TVS Radeon Down Payment Finance Plan: మన మార్కెట్‌లో Hero Splendor మోస్ట్‌ పాపులర్‌ బైక్‌. ధర, మైలేజ్‌, కంఫర్ట్ విషయంలో దీనికి అతి పెద్ద పోటీదారు టీవీఎస్ రేడియాన్‌. జీఎస్టీ తగ్గింపు తర్వాత, టీవీఎస్‌ రేడియాన్‌ ధర మరింత తగ్గింది. ఈ టూవీలర్‌ను, ఇప్పుడు, తెలుగు రాష్ట్రాల్లో ₹67,800 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు (TVS Radeon ex-showroom price, Hyderabad Vijayawada) కొనుగోలు చేయవచ్చు. మీ బడ్జెట్‌లో హీరో స్ప్లెండర్‌ను పోలిన బైక్ కోసం చూస్తుంటే, టీవీఎస్ రేడియాన్‌ మంచి ఎంపిక కావచ్చు. 

టీవీఎస్ రేడియాన్‌ ఆన్-రోడ్ ధరGST తగ్గింపు తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాల్లో, TVS Radeon ను కేవలం ₹86,763 ఆన్-రోడ్ ధరకు (TVS Radeon on-road price, Hyderabad Vijayawada) కొనుగోలు చేయవచ్చు. ఈ ఆన్-రోడ్ ధరలో... ఎక్స్‌-షోరూమ్‌ రేటుతో పాటు, దాదాపు ₹8,200 RTO టాక్స్‌లు, ₹7,100 బీమా & ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉన్నాయి. 

మీరు సైకిల్‌ను ఎంత డౌన్ పేమెంట్‌కు పొందుతారు? మీరు TVS Radeon కొనడానికి ₹10,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన ₹76,763 ను బైక్ లోన్‌గా తీసుకోవాలి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందవచ్చు. బ్యాంక్‌ మీకు 9% వడ్డీ రేటుతో ఈ లోన్ ఇచ్చిందని అనుకుందాం. 

మూడేళ్ల కాలానికి మీరు ఈ లోన్ తీసుకుంటే, నెలకు ₹2,708 EMI చెల్లించాలి. ఈ మూడేళ్లలో మీరు మొత్తం ₹20,725 వడ్డీ చెల్లించాలి. 

రెండేళ్ల కాలానికి మీరు ఈ లోన్ తీసుకుంటే, నెలకు ₹3,774 EMI చెల్లించాలి. ఈ రెండేళ్లలో మీరు మొత్తం ₹13,813 వడ్డీ చెల్లించాలి. 

కేవలం ఒక్క సంవత్సరంలో అప్పు మొత్తం తీర్చేయాలనుకుంటే, నెలకు ₹6,973 EMI చెల్లించాలి. ఈ 12 నెలల్లో మీరు మొత్తం ₹6,913 వడ్డీ చెల్లించాలి. 

TVS Radeon పవర్ టీవీఎస్ రేడియన్ 109.7 సిసి, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 7,350 rpm వద్ద 8.08 bhp పవర్‌ & 4,500 rpm వద్ద 8.7 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో స్మూత్‌గా పని చేస్తుంది.

TVS Radeon మైలేజ్ఈ TVS బైక్‌కు 10-లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. మైలేజ్ పరంగా, దీని ARAI-క్లెయిమ్ చేసిన మైలేజ్ లీటరుకు 73 km. ఈ ప్రకారం, ఫుల్‌ ట్యాంక్‌తో ఈ మోటార్‌ సైకిల్‌ని 700 కిలోమీటర్లకు పైగా సులభంగా నడపవచ్చు.

Radeon 110 అన్ని వేరియంట్లు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తాయి. ఈ బైక్‌లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. TVS Radeon హీరో స్ప్లెండర్ ప్లస్ & హోండా CD 110 డ్రీమ్ & బజాజ్ ప్లాటినా వంటి ఇతర 110cc కమ్యూటర్ బైక్‌లతో పోటీ పడుతుంది.