీటర్, డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇది సిటీలో, హైవే రోడ్లు.. రెండింటిలోనూ సులభంగా డ్రైవ్ చేయవచ్చు.
మీకు ఏ బైక్ సరైనది?
మీరు చౌకైనది, ఎక్కువ మైలేజ్ కోరుకుంటే, TVS Star City Plus బైక్ సరైనది. మీరు రోజువారీ రైడ్ కోసం బెస్ట్ బైక్ కోసం చూస్తున్నట్లయితే TVS Radeon మంచిది. ఒకవేళ మీరు స్పోర్టీ, పవర్‌ఫుల్ బైక్ కోసం చూస్తున్నట్లయితే బజాజ్ Pulsar 125 మీకు మంచి ఎంపిక.