Best Electric Scooter For Daily Use: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇప్పుడు డిమాండ్ మామూలుగా లేదు. టూవీలర్ కంపెనీలు, సంప్రదాయ బైక్‌ల తయారీ కన్నా ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయడానికే ఇప్పుడు ఇష్టపడుతున్నాయి. రెండు కొత్త స్కూటర్లు TVS Arbiter & Ather Rizta ఈ రేసులోకి ప్రవేశించాయి. ఈ రెండు టూవీలర్లు రోజువారీ అప్-డౌన్ & అర్బన్ రోడ్లకు మంచి ఆప్షన్లు.
బడ్జెట్ అనుకూలమైన vs ప్రీమియం ధర
హైదరాబాద్ & విజయవాడలో, టీవీఎస్ ఆర్బిటర్ ప్రారంభ ధర రూ. 99,900 (ఎక్స్-షోరూమ్). ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1.20 లక్షలు. ఇది, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుకూలమైన ధర ఉన్న & లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. బడ్జెట్ చూసుకునే కొనుగోలుదారులకు ఇది ఒక బలమైన ఎంపిక.
ఏథర్ రిజ్టా ధర 1.17 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై 1.85 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్ & బ్యాటరీ ఎంపికను బట్టి ఈ రేటు మారుతుంది. ప్రీమియం ఫీచర్లు & ఫ్యామిలీ రైడింగ్ అనుభవంపై ఈ స్కూటర్ ఫోకస్ ఉంటుంది. మీరు తక్కువ బడ్జెట్‌లో ఇ-స్కూటర్ కోరుకుంటే ఆర్బిటర్ ఉత్తమమైనది. ఫ్యామిలీ & హై-టెక్ ఫీచర్లకు రిజ్టా సరైనది.
డిజైన్ ఎలా ఉంది?
TVS ఆర్బిటర్ డిజైన్ సింపుల్‌గా, బాక్సీగా & ఆధునికంగా ఉంటుంది. ఈ బండి బరువు 112 కిలోలు, 14 అంగుళాల ముందు & 12 అంగుళాల వెనుక చక్రాలు, 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ & 845 mm పొడవైన ఫ్లాట్ సీటు నగర ట్రాఫిక్‌లో సౌకర్యవంతంగా ఉంటాయి. ఇది 6 రంగు ఎంపికలలో లభిస్తుంది.
ఏథర్ రిజ్టా ఎక్కువ ప్రీమియం & వైడ్ డిజైన్‌తో వస్తుంది. దీని పెద్ద సీటు & ఫ్యామిలీ-ఫ్రెండ్లీ స్టైల్ కారణంగా.. వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే కాకుండా కుటుంబం కోసం కూడా ఉపయోగించాలనుకునే వారికి ఈ స్కూటర్ మంచిది. ఇది 8 రంగులలో అందుబాటులో ఉంది.
పెర్ఫార్మెన్స్
TVS ఆర్బిటర్‌లో 2.5 kW హబ్ మోటార్ ఉంది, ఇది కేవలం 6.8 సెకన్లలో 0-40 కి.మీ/గం. కు వేగాన్ని అందుకుంటుంది & గరిష్టంగా గంటకు 68 కి.మీ. వేగంతో దూసుకువెళ్తుంది. రోజువారీ అప్-డౌన్‌లు & పట్టణ/నగర రోడ్లకు ఇది అనుకూలంగా ఉంటుంది.
ఏథర్ రిజ్టాలో 4.3 kW PMSM మోటార్ ఉంది, ఇది గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది & 22 Nm టార్క్‌ను అందిస్తుంది. దీని అధిక యాక్సిలరేషన్ లాంగ్ రైడింగ్స్‌కు & హైవే రైడింగ్స్‌కు బాగా పనికొస్తుంది.
బ్యాటరీ & పరిధి
TVS ఆర్బిటర్ 3.1 kWh ఫిక్స్‌డ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 158 కి.మీ. IDC రేంజ్‌ను ఇస్తుంది. ఈ బ్యాటరీ 0 నుంచి 80% వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు 4 గంటల 10 నిమిషాలు పడుతుంది.
Ather రిజ్టా రెండు బ్యాటరీ ఎంపికలతో వచ్చింది. 2.9 kWh బ్యాటరీ ప్యాక్ 123 కి.మీ. రైడింగ్ రేంజ్ ఇస్తుంది. 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఇది 159 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఇంకా, Rizta Ather Grid నెట్‌వర్క్ నుంచి వేగవంతమైన ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఫీచర్లు
TVS ఆర్బిటర్‌లో... క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, హిల్-హోల్డ్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ & 34 లీటర్ల బూట్ స్పేస్ వంటి ఫీచర్లు పొందుతారు.
Ather రిజ్టా మరింత ప్రీమియం టెక్నాలజీతో స్మార్ట్‌గా పని చేస్తుంది. 7 అంగుళాల ఆండ్రాయిడ్ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్, అలెక్సా, వాట్సాప్ ఇంటిగ్రేషన్, స్కిడ్ కంట్రోల్ & 56 లీటర్ల స్పేస్ (34 లీటర్లు అండర్-సీట్ + 22 లీటర్ల ఫ్రంక్)ను ఈ టూవీలర్ అందిస్తుంది.
పెద్ద సంఖ్యలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు లేకపోయినా పర్లేదు, తక్కువ ధరలో మంచి స్కూటర్ కావాలనుకునే వాళ్లకు TVS ఆర్బిటర్ బెటర్ ఛాయిస్. హైటెక్ ఫీచర్లు, అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వాళ్లకు Ather రిజ్టా మంచి ఆప్షన్.