మనదేశంలో కొన్ని టూ వీలర్ బ్రాండ్లు తమ ఉత్పత్తుల ధరను పెంచనున్నాయనే వార్తలు మనం ఎప్పట్నుంచో వింటూనే ఉన్నాం. ఇప్పుడు తన అపాచీ రేంజ్ వాహనాల ధరను పెంచింది. వీటిలో ప్రముఖ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ కూడా ఉంది. ఇందులో డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.1,17,278 నుంచి రూ.1,19,278కు పెరిగింది.
ఇక డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర అయితే రూ.1,19,385 నుంచి రూ.1,21,485కు పెరిగింది. ఒక వేళ మీరు అపాచీ ఆర్‌టీఆర్ 160 డిస్క్ బ్రేక్ వేరియంట్ విత్ బ్లూటూత్ కొనాలనుకుంటే రూ.1,22,101 బదులు రూ.1,24,201 ఖర్చు చేయాల్సిందే. స్పెషల్ ఎడిషన్ ధర కూడా రూ.1,23,475 నుంచి రూ.1,25,575కు పెరిగింది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే. ఆన్ రోడ్ ధర మరింత పెరిగే అవకాశం ఉంది.
అంటే ఈ 160 సీసీ టీవీఎస్ బైక్ ధర రూ.2,100 పెరిగిందన్న మాట. విడిగా చూస్తే ఇది పెద్ద హైక్ కాదు అనిపించినా... ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రూ.2,000 పెంచారు. రెండిటినీ కలిపితే మాత్రం ధర కొంచెం ఎక్కువే పెరిగినట్లు కనిపిస్తుంది.
ఇందులో 159.7 సీసీ సింగిల్ సిలండర్ ఇంజిన్‌ను అందించారు. దీని ఇంజిన్‌లో నాలుగు వాల్వులు ఉన్నాయి. దీని బీహెచ్‌పీ 17గానూ, టార్క్ 17 ఎన్ఎంగానూ ఉంది. ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అందించారు. బైక్ వెనకవైపు 130 ఎన్ఎం డ్రమ్ బ్రేక్, ముందువైపు 270 ఎంఎం డిస్క్ బ్రేక్ అందుబాటులో ఉంది.
వీటితో పాటు రేసింగ్ డెకాల్స్, అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లీవర్స్, రెడ్ అలోయ్ వీల్స్, కస్టమైజ్డ్ స్టిక్కర్, రాగి కోటింగ్ వేసిన చెయిన్, స్ప్రాకెట్, డ్యూయల్ టోన్ బ్లాక్, రెడ్ సీట్ ప్యాటర్న్, వెనకవైపు రేడియల్ టైర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ బై టర్న్ నేవిగేషన్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ, అర్బన్, రెయిన్, స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్స్ ఇందులో అందించారు.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?