TVS Apache RTR 160 Price, Mileage Features In Telugu: తెలుగు రాష్ట్రాల్లోని డాషింగ్‌ యంగ్‌స్టర్స్‌ కోసం ప్రత్యేకంగా రూపొందిన పర్ఫార్మెన్స్‌ బైక్‌ ఏదైనా ఉంటే, అది TVS Apache RTR 160 అని చెప్పాలి. ఏ వైపు నుంచి చూసినా అగ్రెసివ్‌గా కనిపించే లుక్‌, శక్తిమంతమైన ఇంజిన్‌, అందుబాటులో ఉండే ధర - ఇవన్నీ ఈ బైక్‌ను నిజమైన యూత్‌ ఐకాన్‌గా నిలబెడుతున్నాయి.


రేసింగ్‌ స్పిరిట్‌
అపాచీ RTR 160 లుక్‌ చూసిన క్షణమే, అది ఒక రేసింగ్‌ స్పిరిట్‌తో రూపొందిన బైక్‌ అని తెలుస్తుంది. షార్ప్‌ ఏరోడైనమిక్‌ ఫెయరింగ్‌, అగ్రెసివ్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, స్పోర్టీ గ్రాఫిక్స్‌ - ఇవన్నీ యువతను దృష్టిలో పెట్టుకుని డిజైన్‌ చేశారు. సిటీ ట్రాఫిక్‌లోనూ ఈ బైక్‌ ప్రత్యేకంగా కనిపిస్తుంది. స్ప్లిట్‌ సీటు, మసిల్స్‌తో నిండిన ఫ్యూయల్‌ ట్యాంక్‌, ఫుల్‌ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌ ఒక మోడర్న్‌ లుక్‌ ఇస్తాయి.


ఈ సెగ్మెంట్‌లోనే లేని ఫీచర్లను TVS ఈ బైక్‌లో యాడ్‌ చేసింది. పూర్తి LED లైటింగ్‌ సిస్టమ్‌ (హెడ్‌ల్యాంప్స్‌, DRLs, టెయిల్‌లైట్స్‌), బ్లూటూత్‌ కనెక్టివిటీతో డిజిటల్‌ కన్సోల్‌, పాస్‌ స్విచ్‌, కిల్‌ స్విచ్‌, లో-ఫ్యూయల్‌ ఇండికేటర్‌ వంటివి ఈ బండిలో కనిపిస్తాయి, రైడింగ్‌ అనుభవాన్ని మరింత ఈజీ చేస్తాయి. యువతకు కావాల్సిన టెక్నాలజీ అందుబాటులో ఉండటం ఈ బైక్‌కి పెద్ద ప్లస్‌.


ఇంజిన్‌ పవర్‌ & పెర్ఫార్మెన్స్‌
160సీసీ సింగిల్‌-సిలిండర్‌, ఎయిర్-ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ నుంచి 17.63 PS పవర్‌, 14.73 Nm టార్క్‌ లభిస్తుంది. 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ వల్ల గేర్‌ షిఫ్టింగ్‌ మృదువుగా ఉంటుంది. పెర్ఫార్మెన్స్‌లో సూపర్‌ అనిపించకోవడంతో పాటు, ఈ బైక్‌ 50-55 kmpl వరకు మైలేజ్‌ ఇస్తుంది. అంటే పర్ఫార్మెన్స్‌తో పాటు మైలేజ్‌ కూడా రాజీ పడకుండా ఇస్తుంది.


పర్‌ఫెక్ట్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌
ఫ్రంట్‌ టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, రియర్‌ మోనోషాక్‌ సస్పెన్షన్‌తో ఈ బైక్‌ సిటీ రోడ్లపై, హైవేలో ఒకే విధమైన కంఫర్ట్‌ను ఇస్తుంది. ముందు-వెనుక డిస్క్‌ బ్రేకులు, ఆప్షనల్‌ ABS ఉండటంతో ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ సమయంలోనూ నమ్మకంగా ఉంటుంది. తక్కువ వెయిట్‌ చాసిస్‌, కాంపాక్ట్‌ వీల్‌బేస్‌ వల్ల ట్రాఫిక్‌లో ఈజీగా నడిపించుకోవచ్చు.


ధర - EMI ఆప్షన్‌
TVS Apache RTR 160 ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1.11 లక్షలు. EMI ఆప్షన్‌లో, కేవలం రూ. 18,500 డౌన్‌పేమెంట్‌తో బైక్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు. నెలకు సుమారు రూ. 4,336 EMIతో మూడేళ్లలో అప్పు తీర్చేయవచ్చు. ఈజీ EMI ఆప్షన్‌ కాబట్టి, యువత ఈ బైక్‌ను సులభంగా ఓన్‌ చేసుకోవచ్చు.


స్టైల్‌, ఫీచర్లు, శక్తిమంతమైన ఇంజిన్‌, అద్భుతమైన మైలేజ్‌, తక్కువ ధర వంటివన్నీ TVS Apache RTR 160 ను యువత కోసం బెస్ట్‌ ఎంట్రీ లెవెల్‌ పర్ఫార్మెన్స్‌ బైక్‌గా చూపిస్తున్నాయి. నగరంలోనూ, హైవేలోనూ ఈ బైక్‌ యంగ్‌స్టర్స్‌కు కావలసిన థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. కొత్త లుక్స్‌, నయా ఫీచర్లతో మళ్లీ 160సీసీ సెగ్మెంట్‌లో బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేస్తోంది.