TVS NTorq 150 Price, Mileage And Features In Telugu: టీవీఎస్ మోటార్ కంపెనీ, తన పాపులర్ స్కూటర్ TVS NTorq 125 విజయవంతం కావడంతో, భారతీయ మార్కెట్‌లోకి కొత్త ఫ్లాగ్‌షిప్ స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్ 150 ని విడుదల చేసింది. ఈ స్కూటర్ భారతదేశంలో అత్యంత వేగవంతమైన ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) స్కూటర్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో, ఈ కొత్త బండి ప్రారంభ ధర దాదాపు రూ. 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ డిసైడ్ చేసింది. టీవీఎస్ కొత్త స్కూటర్... Hero Xoom 160, Yamaha Aerox 155 & Aprilia SR 160 వంటి స్పోర్టీ స్కూటర్‌లకు ప్రత్యక్ష పోటీగా రంగంలోకి వచ్చింది.
ఇంజిన్ & పెర్ఫార్మెన్స్TVS Ntorq 150 స్కూటర్‌లో 149.7cc ఎయిర్-కూల్డ్ O3CTech ఇంజిన్ బిగించారు. ఈ ఇంజిన్ 7000 rpm వద్ద 13 bhp శక్తిని & 5500 rpm వద్ద 14.2 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్‌లో రెండు రైడింగ్ మోడ్‌లు (స్ట్రీట్ & రేస్) ఉన్నాయి. TVS Ntorq 150 పనితీరులో ఇది టాప్ గన్ లాంటిది, కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ./గం వేగాన్ని అందుకుంటుంది. అంతేకాదు, గరిష్టంగా 104 కి.మీ./గం వేగంతో హైవే మీద దూసుకెళ్లగలదు. ఈ పెర్ఫార్మెన్స్ కారణంగా, TVS Ntorq 150 స్కూటర్ భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన ICE స్కూటర్‌గా అవతరిస్తుందని కంపెనీ ప్రకటించింది.
స్మార్ట్ టెక్నాలజీ & కనెక్టివిటీకొత్త TVS Ntorq 150 స్కూటర్‌లో మొదట చెప్పుకోవాల్సిన విషయం దాని హై-రిజల్యూషన్ TFT డిస్‌ప్లే, ఇది TVS SmartXonnect టెక్నాలజీతో వస్తుంది. ఇది 50 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్లను కలిగి ఉంటుంది, మిమ్మల్ని స్మార్ట్ రైడర్‌గా మారుస్తుంది. కనెక్టెడ్ ఫీచర్లలో... టర్న్-బై-టర్న్ నావిగేషన్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, కాల్ & మెసేజ్ అలెర్ట్స్, OTA అప్‌డేట్స్, అలెక్సా & స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్ ఉన్నాయి. ఈ లక్షణాలన్నింటినీ 4-వే స్విచ్ గేర్‌తో సులభంగా నియంత్రించవచ్చు, ఇవన్నీ మీ రైడింగ్ అనుభవంలో హై టెక్నాలజీని యాడ్ చేస్తాయి.
భద్రత & అధునాతన ఫీచర్లుపెర్ఫార్మెన్స్ & ఫీచర్లతో పాటు రైడర్ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని TVS Ntorq 150 ని డిజైన్ చేశారు. ఈ టూవీలర్‌లో అనేక అధునాతన సేఫ్టీ ఫీచర్లు యాడ్ చేశారు. వాటిలో.. ABS & ట్రాక్షన్ కంట్రోల్, హజార్డ్ లాంప్, క్రాష్ & థెఫ్ట్ అలెర్ట్స్, అత్యవసర బ్రేక్ హెచ్చరిక వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా, ఈ స్కూటర్ స్టైలిష్ & స్పీడీ మాత్రమే కాకుండా, భద్రత పరంగా ప్రీమియం అనుభూతిని కూడా ఇస్తుంది. ఈ స్కూటర్ ప్రత్యేకంగా స్పోర్టీ డిజైన్, హై పెర్ఫార్మెన్స్ & కనెక్టెడ్ స్మార్ట్ ఫీచర్ల కోసం చూస్తున్న కస్టమర్లకు TVS Ntorq 150 మంచి ఛాయిస్ కాగలదు.