TVS Apache RTX 300 Real World Mileage: టీవీఎస్‌ మోటార్ కంపెనీ నుంచి వచ్చిన Apache RTX 300 సాధారణ లాంచ్‌ కాదు. హోసూర్‌ కేంద్రంగా ఉన్న TVS చరిత్రలో ఇది మొదటి అడ్వెంచర్‌ బైక్‌. అంతేకాదు, భవిష్యత్తులో వచ్చే మరిన్ని మోడళ్లకు పునాదిగా ఉండే సరికొత్త 300cc ఇంజిన్‌ను కూడా ఈ కంపెనీ మొదటిసారి పరిచయం చేసింది. అలాంటి బైక్‌ నిజ జీవితంలో ఎంత మైలేజ్‌ ఇస్తుందో తెలుసుకోవడానికి ఎక్స్‌పర్ట్‌లు దీనిని పరీక్షించారు.

Continues below advertisement

TVS Apache RTX 300 రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌

సాధారణ టెస్టింగ్‌ విధానం ప్రకారం, ముందుగా Apache RTX 300ను హైవేపైకి తీసుకెళ్లారు. సాధారణంగా 50 కిలోమీటర్ల రౌండ్‌ ట్రిప్‌ చేస్తారు, కానీ ఈసారి దాదాపు 65 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆ రైడ్‌ తర్వాత ట్యాంక్‌ను మళ్లీ పూర్తిగా నింపేందుకు 1.6 లీటర్ల పెట్రోల్ అవసరమైంది. దీని ఆధారంగా లెక్కిస్తే, హైవేపై RTX 300 ఇచ్చిన మైలేజ్‌ లీటరుకు 40.60 కిలోమీటర్లుగా నమోదైంది.

Continues below advertisement

హైవే టెస్ట్‌ పూర్తయిన తర్వాత బైక్‌ను ట్రాఫిక్‌తో కిటకిటలాడే నగర రోడ్లపైకి తీసుకెళ్లారు. సిగ్నల్స్‌, స్టాప్‌–గో డ్రైవింగ్‌, బిజీ ట్రాఫిక్‌ మధ్య దాదాపు 50 కిలోమీటర్లు సిటీ రైడ్‌ చేశారు. ఈసారి ట్యాంక్‌ను నింపేందుకు 1.3 లీటర్ల పెట్రోల్ ఖర్చైంది. అంటే నగరంలో RTX 300 ఇచ్చిన మైలేజ్‌ లీటరుకు 35.80 కిలోమీటర్లు.

మైలేజ్‌ సారాంశం

సిటీలో: లీటరుకు 35.80 కిలోమీటర్లు

హైవేపై: లీటరుకు 40.60 కిలోమీటర్లు

సగటున: లీటరుకు 38.20 కిలోమీటర్లు

కొత్త 300cc ఇంజిన్‌ ఎందుకు ఇంత మైలేజ్‌ ఇస్తోంది?

RTX 300లోని కొత్త 300cc ఇంజిన్‌ నగర వినియోగానికి చాలా అనుకూలంగా రూపొందించారు. తక్కువ RPMలలోనే బైక్‌ సాఫీగా ముందుకు కదులుతుంది. దాంతో థ్రాటిల్‌ను గట్టిగా తిప్పాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా ఇంధన వినియోగం తగ్గుతుంది.

హైవేపై చట్టబద్ధమైన 80 కి.మీ. వేగంతో ప్రయాణించినప్పుడు, టాప్‌ గియర్‌లో ఇంజిన్‌ పూర్తిగా స్ట్రెస్‌ లేకుండా క్రూజ్‌ చేస్తుంది. గియర్‌ రేషియోలు బాగా స్పేస్‌ చేసి ఉండటం వల్ల వేగం పెంచినా ఇంజిన్‌పై అదనపు ఒత్తిడి కనిపించదు.

400cc బైక్‌లతో పోలిస్తే స్పష్టమైన లాభం

RTX 300 ఇంజిన్‌ సామర్థ్యం 300cc మాత్రమే కావడంతో, 400cc అడ్వెంచర్‌ బైక్‌లతో పోలిస్తే సహజంగానే మంచి ఫ్యూయల్‌ ఎకానమీ ఇస్తుంది. ట్యాంక్‌ సామర్థ్యం 12.5 లీటర్లు మాత్రమే అయినప్పటికీ, ఫుల్‌ ట్యాంక్‌తో ఒకేసారి 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించడం వాస్తవంగా సాధ్యమే. హైవేపై ట్రిపుల్‌ డిజిట్‌ స్పీడ్స్‌లో రైడ్‌ చేసినా కూడా ఇదే రేంజ్‌ అందించే శక్తి RTX 300లో ఉంది.

ఫ్యూయల్‌ ఎకానమీ టెస్ట్‌ ఎలా చేశారు?

ముందుగా ట్యాంక్‌ను పూర్తిగా నింపారు. కంపెనీ సూచించిన టైర్‌ ప్రెషర్‌ను సెట్‌ చేశారు. నిర్ణీత నగర, హైవే రూట్లపై రైడ్‌ చేస్తూ నిజ జీవిత పరిస్థితులకు దగ్గరగా ఉండే సగటు వేగాలను పాటించారు. రైడర్‌ బరువు, లోడ్‌ అన్నీ సమానంగా ఉంచి, చివరలో మళ్లీ ట్యాంక్‌ను నింపి, అప్పటి వరకు ఖర్చయిన ఇంధనాన్ని లెక్కించారు. దీనిని బట్టి, నిజ జీవిత మైలేజ్‌ లెక్కలు తీశారు.

మొత్తంగా చూస్తే.. TVS Apache RTX 300 మైలేజ్‌, పనితీరు రెండింటిలోనూ అడ్వెంచర్‌ బైక్‌ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.