Triumph Thruxton 400 Vs Triumph Speed 400: ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ నుంచి మరో స్టైలిష్‌ బైక్‌ "థ్రక్స్‌టన్‌ 400" ఇటీవలే వెలుగులోకి వచ్చింది. Triumph Speed 400 తర్వాత వచ్చిన ఈ కొత్త మోడల్‌ కేఫే రేసర్‌ లుక్‌లో ఉండటమే కాకుండా, మరింత శక్తిమంతమైన పనితీరుతో యువతరాన్ని ఉర్రూతలూగిస్తోంది.

Continues below advertisement


డిజైన్‌ & స్టైల్‌
థ్రక్స్‌టన్‌ 400ను థ్రక్స్‌టన్‌ 1200 R నుంచి ప్రేరణతో రూపొందించారు. రెట్రో రేసర్‌ స్టైలింగ్‌తో పాటు, కొత్త ఫ్యూయల్‌ ట్యాంక్‌, స్లిమ్‌ టెయిల్‌ సెక్షన్‌, క్లిప్‌-ఆన్‌ హ్యాండిల్‌ బార్స్‌ ఈ బైక్‌కి ప్రత్యేక ఆకర్షణ. 13 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ సామర్థ్యంతో వచ్చిన ఈ బైక్‌లో మోంజా స్టైల్‌ ఫ్యూయల్‌ లిడ్‌ కూడా ఉంది, ఇది క్లాసిక్‌ టచ్‌ ఇస్తుంది.


ఇంజిన్‌ & పనితీరు
ఈ బైక్‌లో 398cc సింగిల్‌ సిలిండర్‌ లిక్విడ్‌-కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 9,000 rpm వద్ద 42 Hp పవర్‌, 7,500 rpm వద్ద 37.5 Nm టార్క్‌ ఇస్తుంది. అంటే Speed 400 కంటే 2 Hp ఎక్కువ. Thruxton 400లో కొత్త క్యామ్‌ టైమింగ్‌, ఎయిర్‌బాక్స్‌ డిజైన్‌ & చిన్న సైజ్‌ రియర్‌ స్ప్రాకెట్‌ ఇచ్చారు.


టాప్‌ స్పీడ్‌ 161 km/h అని కంపెనీ చెబుతోంది, అంటే ట్రయంఫ్‌ 400cc రేంజ్‌లో ఇది ఫాస్టెస్ట్‌ మోడల్‌.


Speed 400తో పోలిక
Speed 400 కంటే Thruxton 400 మరింత స్పోర్టీ రైడింగ్‌ పొజిషన్‌ కలిగిస్తుంది. రైడర్‌ పొజిషన్‌ అగ్రెసివ్‌గా ఉండటం వలన ఇది స్పోర్ట్స్‌ బైక్‌లా ఫీలింగ్‌ ఇస్తుంది. రీడిజైన్‌ చేసిన ఫ్యూయల్‌ ట్యాంక్‌, టెయిల్‌ సెక్షన్‌, పిలియన్‌ సీట్‌ కవర్‌ వంటివి కొత్త స్టైల్‌లో హైలైట్స్‌. గోల్డెన్‌ కలర్‌ ఫోర్క్‌లు లేకపోయినా, కొత్త ఆయిల్‌ రిజర్వాయర్‌ కప్‌ బాగా ఆకట్టుకుంటుంది.      


కంఫర్ట్‌ & యూజ్‌
ఈ బైక్‌ చిన్న ప్రయాణాలకు బాగుంటుంది. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు రైడింగ్‌ పొజిషన్‌ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ చిన్న ట్రిప్స్‌కి సరిపోతుంది. 795 mm సీట్‌ హైట్‌ వలన తక్కువ ఎత్తున్న రైడర్లకూ సులభంగా కంట్రోల్‌ అవుతుంది. 4 కిలోలు ఎక్కువ బరువైనప్పటికీ (87 కిలోలు), రోడ్డు మీద లైట్‌గా ఫీలవుతారు.    


ఫీచర్లు & యాక్సెసరీస్‌
థ్రక్స్‌టన్‌ 400లో మీరు ప్రత్యేకంగా కొనగలిగే యాక్సెసరీస్‌ కూడా ఉన్నాయి, అవి - వాటర్‌ప్రూఫ్‌ టెయిల్‌ బ్యాగ్‌, క్విల్టెడ్‌ సీట్‌, ట్యాంక్‌ ప్యాడ్స్‌, ఇంజిన్‌ గార్డ్‌, బుల్లెట్‌ ఇండికేటర్స్‌, బార్‌ ఎండ్‌ మిర్రర్స్‌ లాంటివి.      


కలర్‌ ఆప్షన్స్‌ నాలుగు ఉన్నాయి - లావా రెడ్‌ గ్లాస్‌ / అల్యూమినియం సిల్వర్‌, ఫాంటమ్‌ బ్లాక్‌ / సిల్వర్‌, మెటాలిక్‌ యెల్లో / సిల్వర్‌, పెర్ల్‌ వైట్‌ / స్టార్మ్‌ గ్రే.    


ధర & పోటీ
థ్రక్స్‌టన్‌ 400 ధర ₹2.74 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌), అంటే స్పీడ్‌ 400 కంటే ₹25000 ఎక్కువ. ఈ బైక్‌ పనితీరు పరంగా శక్తిమంతమైనదే కానీ రైడింగ్‌ పొజిషన్‌ వల్ల ప్రతి ఒక్కరికీ సరిపోదు. కేఫే రేసర్‌ స్టైల్‌ బైక్‌లను ఇష్టపడే బైకర్లకు మాత్రం ఇది పర్ఫెక్ట్‌.     


ప్రస్తుతం, థ్రక్స్‌టన్‌ 400 ప్రధాన పోటీదారు Royal Enfield Continental GT 650.