Triumph Thruxton 400 Latest Updates:  ప్రీమియం బైక్ కొనాలనుకునే వారికి ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఒక తీపి కబురు అందించింది. తన పాపులర్ మోడల్ ‘ట్రయంఫ్ త్రక్స్టన్ 400’ ధరను సవరించింది. ఈ నిర్ణయంతో ఇప్పుడు ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 2,65,538 కి చేరుకుంది. గతంలో కంటే ఈ ధర తక్కువ ఉండటం గమనార్హం. దీనికి కారణం ఈ బైక్‌లో చేసిన ఒక ఆసక్తికరమైన మార్పు. కంపెనీ ఇందులో కొత్తగా 350 సీసీ ఇంజిన్‌ను ప్రవేశపెట్టింది. మన దేశంలో 350 సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లపై జీఎస్‌టీ (GST) రేటు కేవలం 18 శాతమే ఉంటుంది. గతంలో బజాజ్ డొమినార్ 400 తరహాలోనే, ఇప్పుడు ట్రయంఫ్ కూడా తక్కువ పన్ను పరిధిలోకి రావడంతో ఈ ధర తగ్గింపు సాధ్యమైంది. ఈఎంఐలో కొనాల‌నుకునేవారు ఈ కింది లెక్క‌లు చూడ‌వ‌చ్చు.

నెలవారీ ఈఎంఐ లెక్కలు:ఒకవేళ మీరు ఈ బైక్‌ను ఫుల్ లోన్ (100% ఎక్స్‌షోరూమ్ ధర) పై తీసుకోవాలని అనుకుంటే, 9.5% వడ్డీ రేటుతో నెలవారీ ఈఎంఐలు ఎలా ఉంటాయో చూద్దాం:  

12 నెలల కాలపరిమితి:  మీరు ఒక సంవత్సరంలో లోన్ తీర్చాలనుకుంటే, ప్రతి నెలా రూ. 23,283 ఈఎంఐ చెల్లించాలి. మొత్తం వడ్డీ రూ. 13,862 అవుతుంది.

24 నెలల కాలపరిమితి: రెండేళ్ల కాలపరిమితి ఎంచుకుంటే నెలవారీ భారం తగ్గి ఈఎంఐ రూ. 12,192 అవుతుంది. మొత్తం వడ్డీ రూ. 27,071 కట్టాలి.

36 నెలల కాలపరిమితి: మూడేళ్ల పాటు లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ. 8,506 కి చేరుతుంది. దీనివల్ల నెలవారీ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఈ కాలంలో వడ్డీ భారం రూ. 40,677 ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇంజిన్ పవర్ - స్పీడ్ వివరాలు..కొత్త ఇంజిన్ వచ్చినప్పటికీ పర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ బైక్ 9,000 rpm వద్ద 41 bhp గరిష్ట పవర్, 7,500 rpm వద్ద 37.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం విషయానికి వస్తే, కేవలం 2.9 సెకన్లలోనే 0 నుండి 60 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. అలాగే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరడానికి 7.5 సెకన్లు సరిపోతుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 161 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. హుస్క్ వర్ణ స్వార్ట్‌పిలెన్ 401, హార్లే డేవిడ్సన్ X440 వంటి గట్టి పోటీ ఉన్న సెగ్మెంట్లో త్రక్స్టన్ 400 ఇప్పుడు మరింత బలమైన పోటీని ఇస్తోంది. ఈ బండి వినూత్నమైన మార్పుతో ఈ బైక్ మార్కెట్లో వినియోగ దారులకు మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంటున్నారు. 

గొప్ప అవ‌కాశం..బడ్జెట్ ధరలో లగ్జరీ రైడింగ్ అనుభవాన్ని కోరుకునే యువతకు ఈ ధర సవరణ ఒక గొప్ప అవకాశం. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్, ఇప్పుడు తగ్గిన ధర కలిపి త్రక్స్టన్ 400ను ఒక బెస్ట్ డీల్‌గా మార్చాయి. మీరు కూడా మీ పాత బైకుని అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తుంటే, ఈ ట్రయంఫ్ బైక్ ఒక మంచి ఆప్షన్ కావచ్చని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇంజిన్ సీసీ మార్పుతో జీ ఎస్టీ ప్రయోజనం కూడా కస్టమర్లకు కంపెనీ అందించిందని నిపుణలు పేర్కొంటున్నారు.