TVS Bikes 2026: భారతీయ టూవీలర్ రంగంలో నమ్మకానికి, సాంకేతికతకు మారుపేరుగా నిలిచిన టీవీఎస్ మోటార్స్ కంపెనీ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. 1911లో టీవీ సుందరం అయ్యంగార్ స్థాపించిన రవాణా సంస్థగా ప్రారంభమై నేడు ప్రపంచవ్యాప్తంగా 80కిపైగా దేశాలకు వాహనాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. బిల్ట్ టు ఫెర్ఫార్మ్ అనే ట్యాగ్‌లైన్‌తో దూసుకుపోతున్న సంస్థ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవసరమయ్యే తక్కువ ధర బైకుల నుంచి వేగాన్ని ఇష్టపడే యువత కోసం ప్రీమియం రేసింగ్ బైకుల వరకు అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన ఆప్షన్లు అందిస్తోంది.
ధరలు- వైవిధ్యం
ప్రస్తుతం భారత మార్కెట్‌లో టీవీఎస్ బైకుల ధరలు 55, 400 నుంచి ప్రారంభమై, గరిష్టంగా 3, 10, 640 వరకు ఉన్నాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కంపెనీ 6 కమ్యూటర్ మోడళ్లు, క్రూయిజర్, 1 రోడ్‌స్టర్, 2 స్పోర్ట్స్ నేక్డ్, 3 స్పోర్ట్స్, 1 అడ్వెంచర్ టూర్, 1 ఆఫ్‌రోడ్ బైకును విక్రయిస్తోంది.
బడ్జెట్, మైలేజీ ప్రియుల కోసం..
నిత్యం ఆఫీసులకు, పనులకు వెళ్లే వారికి మైలేజ్ అనేది ప్రాధాన్యత. ఈ విభాగంలో టీవీఎస్ తనదైన ముద్రవేసింది.
టీవీఎస్ స్పోర్ట్
ఇది కంపెనీలో అత్యంత చౌకైన బైకుగా నిలుస్తోంది.దీని ధర 55, 100 నుంచి 57, 100 మధ్య ఉంటుంది.
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్
మైలేజీ విషయంలో ఇది రారాజు అని చెప్పవచ్చు. కంపెనీ పరీక్షల ప్రకారం ఇది నగరాల్లో లీటరుకు 83.09 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ధర సుమారు 72, 500 వరకు ఉంటుంది.
టీవీఎస్ రేడియాన్
55, 400 ప్రారంభ ధరతో లభించే ఈ బైక్, సాధారణ ప్రయాణికులకు అత్యంత అనువైంది.
యువత మనసు దోచిన టీవీఎస్ రైడర్
125సీసీ విభాగంలో టీవీఎస్ రైడర్ ఒక సంచలనంగా మారింది. స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లు కోరుకునే యువతను ఇది విపరీతం ఆకట్టుకుంటోంది. దీని ధర 82వేల నుంచి ప్రారంభమై సుమారు 93,800 వరకు ఉంటుంది. హైవేలై ఇది 75 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని రివ్యూలు చెబుతున్నాయి.
అపాచీ సిరీస్
టీవీఎస్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచిన ఘనత అపాచీ సిరీస్‌దే. రేసింగ్ ట్రాక్ అనుభవాన్ని సాధారణ రోడ్లపై అందించే ఈ బైకులు వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.
అపాచీ ఆర్టీఆర్ 160 & 160 4v
వీటి ధరలు 1,11, 490 నుంచి రు. 1, 35, 840 మధ్య ఉన్నాయి రోజువారీ ప్రయాణాల్లో స్పోర్టీ లుక్ కోరుకునే వారికి ఇవి సరైన ఎంపిక.
అపాచీ RTR 310
ఇది టీవీఎస్ ఫ్లాగ్‌షిప్ మోడల్. BMW మోటోరాడ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ బైక్ ధర రూ. 2.57 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది రేసింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
కొత్త ప్రయోగాలు టీవీఎస్ రోనిన్- అపాచీ RTX
టీవీఎస్ రోనిన్
నియో రెట్రో స్టైల్‌లో ఉండే ఈ క్రూయిజర్ బైక్ రూ. 1, 26, 69 ప్రారంభ ధరతో లభిస్తుంది. ఇది అటు సిటీ రైడింగ్‌కు, ఇటు లాంగ్ టూరింగ్‌కు సౌకర్యవంతంగా ఉంటుంది.
అపాచీ RTX 300
ఇది టీవీఎస్‌నుంచి వచ్చిన మొదటి అడ్వెంచర్ బైక్. 299సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ ధర 1.99 లక్షల నుంచి 2.29లక్షల మధ్య ఉంది.
భవిష్యత్‌లో వచ్చే మోడల్స్
టీవీఎస్ రానున్న కాలంలో ఎలక్ట్రిక్, హై పెర్ఫార్మెన్స్ విభాగాలపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది అక్టోబర్‌లో టీవీఎస్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయనుంది. నార్టన్ భాగస్వామ్యంతో వీఎస్ అపాచీ RR 450 బైక్‌ను 450సీసీ విభాగంలో సుమారు 4.20 లక్షల బడ్జెట్‌లో తీసుకొస్తోంది. టీవీఎస్ టాంజెంట్ RR కాన్సెప్ట్‌తో ట్రాక్ రేసింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ తీసుకురానుంది.
వినియోగదారుల సేవల నెట్‌వర్క్
భారత్ అంతటా టీవీఎస్‌కు 6, 757 డీలర్ షోరూమ్‌లు, 2, 164 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఇది వినియోగదారులకు అమ్మకాల తదుపరి సేవలను సులభతరం చేస్తోంది. జూపిటర్, ఎన్‌టార్క్ వంటి స్కూటర్లతోపాటు ఐక్యూబ్, వంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ో టీవీఎస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
