TVS Ntorq 150 Details In Telugu: స్కూటర్‌ అంటే కేవలం రోజువారీ అవసరాల కోసం ఉపయోగించే వాహనం మాత్రమే కాదు. అందులో కొంత సరదా కూడా ఉండాలి. ఈ విషయాన్ని TVS ఎన్‌టార్క్‌ 150 నిరూపిస్తోంది. 4,000 కి.మీ. ప్రయాణం తర్వాత ఈ స్పోర్టీ స్కూటర్‌పై ఎక్స్‌పర్ట్‌ల అనుభవం ఇది. సాధారణంగా.. ప్రజలు రోజువారీ ప్రయాణానికి మోటార్‌సైకిళ్లను ఎక్కువగా ఇష్టపడతారు. పెద్ద చక్రాలు, మెరుగైన సస్పెన్షన్‌ కారణంగా అవి రోడ్డుపై మరింత స్థిరంగా అనిపిస్తాయి. ట్రాఫిక్‌లో వేగంగా ముందుకు వెళ్లేందుకు కూడా బైక్‌లు ఉపయోగపడతాయి. అయితే, టీవీఎస్‌ ఎన్‌టార్క్‌ 150 ఈ అభిప్రాయాన్ని కొంత మార్చింది.

Continues below advertisement

ప్లస్‌లు

టీవీఎస్‌ ఎన్‌టార్క్‌ 150లో మొదట ఆకట్టుకునేది పనితీరు. ఓవర్‌టేక్‌ చేయడం చాలా సులభం. ట్రాఫిక్‌లో త్వరగా ముందుకు వెళ్లేందుకు యాక్సిలరేటర్‌ను పూర్తిగా తిప్పాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు. ఇంజిన్‌ స్పందన ఉత్సాహంగా ఉంటుంది. ఎగ్జాస్ట్‌ శబ్దం కూడా స్పోర్టీ అనుభూతిని ఇస్తుంది.

Continues below advertisement

రైడింగ్‌ మోడ్‌లు మరో ఉపయోగకరమైన అంశం. భారీ వర్షాల్లో రోడ్లు జారుడుగా ఉన్నప్పుడు స్ట్రీట్‌ మోడ్‌ బాగా ఉపయోగపడింది. ఈ మోడ్‌లో పవర్‌ డెలివరీ కొద్దిగా తగ్గుతుంది. దీంతో తడి రోడ్లపై స్కూటర్‌ను నియంత్రించడం సులభంగా అనిపించింది.

ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌ కూడా ఆకట్టుకుంది. బ్రేకింగ్‌ శక్తి బలంగా ఉంది. ABS కూడా అవసరమైన సమయంలో మాత్రమే జోక్యం చేసుకుంటుంది. అయితే వెనుక డ్రమ్‌ బ్రేక్‌ను సుమారు ప్రతి 300 కి.మీ.కి ఒకసారి సర్దుబాటు చేయాల్సి వచ్చింది.

స్పోర్టీ స్వభావం ఉన్నప్పటికీ సస్పెన్షన్‌ పనితీరు చాలా బాగుంది. గుంతలు, దెబ్బతిన్న రోడ్లపై కూడా ఇది సౌకర్యవంతంగా సాగింది, కొన్ని ఫ్యామిలీ స్కూటర్ల కంటే కూడా మెరుగ్గా ఉంది.

సౌకర్యాల విషయంలో అండర్‌-సీట్‌ స్టోరేజ్‌ అవసరాలకు సరిపోతుంది. ఎడమ వైపు ఉన్న స్విచ్‌గేర్‌తో TFT డిస్‌ప్లేలోని మెనూలను సులభంగా నియంత్రించవచ్చు. బయట నుంచే ఇంధనం నింపుకునే సదుపాయం కూడా సమయాన్ని ఆదా చేస్తుంది.

ఇది కూడా చదవండి: పవర్‌ఫుల్ పల్సర్ బైక్ Pulsar NS 400Z లాంచ్.. ఫీచర్లు చూశారా- డ్యూక్ బైక్‌కు గట్టి పోటీ !

మైనస్‌లు

అయితే స్టార్ట్‌-స్టాప్‌ వ్యవస్థ అంతగా నచ్చలేదు. ఇది స్ట్రీట్‌ మోడ్‌లో పనిచేస్తుంది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఇంజిన్‌ ఆగిన తర్వాత యాక్సిలరేటర్‌ తిప్పితే తిరిగి స్టార్ట్‌ కావడానికి కొంత అదనపు సమయం పడుతుంది. సిగ్నల్‌ పడగానే వేగంగా ముందుకు వెళ్లాలనుకునే సమయంలో ఇది కొంత చిరాకు కలిగిస్తుంది. అందుకే దీన్ని ఆఫ్‌ చేసి ఇంజిన్‌ను ఐడిల్‌లో ఉంచడమే ఎక్కువగా నచ్చింది.

మిర్రర్లు మరో చిన్న సమస్య. వెనుక వైపు మంచి దృశ్యం కనిపిస్తుంది. కానీ ఈ అద్దాలు బయటకు ఎక్కువగా పొడుచుకొచ్చినట్లు ఉంటాయి. దీంతో రద్దీగా ఉన్న ట్రాఫిక్‌లో చిన్న గ్యాప్‌ల మధ్య నుంచి వెళ్లడం కొంత కష్టమవుతుంది.

4,020 కి.మీ. రోజువారీ ప్రయాణంలో ఎన్‌టార్క్‌ 150 మంచి సామర్థ్యాన్ని చూపించింది. పెర్ఫార్మెన్స్‌ కోరుకునే వారికి ఇది ఉత్సాహాన్ని ఇస్తుంది. చెత్త రోడ్లపై మంచి రైడ్‌ను అందిస్తుంది. రోజువారీ వినియోగానికి అవసరమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి.

కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ఈ స్కూటర్‌తో ఎక్కువ కాలం గడిపిన కొద్దీ దాని ప్రయోజనాలు మరింత స్పష్టంగా కనిపించాయి. మోటార్‌సైకిల్‌కు బదులుగా రోజువారీ ప్రయాణానికి ఎన్‌టార్క్‌ 150ను ఎంచుకోవచ్చనే నమ్మకాన్ని ఇది కలిగింది. 

ఇది కూడా చదవండి: రూ.లక్షల్లో కొత్త కారు, రూ.వేలల్లో మెయింటెనెన్స్‌ ఖర్చు! క్యాబ్‌లో తిరగడమే బెటర్‌ ఐడియానా?

ఓడోమీటర్‌: 4,020 కి.మీ.ధర: రూ.1.21 లక్షలు, ఎక్స్‌-షోరూమ్‌  లోపాలు: ఏవీ లేవు  నిర్వహణ ఖర్చు: ఏదీ లేదు

గమనిక: పైన చెప్పిన వివరణ మొత్తం 4,020 కి.మీ. ప్రయాణంలో ఎక్స్‌పర్ట్‌ల అనుభవం అని పాఠకులు గమనించాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.