TVS Apache RTR 160 4V Loan and EMI Details: ఆఫీసులకు వెళ్లే యువ ఉద్యోగులు, కాలేజీ స్టూడెంట్స్ అత్యధికంగా ఇష్టపడే 160cc స్పోర్ట్స్ బైక్ విభాగంలో టీవీఎస్ అపాచే RTR 160 4V ప్రత్యేక ముద్ర వేసింది. మెరుగైన పవర్, అగ్రెసివ్ డిజైన్ & టెక్నాలజీలతో వచ్చిన ఈ బైక్ రోడ్లపై రయ్యిన దూసుకుపోతుంది. ఈ బండిని కొనడానికి బ్యాంకులు లోన్ ఆఫర్లతో సిద్ధంగా ఉన్నాయి, పైగా తక్కువ EMI పడే ప్లాన్స్ కూడా ఉన్నాయి.
టీవీఎస్ అపాచే RTR 160 4V ఫీచర్లు
ఈ స్పోర్టీ బైక్ లో 159.7cc 4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 17.55 PS పవర్ & 14.73 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రైడింగ్ కు అనువుగా అర్బన్, రెయిన్ & స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఇందులో లభిస్తాయి. దీనితో పాటు TVS SmartXonnect బ్లూటూత్ కనెక్టివిటీ, అడ్వాన్స్డ్ LED హెడ్ లాంప్, TFT డిస్ ప్లే లేదా LCD క్లస్టర్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ (GTT) & సింగిల్ లేదా డ్యూయల్ ఛానల్ ABS ఆప్షన్లు ఉన్నాయి.
విజయవాడలో ఎక్స్ షోరూమ్ & ఆన్ రోడ్ ధరలు
విజయవాడలో టీవీఎస్ అపాచే RTR 160 4V ఎంట్రీ లెవెల్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 1,15,852. ఆర్టిఓ రిజిస్ట్రేషన్ ఛార్జీలు & ఇన్సూరెన్స్ ప్రీమియం కలిపిన తర్వాత ఆన్ రోడ్ ధర రూ. 1.44 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్‌ను బట్టి ఆన్ రోడ్ ధర మారుతుంది.
హైదరాబాద్‌లో ఎక్స్ షోరూమ్ & ఆన్ రోడ్ ధరలు
హైదరాబాద్ నగరంలో ఈ బండి ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 1,15,852. ఆర్టిఓ రిజిస్ట్రేషన్ ఛార్జీలు & ఇన్సూరెన్స్ ప్రీమియం కలిపితే ఆన్ రోడ్ ధర దాదాపు రూ. 1.47 లక్షలు అవుతుంది.
కనీస డౌన్ పేమెంట్ & తాజా బ్యాంక్ వడ్డీ రేట్లు
ప్రముఖ బ్యాంకులు SBI, HDFC, ICICI, Axis Bank తోపాటు TVS Credit వంటి సంస్థలు ద్విచక్ర వాహనాలపై 8.5 శాతం నుంచి 14 శాతం వరకు వడ్డీతో లోన్లు ఇస్తున్నాయి. మీరు కనీసం రూ. 25,000 డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని లోన్‌గా పొందవచ్చు.
ఇది కూడా చదవండి: బజాజ్ పల్సర్ 150 vs టీవీఎస్ అపాచీ 160.. మీ స్టైల్‌కి ఏది సరిగ్గా సెట్ అవుతుందో తెలుసా?
10 శాతం వార్షిక వడ్డీ రేటు చొప్పున EMI ప్లాన్స్
మీరు, టీవీఎస్ అపాచే RTR 160 4V ఎంట్రీ లెవెల్ మోడల్‌ను హైదరాబాద్‌లో కొనాలనుకుంటే, కనీస డౌన్‌పేమెంట్ రూ. 25,000 చెల్లించి మిగిలిన మొత్తం రూ. 1,22,058 ను లోన్‌గా తీసుకుంటే, ఈ రుణంపై 10 శాతం వార్షిక వడ్డీ రేటు అనుకుంటే, వివిధ టెన్యూర్లకు EMI వివరాలు:
2 ఏళ్ల కాలపరిమితికి (24 నెలలు) నెలవారీ EMI: రూ. 6,1033 ఏళ్ల కాలపరిమితికి (36 నెలలు) నెలవారీ EMI: రూ. 4,4084 ఏళ్ల కాలపరిమితికి (48 నెలలు) నెలవారీ EMI: రూ. 3,5605 ఏళ్ల కాలపరిమితికి (60 నెలలు) నెలవారీ EMI: రూ. 3,051
మీరు, రూ.50,000 డౌన్‌పేమెంట్ చెల్లించి మిగిలిన మొత్తం రూ. 97,058 ను లోన్‌గా తీసుకుంటే, ఈ రుణంపై 10 శాతం వార్షిక వడ్డీ రేటు అనుకుంటే, వివిధ కాలపరిమితులకు EMI ఆప్షన్లు:
2 ఏళ్ల కాలపరిమితికి (24 నెలలు) నెలవారీ EMI: రూ. 4,8533 ఏళ్ల కాలపరిమితికి (36 నెలలు) నెలవారీ EMI: రూ. 3,5054 ఏళ్ల కాలపరిమితికి (48 నెలలు) నెలవారీ EMI: రూ. 2,8315 ఏళ్ల కాలపరిమితికి (60 నెలలు) నెలవారీ EMI: రూ. 2,426
ఇది కూడా చదవండి: Bajaj Chetak C2501: కంపెనీ చెప్పింది 113 కి.మీ. రేంజ్.. నిజంగా వెళ్లింది ఎంత దూరం?
బైక్ ఫైనాన్స్ తీసుకునే ముందు మీ సిబిల్ స్కోర్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు & ప్రీ క్లోజర్ నిబంధనల పై డీలర్ వద్ద ముందే క్లారిటీ తీసుకోండి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
